బుకింగ్స్‌లో సరికొత్త రికార్డ్.. మార్కెట్లో మహీంద్రా కారు సంచలనం | Mahindra XUV 3XO Bookings Crossed 50000 in 60 Minutes | Sakshi
Sakshi News home page

బుకింగ్స్‌లో సరికొత్త రికార్డ్.. మార్కెట్లో మహీంద్రా కారు సంచలనం

Published Thu, May 16 2024 4:49 PM | Last Updated on Thu, May 16 2024 9:54 PM

Mahindra XUV 3XO Bookings Crossed 50000 in 60 Minutes

గత నెల చివరలో దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త మహీంద్రా XUV 3XO కారు బుకింగ్స్ బుధవారం (మే 15) ప్రారంభయ్యాయి. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 10 నిమిషాల్లో మహీంద్రా కొత్త కారు 27000 బుకింగ్స్ పొందింది. అదే విధంగా 60 నిమిషాల్లో 50000 బుకింగ్స్ పొందింది.

మహీంద్రా కంపెనీ ఇప్పటికే 10000 కార్లను (XUV 3XO) ఉత్పత్తి చేసినట్లు సమాచారం. కాబట్టి డెలివరీలు ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త కారు మొత్తం 9 వేరియంట్లలో విడుదలైంది. XUV 3XO ప్రారంభ ధర రూ. 7.49 లక్షలు.

తొమ్మిది వేరియంట్లు, ఎనిమిది కలర్ ఆప్షన్లలో లాంచ్ అయిన ఈ కొత్త కారు మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో కొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లు, లెవల్ 2 ఏడీఏఎస్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 65W టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement