ముంబై: ముంబైలో గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం సహచరులపై ఎన్‌ఐఏ ఒక్కసారిగా దాడులు నిర్వహిస్తోంది. దావుద్ అసాంఘిక కార్యకలాపాలను అణిచివేతలో భాగంగా ఎన్‌ఐఏ నగరంలోని 20 ప్రాంతాల్లో పరారీలో ఉన్న అతని సహచరుల ఆఫీసులపై దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల జాబితాలో.. షార్ప్ షూటర్లు, డ్రగ్స్ దందా చేసేవాళ్లు, హవాలా ఆపరేటర్లు, దావూద్ ఇబ్రహీంకు చెందిన రియల్ ఎస్టేట్ మేనేజర్లు, క్రిమినల్ సిండికేట్‌లోని ఇతర కీలక వ్యక్తుల ఉన్నట్లు తెలుస్తోంది.
బాంద్రా, నాగ్‌పడా, బోరివలి, గోరేగావ్, పరేల్, శాంతాక్రజ్‌లలో ఏకకాలంలో ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. ఉగ్రవాద కార్యకలాపాలు, వ్యవస్థీకృత నేరాలు, దేశంలో అశాంతిని సృష్టించే లక్ష్యంతో చేసిన చర్యలకు సంబంధించి ఎన్‌ఐఏ ఫిబ్రవరిలో కేసు నమోదు చేసింది. డీ కంపెనీకి చెందిన వివిధ కార్యకలాపాలపై నిశీతంగా పరిశీలిస్తోంది. విదేశాల్లో ఉంటూ ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు సాగించే వారిపై ఇప్పటికే ఎన్‌ఐఏ నిఘా పెట్టింది. కాగా ఈ దాడులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment