దావూద్ ఇబ్రహీమ్ చెల్లెలిగా... | sonakshi sinha act to Dawood Ibrahim's sister | Sakshi
Sakshi News home page

దావూద్ ఇబ్రహీమ్ చెల్లెలిగా...

Published Tue, Aug 4 2015 12:12 AM | Last Updated on Sun, Sep 3 2017 6:43 AM

దావూద్ ఇబ్రహీమ్ చెల్లెలిగా...

దావూద్ ఇబ్రహీమ్ చెల్లెలిగా...

‘హసీనా’గా సోనాక్షీ సిన్హా నటించనున్నారు. ఇంతకూ ఎవరీ హసీనా అనుకుంటున్నారా...? ముంబై పేలుళ్ల ఘటనతో దేశాన్ని గడగడ లాడించిన చీకటి సామ్రాజ్య అధినేత అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీమ్‌కు స్వయానా సోదరి ఆమె.
 
 దావూద్‌కున్న 12 మంది చెల్లెళ్లలో ఒకరైనా హసీనా జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. రామ్‌చరణ్‌తో హిందీలో ‘జంజీర్’ (తెలుగులో ‘తుఫాన్’) అపూర్వా లాఖియా దర్శకుడు. హసీనా జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనల్ని అల్లుకుని ఈ స్క్రిప్ట్ సిద్ధం చేశారట దర్శకుడు. ఈ విషయాన్ని సోనాక్షి సిన్హా ధ్రువీకరించారు.
 
 ‘‘నా వ్యక్తిత్వానికి పూర్తి భిన్నమైన పాత్ర ఇది. పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తా. బయోపిక్స్‌లో నటించాలన్న కోరిక ఇన్నాళ్లకు తీరుతోంది’’ అని సోనాక్షీ సిన్హా చెప్పుకొచ్చారు. ఈ జీవితకథా చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement