ఫోర్స్ ఇండియాకు హుల్కెన్‌బర్గ్ గుడ్‌బై
న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టును డ్రైవర్ నికో హుల్కెన్‌బర్గ్ వీడనున్నాడు. వచ్చే ఏడాది నుంచి అతను రెనౌ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. 2011లో ఫోర్స్ ఇండియాలో టెస్టు డ్రైవర్‌గా అడుగుపెట్టిన అతను 2012లో ప్రధాన డ్రైవర్‌గా వ్యవహరించాడు. జర్మనీకి చెందిన హుల్కెన్‌బర్గ్ 2013లో సాబెర్ జట్టుకు మారాడు.
2014లో మళ్లీ ఫోర్స్ ఇండియా జట్టులోకి వచ్చాడు. ఫోర్స్ ఇండియా జట్టు తరఫున 75 రేసుల్లో పాల్గొన్న హుల్కెన్‌బర్గ్ ఈ ఏడాది పాల్గొన్న 17 రేసుల్లో 11 సార్లు టాప్-10లో నిలిచాడు. ఈ సీజన్‌లో అతను మరో నాలుగు రేసుల్లో ఫోర్స్ ఇండియా తరఫున బరిలోకి దిగుతాడు.