సింగపూర్ గ్రాండ్‌ప్రి విజేత వెటెల్
సింగపూర్ : క్వాలిఫయింగ్‌లో కనబరిచిన దూకుడును ప్రధాన రేసులోనూ పునరావృతం చేసిన ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ ఈ సీజన్‌లో మూడో విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రి రేసులో వెటెల్ విజేతగా నిలిచాడు. 61 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ఆరంభించిన వెటెల్ రెండు గంటల 1ని:22.118 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మరోవైపు డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ 32 ల్యాప్‌ల తర్వాత కారులో ఇబ్బంది తలెత్తడంతో రేసు నుంచి వైదొలిగాడు.
భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లలో సెర్గియో పెరెజ్ ఏడో స్థానంలో నిలువగా... హుల్కెన్‌బర్గ్ 12వ ల్యాప్‌లో రేసు నుంచి తప్పుకున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు జపాన్ గ్రాండ్‌ప్రి ఈనెల 27న జరుగుతుంది. ప్రస్తుతం డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో హామిల్టన్ (252 పాయింట్లు), రోస్‌బర్గ్ (211), వెటెల్ (203) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.