
మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
రామన్నపేట
కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ పాల్వాయి భాస్కర్‌రావ్ పిలుపునిచ్చారు. మంగళవారం మండలకేంద్రంలోని జీఎంఆర్ ఫంక్షన్‌హాల్‌లో ఈనెల 7న హైదరాబాద్‌లో జరిగే మోదీతోమనం సమ్మేళనం పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతి రహిత పాలనను అందించిన ఘనత దేశచరిత్రలో మోదీకే దక్కుతుందని చెప్పారు. గ్రామస్థాయిలో పార్టీ అభివృద్ధికి అన్ని విధాల ప్రయత్నాలు చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ మండలఅధ్యక్షుడు గర్దాసు సురేష్, ప్రధానకార్యదర్శి తాటిపాముల శివక్రిష్ణ, సర్పంచ్ నకిరేకంటి మొగులయ్య, ఎంపీటీసీ కన్నెకంటి వెంకటేశ్వరాచారి, బట్టె క్రిష్ణమూర్తి, మామిళ్లపల్లి శంకరయ్య, బి.వెంకటేష్, ఆర్.ఎట్టయ్య, ఎ.భాస్కర్, టి.లింగస్వామి, ఆర్.రమేష్‌కుమార్, శోభన్‌బాబు, ధర్మరాజు, శశికృష్ణాచారి, అయిలయ్య, మల్లేశం పాల్గొన్నారు.