సాక్షి, ముంబై: గతంలో సెలబ్రెటీలు, పారిశ్రామిక వేత్తలు లగ్జరీ వాహనాలను కొనుగోలు చేసినట్లు చదువుకున్నాం. అయితే ఇటీవల మన దేశంలో రాజవంశానికి చెందిన యువరాజు లగ్జరీ వ్యాన్‌లను కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
నిజానికి సాధారణ ప్రజల మాదిరిగానే ఉదయ్‌పూర్ యువరాజు 'లక్ష్యరాజ్ సింగ్ మేవార్' పెద్ద ఆటోమొబైల్ ఔత్సాహికుడు. మేవార్ కుటుంబం భారతదేశంలో అరుదైన పాతకాలపు కార్లను, విదేశాల లగ్జరీ కార్లను సొతం చేసుకున్నారు. తాజాగా ఇప్పుడు వీరి గ్యారేజిలో రెండు 'ఫోర్స్ అర్బేనియా' లగ్జరీ వ్యాన్‌లు చేరాయి.
ఫోర్స్ కంపెనీ ఈ మధ్య కాలంలోనే ప్రీమియం అర్బేనియా పరిచయం చేసింది. సిటీ ప్యాలెస్ కాంపౌండ్ లోపల ఈ వాహనాలను లక్ష్యరాజ్ సింగ్ మేవార్ స్వయంగా డెలివరీ తీసుకున్నారు. ఈ వ్యాన్లు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, సీల్డ్ గ్లాస్ ప్యానెల్‌లు, ఇండియూజువల్ AC వెంట్‌లు , ఛార్జింగ్ పోర్ట్‌లు వంటి ఫీచర్లున్నాయి.
ఫోర్స్ అర్బేనియా వ్యాన్స్ ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ లగ్జరీ వ్యాన్స్ ధరల గురించి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. అయితే ఈ వ్యాన్స్ గురించి స్వయంగా యువరాజు మాట్లాడటం వీడియోలో చూడవచ్చు. లక్ష్యరాజ్ 2012లో రోల్స్ రాయిస్ ఘోస్ట్ డెలివరీ చేసుకున్నారు. వీరి కుటుంబం తమ మొదటి రోల్స్ రాయిస్‌ను 1911లోనే కొనుగోలు చేసింది. 2020లో లక్ష్యరాజ్ మహీంద్రా థార్ కొనుగోలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment