హీరోయిన్లపై మండిపడుతున్న నెటిజన్లు
ట్విట్టర్ వేదికగా బాలీవుడ్ సెలబ్రిటీలు మరోసారి వివాదానికి తెర తీశారు. ముంబైలో జైన మతస్థులకు సంబంధించిన పవిత్రమైన రోజుల కారణంగా పోలీసులు 8 రోజుల పాటు మాంసం అమ్మకాలపై నిషేధం విధించారు. ఈ నిషేధంపై కొన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేయగా.. మరికొంత మంది వ్యతిరేకించారు. అదే సమయంలో బాలీవుడ్ సెలబ్రిటీలు సీన్ లోకి ఎంటర్ అయి సోషల్నెట్వర్కింగ్ సైట్లలో కామెంట్లు చేయడంతో వివాదం మరింత ముదిరింది.
మంగళవారం నిషేధం విధించగా అదే రోజు సోనమ్ తన ట్విట్టర్ ద్వారా నిషేధాన్ని ఖండించింది. ఇలాంటి చర్య వల్ల మనం మూడో ప్రపంచానికి సంబంధించిన దేశస్తులుగా మిగిలిపోతామంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆమె కామెంట్స్ పై తీవ్రస్థాయిలో దుమారం రేగింది. సోనమ్ కు వ్యతిరేకంగా వందల సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. అయితే సోనమ్ మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉంది.
అక్కడితో వివాదం సద్దుమణిగిందిలే అనుకుంటున్నసమయంలో మరో అగ్గిరాజేసింది సోనాక్షి. మనది స్వతంత్ర దేశం అంటూనే బ్యానిస్థాన్ కు స్వాగతం అంటూ నిషేధంపై సెటైర్ వేసింది. దీంతో సోనమ్ విషయంలో జరిగిన పరిణామాలే మరోసారి రిపీట్ అయ్యాయి. సోనాక్షి కామెంట్ చేసిన కొద్ది గంటల్లోనే ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ వందల సంఖ్యల్లో కామెంట్లు వచ్చాయి. జీవహింస చేయొద్దంటూ యాడ్ ఫిలింస్ లో నటించే తారలు ఇలా మాంసం అమ్మకాలపై నిషేధాన్ని వ్యతిరేకించడం ఎంత వరకు కరెక్ట్ అంటూ, సోనాక్షి కామెంట్స్ పై విరుచుకుపడ్డారు.
This is a free country! Welcome to BAN-istan... I meant india.. Stupid autocorrect.
— Sonakshi Sinha (@sonakshisinha) September 8, 2015
Our country is going to remain a 3rd world nation because of the intolerant misogynistic close minded few. https://t.co/JcIDEC3gQE
— Sonam Kapoor (@sonamakapoor) September 8, 2015