Williams
-
సునీతా విలియమ్స్ రాక ఎప్పుడు..? ‘మస్క్’ వైపు ‘నాసా’ చూపు
కాలిఫోర్నియా: ప్రముఖ ఏవియేషన్ కంపెనీ బోయింగ్‌కు మరో ఎదురు దెబ్బ తగిలిందా.. ఏవియేషన్, స్పేస్‌టెక్ రంగాల్లో ఇప్పటికే అపఖ్యాతి మూటగట్టుకున్న కంపెనీ తాజాగా మరో పెద్ద సమస్య ఎదుర్కొంటోందా..? స్పేస్ టెక్నాలజీ రంగంలో ఈలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ బోయింగ్‌ను ఛాలెంజ్ చేస్తోందా..? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి.ఇటీవలే భారత సంతతికి చెందినవ అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్‌తో మరో వ్యోమగామని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)కు తీసుకువెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో సునీతా విలియమ్స్‌తో పాటు ఆమెతో వెళ్లిన మరో వ్యోమగామి భూమికి తిరిగి రావడం మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి.షెడ్యూల్ ప్రకారం వీరిరువురు జులై 2న తిరిగి భూమ్మీదకు తిరిగి రావాల్సి ఉంది. అయితే ఐఎస్ఎస్కు అటాచ్ అయి ఉన్న స్టార్‌లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకవుతున్నట్లు బోయింగ్‌తో పాటు నాసా గుర్తించాయి. ఈ కారణంగా స్టార్‌లైనర్‌లో సునీత తిరిగి రావడం మరింత ఆలస్యమవుతుందని నాసా భావిస్తోంది.దీంతో ఈలాన్ మస్క్‌కు స్పేస్ ఎక్స్‌కు చెందిన వ్యోమనౌక క్రూ డ్రాగన్‌లో సునీతతో పాటు మరో వ్యోమగామిని వెనక్కి రప్పించే అంశాన్ని నాసా పరిశీలిస్తోంది. అయితే ఈ విషయాన్ని బయటికి వెల్లడించడం లేదు. మార్చ్‌లో నలుగురు వ్యోమగాములను ఐఎస్ఎస్కు తీసుకువెళ్లిన క్రూ డ్రాగన్ అంతరిక్షంలో రెడీగా ఉంది.దీనిలో ఇద్దరు లేదా నలుగురు లేదా మరింతమందిని భూమ్మీదకు తీసుకువచ్చే వెసులుబాటు ఉంది. స్టార్‌లైనర్ మరమ్మతులు గనుక సమయానికి పూర్తి కాకపోతే మస్క్ క్రూ డ్రాగన్‌లోనే సునీత తిరిగి రావొచ్చు. ఇదే జరిగితే స్పేస్ వ్యోమగాముల ప్రయాణానికి సంబంధించి బోయింగ్‌పై మస్క్ స్పేస్ ఎక్స్ పైచేయి సాధించినట్లేనని చెబుతున్నారు. -
6 పాయింట్లలో సునీతా విలియమ్స్ లైఫ్ స్టోరీ!
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ నేడు 57వ వసంతంలోకి అడుగుపెట్టారు. సునీతా విలియమ్స్ 1965,సెప్టెంబర్ 19న ఒహియోలోని యూక్లిడ్ నగరంలో జన్మించారు. భారత సంతతికి చెందిన సునీత 195 రోజులకు పైగా అంతరిక్షంలో ఉండి ప్రపంచ రికార్డు సృష్టించారు. 1 సునీతా విలియమ్స్ కుటుంబం సునీతా విలియమ్స్ తండ్రి డాక్టర్ దీపక్ ఎన్. పాండ్యా ఆయన భారతదేశంలోని గుజరాత్‌కు చెందినవారు. తల్లి బోనీ జలోకర్ పాండ్యా.. స్లోవేనియాకు చెందినవారు. సునీతకు ఏడాది వయసున్నప్పుడు ఆమె తండ్రి అహ్మదాబాద్ నుండి యూఎస్ఏలోని బోస్టన్‌కు వలస వచ్చారు. సునీతా విలియమ్స్‌కు అన్నయ్య జై థామస్ పాండ్యా, అక్క డయానా ఆన్ పాండ్యా ఉన్నారు. సునీత మైఖేల్ జెని వివాహం చేసుకున్నారు. అతను సునీతా విలియమ్స్ క్లాస్మేట్. 2 ప్రాథమిక విద్య సునీతా విలియమ్స్ మసాచుసెట్స్‌లోని నీధమ్ హైస్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆమె యునైటెడ్ స్టేట్స్ నావల్ అకాడమీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ సైన్స్, మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ డిగ్రీని అందుకున్నారు. 3 అంతరిక్ష ప్రయాణ శిక్షణ సునీతా విలియమ్స్ 1987లో యూఎస్ నేవీలో చేరారు. ఆరు నెలల తాత్కాలిక నియామకం తర్వాత ఆమె ప్రాథమిక డైవింగ్ అధికారిగా నియమితులయ్యారు. సునీతా విలియమ్స్ 1998లో అంతరిక్ష యాత్రలో శిక్షణ మొదలుపెట్టారు. 4 195 రోజులు అంతరిక్షంలో గడిపిన రికార్డు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయ సంతతికి చెందిన రెండో మహిళ సునీతా విలియమ్స్. వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 195 రోజుల పాటు ఉండి రికార్డు సృష్టించారు. 5 సునీతా విలియమ్స్ సాధించిన విజయాలు సునీతా విలియమ్స్ 1998, జూన్‌లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు ఎంపికై అక్కడ శిక్షణ తీసుకున్నారు. సునీత అమెరికన్ స్పేస్ ఏజెన్సీ ‘నాసా’ (1998) మిషన్ ఎస్టీఎస్ 116, ఎక్స్‌పెడిషన్ 14, ఎక్స్‌పెడిషన్ 15, ఎస్టీఎస్ 117, సోయుజ్ టీఎంఏతో సహా 30 వేర్వేరు అంతరిక్ష నౌకల్లో మొత్తం 2770 విమానాలను నడిపారు. 6 పద్మభూషణ్‌తో సత్కారం సునీతా విలియమ్స్‌కు 2008లో భారత ప్రభుత్వం సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది. ఇదేకాకుండా ఆమె మానవతా సేవా పతకం, నేవీ అండ్ మెరైన్ కార్ప్ అచీవ్మెంట్ మెడల్, నేవీ కమెండేషన్ మెడల్‌లను అందుకున్నారు. ఇది కూడా చదవండి: జోడియాక్ కిల్లర్ ఎవరు? సీరియల్ హత్యలు చేస్తూ, వార్తాపత్రికలకు ఏమని రాసేవాడు? -
విలియమ్స్‌కు కోహ్లి కౌంటర్.. అదే స్టైల్లో..
హైదరాబాద్: తన బ్యాట్‌తో పరుగుల వరద పారించే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. నిత్యం ఏదో రకమైన విషయాలతో వార్తల్లో నిలుస్తుంటాడు. అయితే హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఓ అరుదైన సంఘటనతో మరోసారి వార్తల్లోకెక్కాడు. విషయం ఏంటంటే.. శుక్రవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాడు విలియమ్స్‌ను ఉద్దేశించి కోహ్లి తన చేతిని వర్చువల్ 'నోట్‌బుక్'గా మార్చి.. బుక్ తీసి టిక్ కొడుతున్నట్లు చేసిన విన్యాసం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో ఓ మ్యాచ్ సందర్భంగా తన వికెట్ తీసి సంబరాలు చేసుకున్నవిలియమ్స్‌కు అదే రీతిలో కౌంటర్ ఇచ్చాడంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక 208 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు విజయానికి 30 బంతుల్లో 54 పరుగులు కావాల్సిన సమయంలో.. కోహ్లీ క్రీజులో ఉండటంతో మ్యాచ్ అప్పటికీ టీమిండియా చేతిలోనే ఉంది. విలియమ్స్ 16వ ఓవర్లో రెండో బంతిని అతని తలపై నుంచి కోహ్లి నేరుగా బౌండరీకి తరలించాడు. ఆ తర్వాతి బంతిని లాంగాన్‌లో కళ్లు చెదిరే సిక్సర్‌గా మలిచాడు. చదవండి: కోహ్లిని కవ్వించొద్దని చెప్పానా..! సిక్సర్ కొట్టిన తర్వాత కోహ్లి అదే నోట్‌బుక్ స్టయిల్లో ఆ మూమెంట్‌ను ఎంజాయ్ చేశాడు. జేబులో నుంచి నోట్‌బుక్‌ను తీసి మూడు సార్లు టిక్కులు కొడుతున్నట్లు సెలబ్రేషన్ చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం దీనిపై విరాట్ మాట్లాడుతూ.. గత వెస్టిండీస్ పర్యటనలో తనని ఔట్ చేసినపుడు విలియమ్స్ చేసిన సెలబ్రేషన్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఇలా బదులిచ్చినట్లు వ్యాఖ్యానించాడు. కాగా ఈ మ్యాచ్‌లో విరాట్‌కోహ్లి 50 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 94 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టీ20ల్లో కోహ్లీకి ఇది 23వ హాఫ్ సెంచరీ. తొలి టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో టీమిండియా మూడు టి20ల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. ఇక రెండో టి20 మ్యాచ్ డిసెంబరు 8న తిరువనంతపురంలో జరగనుంది. #ViratKohli don't mess with Kohli If ur bad he's ur dad🔥🔥 pic.twitter.com/YsDNipUlMJ — Venky Tarak (@VenkyTa77508681) December 7, 2019 -
ప్రారంభోత్సవంలో రాబీ విలియమ్స్ గానం
లండన్: ఫిఫా ప్రపంచ కప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బ్రిటిష్ పాప్ స్టార్ రాబీ విలియమ్సన్ తన గానంతో అలరించనున్నాడు. ఈ నెల 14న మాస్కోలోని లుజ్నికి మైదానంలో రష్యా–సౌదీ అరేబియా మధ్య తొలి మ్యాచ్‌తో విశ్వ సమరానికి తెరలేవనుంది. దీనికి కొద్దిగా ముందు రాబీ... రష్యన్ గాయని ఐదా గార్ఫులినాతో కలిసి పాడనున్నాడు. 44 ఏళ్ల రాబీ ‘ఏంజెల్స్’ ఆల్బమ్‌తో ప్రఖ్యాతిగాంచాడు. రెండేళ్ల క్రితం అతడి పాట ‘పార్టీ లైక్ ఏ రష్యన్’ వివాదాస్పదమైంది. ఇది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఉద్దేశించినట్లు ఉందని అభ్యంతరాలు వచ్చాయి. వీటిని అప్పట్లోనే రాబీ ఖండించాడు. అయితే, తాజా అవకాశాన్ని అతడు తన చిన్ననాటి కలగా, మర్చిపోలేని జ్ఞాపకంగా అభివర్ణించాడు. మరోవైపు బ్రెజిల్ మాజీ దిగ్గజం రొనాల్డోపై చిత్రీకరించిన ‘ఓ ఫినామినో’ వీడియోనూ ప్రపంచ కప్ ప్రారంభం సందర్భంగా ప్రదర్శించనున్నారు. -
కిస్ చేస్తూ ప్రియుడి నాలుకను కొరికేసింది!
హార్ట్ఫోర్డ్: గాఢమైన చుంబనంలో విచక్షణను కోల్పోయిన ఓ మహిళ ప్రియుడి నాలుకను కొరికేసింది. హఠాత్పరిణామంతో బిత్తరపోయిన ప్రియుడు తెగిపోయిన నాలుక ముక్కను చేతబట్టుకొని హుటాహుటిన ఆసుపత్రికి పరిగెత్తిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అమెరికాలోని కనెక్టికట్‌లో హార్ట్ఫోర్డ్ సిటీలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. షకియా లాంగ్(37) అనే మహిళ తన ప్రియుడు డ్వేన్ విలియమ్స్(41)తో కలిసి సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఇంట్లో మత్తు పదార్థాలను మోతాదుకు మించి తీసుకున్న అనంతరం విలియమ్స్‌ను కిస్ చేస్తూ.. షకియా లాంగ్ అతని నాలుకను కొరికేసింది. ఒక్కసారిగా నాలుక తెగిపోవడంతో బయటకు పరిగెత్తిన విలియమ్స్ అటుగా వెళ్తున్న పోలీసు సహాయంతో ఆసుపత్రికి చేరినట్లు స్థానిక పత్రిక వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు షకియాపై కేసునమోదు చేశారు. తెగిపడిన నాలుకకు వైద్యులు అతికష్టం మీద అతికించారు. ఘటన జరిగిన సమయంలో చాలా రక్తం పోయిందని విలియమ్స్ పోలీసులకు తెలిపాడు. మార్చ్ 31న ఈ కేసుకు సంబంధించి షకియా కోర్టుకు హాజరుకానుంది. అయితే ఆసమయంలో విలియమ్స్ గాయపడిన సంగతే తనకు తెలియదని షకియా చెబుతుండటం విశేషం. -
ఫైనల్‌కు దూసుకెళ్లిన నల్లకలువ
మెల్బోర్న్: డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో నాలుగోసీడ్ క్రీడాకారిని రద్వాన్‌స్కాను వరుస సెట్లలో ఓడించి 7వ సారి ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 64 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో సెరెనా పవర్ గేమ్ ముందు రద్వాన్‌స్కా ఏ మాత్రం నిలువలేకపోయింది. మొదటి సెట్‌ను 6-0తో అలవోకగా గెలుచుకున్న సెరెనాకు రెండో సెట్లో కాస్త ప్రతిఘటన ఎదురైనప్పటికీ.. 6-4తో సెట్‌ను గెలుచుకొని ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరగనున్న ఫైనల్లో ఏడో సీడ్ క్రీడాకారిణి కెర్బర్ లేదా అన్‌సీడెడ్ క్రీడాకారిణి జొహన్నా కొంటాతో సెరెనా తలపడనుంది. ఫైనల్లో విజయం సాధిస్తే ఈ నల్ల కలువ ఖాతాలో 22వ గ్రాండ్ స్లామ్ టైటిల్ చేరుతుంది. -
హామిల్టన్ పదోసారి...
స్పాఫ్రాంకోర్చాంప్స్: ఈ సీజన్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ పదోసారి ‘పోల్ పొజి షన్’ సాధించాడు. శని వారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 47.197 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ రెండో స్థానం నుంచి, విలియమ్స్ జట్టు డ్రైవర్ బొటాస్ మూడో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది వరుసగా ఆరో ‘పోల్’ కావడం విశేషం. 2000, 2001లలో మైకేల్ షుమాకర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో డ్రైవర్ హామిల్టన్. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఐదో స్థానం నుంచి, హుల్కెన్‌బర్గ్ 11వ స్థానం నుంచి రేసును ప్రారంభిస్తారు. గ్రిడ్ పొజిషన్స్: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. రోస్‌బర్గ్ (మెర్సిడెస్), 3. బొటాస్ (విలియమ్స్), 4. గ్రోస్యెన్ (లోటస్), 5. పెరెజ్ (ఫోర్స్ ఇండియా), 6. రికియార్డో (రెడ్‌బుల్), 7. మసా (విలియమ్స్), 8. మల్డొనాడో (లోటస్), 9. వెటెల్ (ఫెరారీ), 10. సెయింజ్ (ఎస్టీఆర్), 11. హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా), 12. క్వియాట్ (రెడ్‌బుల్), 13. ఎరిక్సన్ (సాబెర్), 14. రైకోనెన్ (ఫెరారీ), 15. వెర్స్టాపెన్ (ఎస్టీఆర్), 16. నాసర్ (సాబెర్), 17. బటన్ (మెక్లారెన్), 18. అలోన్సో (మెక్లారెన్), 19. స్టీవెన్స్ (మనోర్), 20. మెర్హీ (మనోర్).