PhotoCredit: FroceMotors
ఫోర్స్ మోటార్స్ ప్రతిష్టాత్మకంగా తయారుచేస్తున్న ‘గూర్ఖా’ 5 డోర్ల వెర్షన్ మోడల్‌ను తర్వలో లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ మోడల్‌కారు తయారీకు కంపెనీ గత రెండేళ్లుగా పనిచేస్తోందని చెప్పింది. ఈ నెలాఖరులోగా దీన్ని లాంచ్ చేయనున్నట్లు సమాచారం.
ఈమేరకు ఫోర్స్ కంపెనీ సరికొత్త 5 డోర్ వెర్షన్‌తో పాటు, ఇప్పటికే ఉన్న 3 డోర్ వెర్షన్ ‘గూర్ఖా’లో కూడా కొన్ని మార్పులు చేయబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసింది. 5 డోర్ గూర్ఖా మారుతి జిమ్నీ, మహీంద్రా థార్ వంటి వాటితో పోటీపడుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: భారత్‌లో ప్రవేశించనున్న ఎలొన్‌మస్క్ మరో కంపెనీ
ఫోర్స్ గూర్ఖా కొత్త 5 డోర్‌మోడల్‌లో 17 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ అందులోబాటులో ఉంటున్నట్లు కంపెనీ తెలిపింది. ముందు, వెనుక వచ్చే బంపర్‌ల్లో కూడా మార్పులు చేసినట్లు చెప్పింది. నాలుగు సిలిండర్ల టర్బో డీజిల్ ఇంజిన్‌తో ఇది రాబోతుంది. 90 బీహెచ్‌పీ, 250 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఉండబోతుందని కంపెనీ చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment