రయ్...రయ్...రయ్
నేటి నుంచి ఫార్ములావన్ సీజన్
రేపు ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి రేసు
మెల్‌బోర్న్: గత నాలుగేళ్లుగా ఎదురులేని డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ (రెడ్‌బుల్) తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తాడా... మాజీ చాంపియన్ హామిల్టన్ పుంజుకుంటాడా... లేదంటే మరో కొత్త విజేత అవతరిస్తాడా... భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా గాడిలో పడుతుందా... ఈ సందేహాల నడుమ ఫార్ములావన్ (ఎఫ్1)-2014 సీజన్‌కు తెరలేవనుంది. సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి రేసుకు మెల్‌బోర్న్ ఆదివారం ఆతిథ్యమివ్వనుంది. ఈ రేసుకు సంబంధించి క్వాలిఫయింగ్ సెషన్ శనివారం జరుగుతుంది.
నవంబరు 23న జరిగే అబుదాబి గ్రాండ్‌ప్రి రేసుతో 19 రేసుల సీజన్ ముగుస్తుంది. 11 జట్లున్న ఈ సీజన్‌లో రెడ్‌బుల్ జట్టే ఫేవరెట్‌గా కనిపిస్తోంది. డిఫెండింగ్ చాంపియన్ వెటెల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
నిబంధనల విషయానికొస్తే ప్రతి రేసులో విజేతకు 25 పాయింట్లు, రెండో స్థానంలో నిలిస్తే 18 పాయింట్లు, మూడో స్థానం దక్కితే 15 పాయింట్లు, నాలుగో స్థానం సంపాదిస్తే 12 పాయింట్లు, ఐదో స్థానం పొందితే 10 పాయింట్లు లభిస్తాయి. అయితే గత సీజన్‌కు భిన్నంగా ఈసారి చివరి రేసులో మాత్రం డ్రైవర్లకు రెట్టింపు పాయింట్లు లభిస్తాయి. ఎఫ్1-2014 షెడ్యూల్: ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి (మార్చి 16); మలేసియా (మార్చి 30); బహ్రెయిన్ (ఏప్రిల్ 6); చైనా (ఏప్రిల్ 20); స్పెయిన్ (మే 11); మొనాకో (మే 25); కెనడా (జూన్ 8);ఆస్ట్రియా (జూన్ 22); బ్రిటన్ (జూలై 6); జర్మనీ (జూలై 20); హంగేరి (జూలై 27); బెల్జియం (ఆగస్టు 24); ఇటలీ (సెప్టెంబరు 7); సింగపూర్ (సెప్టెంబరు 21); జపాన్ (అక్టోబరు 5); రష్యా (అక్టోబరు 12); అమెరికా (నవంబరు 2); బ్రెజిల్ (నవంబరు 9); అబుదాబి గ్రాండ్‌ప్రి (నవంబరు 23).