ఇప్పటి వరకు 5 సీటర్, 7 సీటర్ కార్లను గురించి చాలానే విని ఉంటారు. అయితే ఇప్పుడు దేశీయ విఫణిలో 10 సీటర్ విడుదలైంది. ఫోర్స్ మోటార్స్ విడుదల చేసిన ఈ కారు ఏకంగా 13మంది ప్రయాణించడానికి అనుమతిస్తుందని నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ కొత్త MPV గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ధర:
భారతదేశంలో విడుదలైన కొత్త 'ఫోర్స్ సిటీలైన్' (Force Citiline) 10-సీటర్ ధర రూ. 15.93 లక్షలు. ఈ ఎంపివి మూడవ వరుసలో సైడ్-ఫేసింగ్ జంప్ సీట్లకు బదులుగా, ఫ్రంట్ ఫేసింగ్ సీట్లతో వస్తుంది. కావున సులభంగా 13 మంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది.
డిజైన్:
ఫోర్స్ సిటీలైన్ కొత్త ఫ్రంట్ ఫాసియాతో వస్తుంది, కొత్త గ్రిల్ పొందుతుంది. ఇది బాడీ కలర్ ప్యానల్ కలిగి డోర్ హ్యాండిల్స్, ORVM వంటివి బ్లాక్ కలర్‌లో పూర్తిచేసి ఉండటం గమనించవచ్చు. ఈ 10 సీటర్ మోడల్ 2+3+2+3 సీటింగ్ లేఅవుట్‌లో ఫ్రంట్ ఫేసింగ్ సీట్లను అందిస్తుంది. మూడు, నాలుగవ వరుసలోకి వెళ్ళడానికి, బయటకి రావడానికి అనుకూలంగా రెండవ-వరుసలో 60:40 స్ప్లిట్ బకెట్ సీట్లు లభిస్తాయి.
ఫీచర్స్:
భారతీయ మార్కెట్లో 10 సీటర్ కార్లు చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయి, కానీ పెద్ద ఫ్యామిలీలు ఒకేసారి జర్నీ చేయడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇక ఈ ఎంపివి ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో పవర్ స్టీరింగ్, ముందు & వెనుక ప్రయాణీకులకు ప్రత్యేక ఎయిర్ కండిషనింగ్, ఏబీఎస్ విత్ ఈబిడి వంటివి పొందుతుంది.
(ఇదీ చదవండి: మరణం తర్వాత కూడా భారీగా సంపాదిస్తున్న యూట్యూబర్.. ఇతడే!)
ఇంజిన్:
ఫోర్స్ సిటీలైన్ 10 సీటర్ మెర్సిడెస్-బెంజ్-సోర్స్డ్ FM 2.6 CR టర్బో డీజిల్ ఇంజన్ కలిగి, 90 బిహెచ్‌పి పవర్ & 250ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. మొత్తం మీద పర్ఫామెన్స్ చాలా అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment