హామిల్టన్ పదోసారి...
స్పాఫ్రాంకోర్‌చాంప్స్: ఈ సీజన్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ పదోసారి ‘పోల్ పొజి షన్’ సాధించాడు. శని వారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో హామిల్టన్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 47.197 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ రెండో స్థానం నుంచి, విలియమ్స్ జట్టు డ్రైవర్ బొటాస్ మూడో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. ఈ సీజన్‌లో హామిల్టన్‌కిది వరుసగా ఆరో ‘పోల్’ కావడం విశేషం. 2000, 2001లలో మైకేల్ షుమాకర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో డ్రైవర్ హామిల్టన్. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఐదో స్థానం నుంచి, హుల్కెన్‌బర్గ్ 11వ స్థానం నుంచి రేసును ప్రారంభిస్తారు.
గ్రిడ్ పొజిషన్స్: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. రోస్‌బర్గ్ (మెర్సిడెస్), 3. బొటాస్ (విలియమ్స్), 4. గ్రోస్యెన్ (లోటస్), 5. పెరెజ్ (ఫోర్స్ ఇండియా), 6. రికియార్డో (రెడ్‌బుల్), 7. మసా (విలియమ్స్), 8. మల్డొనాడో (లోటస్), 9. వెటెల్ (ఫెరారీ), 10. సెయింజ్ (ఎస్టీఆర్), 11. హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా), 12. క్వియాట్ (రెడ్‌బుల్), 13. ఎరిక్సన్ (సాబెర్), 14. రైకోనెన్ (ఫెరారీ), 15. వెర్‌స్టాపెన్ (ఎస్టీఆర్), 16. నాసర్ (సాబెర్), 17. బటన్ (మెక్‌లారెన్), 18. అలోన్సో (మెక్‌లారెన్), 19. స్టీవెన్స్ (మనోర్), 20. మెర్హీ (మనోర్).