హామిల్టన్ బోణీ | Won the Monaco Grand Prix, "Force," Perez in third place | Sakshi
Sakshi News home page

హామిల్టన్ బోణీ

Published Mon, May 30 2016 3:10 AM | Last Updated on Thu, Oct 4 2018 7:55 PM

హామిల్టన్ బోణీ - Sakshi

హామిల్టన్ బోణీ

మొనాకో గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం  ‘ఫోర్స్’ పెరెజ్‌కు మూడో స్థానం
 
మోంటెకార్లో: ఫార్ములావన్‌లో ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్‌లో తొలి విజయాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన మొనాకో గ్రాండ్‌ప్రి రేసులో ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ విజేతగా నిలిచాడు. 78 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 59 నిమిషాల 29.133 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. హామిల్టన్ కెరీర్‌లో ఇది 44వ విజయం కాగా... మొనాకో గ్రాండ్‌ప్రిలో రెండో టైటిల్. చివరిసారి 2008లో హామిల్టన్ ఈ రేసులో విజేతగా నిలిచాడు. ‘

పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన రికియార్డో (రెడ్‌బుల్) రెండో స్థానాన్ని పొందగా... భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్ సెర్గియో పెరెజ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 28 రేసుల తర్వాత ఫోర్స్ ఇండియా డ్రైవర్ టాప్-3లో నిలిచాడు. ఫోర్స్ ఇండియాకే చెందిన మరో డ్రైవర్ హుల్కెన్‌బర్గ్ ఆరో స్థానాన్ని పొందడం విశేషం. ఈ రేసులో ఏడుగురు డ్రైవర్లు మధ్యలోనే వైదొలిగారు. తదుపరి రేసు కెనడా గ్రాండ్‌ప్రి జూన్ 12న జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement