నేడు హంగేరి గ్రాండ్‌ప్రి
బుడాపెస్ట్: ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరోసారి తన సత్తా చాటుకున్నాడు. శనివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో ఈ ఇంగ్లండ్ డ్రైవర్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ హామిల్టన్ అందరి కంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 22.020 సెకన్లలో పూర్తి చేశాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని సంపాదించాడు.
హామిల్టన్ కెరీర్‌లో ఇది 47వ ‘పోల్ పొజిషన్’ కాగా, ఈ సీజన్‌లో తొమ్మిదోది కావడం విశేషం. గతంలో నాలుగుసార్లు హంగేరి గ్రాండ్‌ప్రి టైటిల్‌ను దక్కించుకున్న హామిల్టన్, గత దశాబ్దకాలంలో ‘పోల్ పొజిషన్’తో రేసులో విజేతగా నిలిచిన ఏకైక డ్రైవర్. మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ రెండో స్థానం తో... మాజీ ప్రపంచ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ), రికియార్డో (రెడ్‌బుల్), రైకోనెన్ (ఫెరారీ) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ 11వ, సెర్గియో పెరెజ్ 13వ స్థానాల నుంచి రేసును ప్రారంభిస్తారు.
గ్రిడ్ పొజిషన్స్: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. రోస్‌బర్గ్ (మెర్సిడెస్), 3. వెటెల్ (ఫెరారీ), 4. రికియార్డో (రెడ్‌బుల్), 5. రైకోనెన్ (ఫెరారీ), 6. బొటాస్ (విలియమ్స్), 7. క్వియాట్ (రెడ్‌బుల్), 8. మసా (విలియమ్స్), 9. వెర్‌స్టాపెన్ (ఎస్టీఆర్), 10. గ్రోస్యెన్ (లోటస్), 11. హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా), 12. సెయింజ్ (ఎస్టీఆర్), 13. పెరెజ్ (ఫోర్స్ ఇండియా), 14. మల్డొనాడో (లోటస్), 15. అలోన్సో (మెక్‌లారెన్), 16. బటన్ (మెక్‌లారెన్), 17. ఎరిక్సన్ (సాబెర్), 18. నాసర్ (సాబెర్), 19. మెర్హి (మనోర్), 20. స్టీవెన్స్ (మనోర్).
సాయంత్రం గం. 5.25 నుంచి
స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
హామిల్టన్‌కే మళ్లీ ‘పోల్’
Published Sun, Jul 26 2015 12:48 AM | Last Updated on Tue, Aug 21 2018 9:00 PM
Advertisement