తిరువనంతపురం: అమ్మాయిలు జడలు వేసుకునే పాఠశాలలకు రావాలని ఒత్తిడి చేయొద్దని, అసలు ఆ విషయం అడగొద్దని కేరళ రాష్ట్ర చిన్నారుల హక్కుల కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర హైయర్ సెకండరీ డైరెక్టర్ కు, జనరల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్ కు ఆదేశాలిచ్చింది. కేరళలో కాసర్ గోడ్ కు చెందిన ఓ విద్యార్థిని తనను జడవేసుకోలేదని స్కూళ్లో నుంచి పంపించారని కమిషన్ ను ఆశ్రయించడంతో కమిషన్ ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
తాము స్నానం చేసిన ప్రతిసారి రెండు జడలు వేసుకోవడం ఇబ్బందిగా మారిందని, జుట్టంతా చిక్కులుపడి దానిని సరిచేసే క్రమంలో అది బలహీనంగా తయారవుతుందని, అలాగని తలంటు స్నానం చేయకుంటే పక్కవారికి ఇబ్బందయ్యేలా వాసన వస్తుందని కానీ, తలంటు స్నానం చేశాక జుట్టు సరిచేసుకోవడం బాగా ఇబ్బందని వారు కమిషన్ ముందు వాపోయారు. రెండు జడలు తప్పకుండా వేసుకోవాల్సిందేనని స్కూళ్లలో వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. దీనిని విన్న కమిషన్ కావాలంటే జుట్టంతా కలిపి బ్యాండ్ వేసుకునే విధంగా ఆదేశించవచ్చని, జడలు వేసుకోవాల్సిందేనని ప్రత్యేకంగా నిబంధన పెట్టి వారిపై ఒత్తిడి తీసుకురావొద్దని పాఠశాలల యాజమాన్యాలకు చెప్పింది.
'అమ్మాయిలు జడలు వేసుకుంటేనా రానిస్తారా?'
Published Mon, Aug 22 2016 11:42 AM | Last Updated on Thu, Oct 4 2018 7:55 PM
Advertisement