కాలిఫోర్నియా: ప్రముఖ ఏవియేషన్ కంపెనీ బోయింగ్‌కు మరో ఎదురు దెబ్బ తగిలిందా.. ఏవియేషన్, స్పేస్‌టెక్ రంగాల్లో ఇప్పటికే అపఖ్యాతి మూటగట్టుకున్న కంపెనీ తాజాగా మరో పెద్ద సమస్య ఎదుర్కొంటోందా..? స్పేస్ టెక్నాలజీ రంగంలో ఈలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ బోయింగ్‌ను ఛాలెంజ్ చేస్తోందా..? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి.
ఇటీవలే భారత సంతతికి చెందినవ అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్‌తో మరో వ్యోమగామని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్(ఐఎస్‌ఎస్)కు తీసుకువెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో సునీతా విలియమ్స్‌తో పాటు ఆమెతో వెళ్లిన మరో వ్యోమగామి భూమికి తిరిగి రావడం మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి.
షెడ్యూల్ ప్రకారం వీరిరువురు జులై 2న తిరిగి భూమ్మీదకు తిరిగి రావాల్సి ఉంది. అయితే ఐఎస్‌ఎస్‌కు అటాచ్ అయి ఉన్న స్టార్‌లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకవుతున్నట్లు బోయింగ్‌తో పాటు నాసా గుర్తించాయి. ఈ కారణంగా స్టార్‌లైనర్‌లో సునీత తిరిగి రావడం మరింత ఆలస్యమవుతుందని నాసా భావిస్తోంది.
దీంతో ఈలాన్ మస్క్‌కు స్పేస్ ఎక్స్‌కు చెందిన వ్యోమనౌక క్రూ డ్రాగన్‌లో సునీతతో పాటు మరో వ్యోమగామిని వెనక్కి రప్పించే అంశాన్ని నాసా పరిశీలిస్తోంది. అయితే ఈ విషయాన్ని బయటికి వెల్లడించడం లేదు. మార్చ్‌లో నలుగురు వ్యోమగాములను ఐఎస్‌ఎస్‌కు తీసుకువెళ్లిన క్రూ డ్రాగన్ అంతరిక్షంలో రెడీగా ఉంది.
దీనిలో ఇద్దరు లేదా నలుగురు లేదా మరింతమందిని భూమ్మీదకు తీసుకువచ్చే వెసులుబాటు ఉంది. స్టార్‌లైనర్ మరమ్మతులు గనుక సమయానికి పూర్తి కాకపోతే మస్క్ క్రూ డ్రాగన్‌లోనే సునీత తిరిగి రావొచ్చు. ఇదే జరిగితే స్పేస్ వ్యోమగాముల ప్రయాణానికి సంబంధించి బోయింగ్‌పై మస్క్ స్పేస్ ఎక్స్ పైచేయి సాధించినట్లేనని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment