బాయ్ ఫ్రెండ్ తో ఆ హీరోయిన్ మళ్లీ! | Sonakshi appear With her Boy friend Bunty Sajdeh at a event | Sakshi
Sakshi News home page

బాయ్ ఫ్రెండ్ తో ఆ హీరోయిన్ మళ్లీ!

Published Fri, Oct 7 2016 10:11 PM | Last Updated on Thu, Oct 4 2018 7:55 PM

బాయ్ ఫ్రెండ్ తో ఆ హీరోయిన్ మళ్లీ! - Sakshi

బాయ్ ఫ్రెండ్ తో ఆ హీరోయిన్ మళ్లీ!

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రేమలో ఉందని, బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేస్తోందని కొన్ని రోజుల కిందట వదంతులు ప్రచారమయ్యాయి. అయితే ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఫంక్షన్ కు సోనాక్షి సిన్హా హాజరయింది. ఇదే ఈవెంట్లో ఆమె బాయ్ ఫ్రెండ్ బంటీ సాజ్డే కూడా పాల్గొన్నాడు. దీంతో అందరిదృష్టి వీరిపై పడింది. స్పోర్ట్ అండ్ టాలెంట్ మేనేజ్ మెంట్ కంపెనీకి యజమాని అయిన బంటీతో బొద్దుగుమ్మ సోనాక్షికి కొన్ని నెలల కిందట పరిచయం ఏర్పడింది. అయితే రెండు నెలల కిందట వీరిద్దరూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. తాజాగా మరోసారి సోనాక్షి తన బాయ్ ఫ్రెండ్ బంటీ సాజ్డేతో కలిసి ఓ కార్యక్రమానికి హాజరైందని బాలీవుడ్ ఇండస్ట్రీ టాక్.

సోనాక్షి బ్లూ బాడీవేర్ లో కనిపించగా, బంటీ గ్రే టీషర్ట్ ధరించినట్లు ఫొటోలో కనిపిస్తుంది. ప్రియుడు ఉంటే విదేశీ బీచ్ లలో హాయిగా సేదతీరాలని ఉందని గతంలో పలుమార్లు సోనాక్షినే ప్రస్తావించింది. దీంతో ఆమె ప్రేమలో ఉందని ఇండస్ట్రీ కోడై కూసింది. ఆగస్టులో ఇదే విషయంపై వదంతులు రావడంతో.. మా ఇంట్లో వాళ్లకు తెలిసేలా చేసినందుకు థ్యాంక్స్ అంటూనే అందులో నిజం లేదంటూ చమత్కరించిన విషయం తెలిసిందే. సోనాక్షి ప్రస్తుతం ఫోర్స్ 2 మూవీలో నటిస్తుంది. జాన్ అబ్రహాం, తాహిర్ షా, ఇందులో కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement