Hungarian Grand Prix
-
వెర్స్టాపెన్ ఖాతాలో ఎనిమిదో విజయం
ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఎనిమిదో విజయం నమోదు చేశాడు. బుడాపెస్ట్‌లో ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. 70 ల్యాప్‌ల రేసును వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 39 నిమిషాల 35.912 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. హామిల్టన్ (మెర్సిడెస్) రెండో స్థానంలో... ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన జార్జి రసెల్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు. -
Hungarian GP Qualifying: రసెల్‌కు కెరీర్లో తొలిసారి పోల్ పొజిషన్
మెర్సిడెస్ జట్టు డ్రైవర్ జార్జి రసెల్ తన ఫార్ములావన్ (ఎఫ్1) కెరీర్లో తొలిసారి పోల్ పొజిషన్ సాధించాడు. బుడాపెస్ట్‌లో శనివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో 24 ఏళ్ల రసెల్ అందరికంటే వేగంగా 1ని:17.377 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. తద్వారా నేడు జరిగే ప్రధాన రేసును రసెల్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. సెయింజ్ (ఫెరారీ) రెండో స్థానం నుంచి... లెక్లెర్క్ (ఫెరారీ) మూడో స్థానం నుంచి... నోరిస్ (మెక్లారెన్) నాలుగో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. కెరీర్ మొత్తంలో 72 రేసుల్లో పాల్గొన్న రసెల్ ఈ సీజన్లో నాలుగు రేసుల్లో మూడో స్థానంలో నిలిచాడు. సాయంత్రం గం. 6:30 నుంచి మొదలయ్యే నేటి ప్రధాన రేసును స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
హమిల్టన్ రికార్డు
బుడాపెస్ట్: ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్ హామిల్టన్ దూసుకుపోతున్నాడు. ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రిలో ఈ బ్రిటన్ డ్రైవర్ చాంపియన్‌గా నిలిచాడు. 70 ల్యాప్లపాటు జరిగిన ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన హామిల్టన్ ఆద్యంతం ఆధిపత్యం చలాయించి తన కెరీర్లో 86వ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. హామిల్టన్ అందరికంటే ముందుగా గంటా 36 నిమిషాల 12.473 సెకన్లలో రేసును ముగించి విజేత అయ్యాడు. హంగేరి గ్రాండ్‌ప్రి టైటిల్‌ను ఎనిమిదో సారి నెగ్గిన హామిల్టన్ (2007, 09, 2012, 13, 16, 18, 19, 2020)... ఈ క్రమంలో ఒకే వేదికపై అత్యధిక రేసులు నెగ్గిన జర్మనీ దిగ్గజ రేసర్ షుమాకర్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. గతంలో షుమాకర్ ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రిని ఎనిమిదిసార్లు గెలిచాడు. సీజన్‌లోని తదుపరి రేసు బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ఆగస్టు 2న జరుగుతుంది. హంగేరి గ్రాండ్‌ప్రి ఫలితాలు (టాప్–10): 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 3. బొటాస్ (మెర్సిడెస్), 4. స్ట్రోల్ (రేసింగ్ పాయింట్), 5. ఆల్బోన్ (రెడ్‌బుల్), 6. వెటెల్ (ఫెరారీ), 7. పెరెజ్ (రేసింగ్ పాయింట్), 8. రికియార్డో (రెనౌ), 9. మాగ్నుసెన్ (హాస్), 10. కార్లోస్ సెయింజ్ (మెక్లారెన్). -
హామిల్టన్ హవా
బుడాపెస్ట్: మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో ఎనిమిదో విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రిలో 70 ల్యాప్‌ల రేసును మూడో స్థానం నుంచి ప్రారంభించిన అతను అందరికంటే ముందుగా గంటా 35 నిమిషాల 3.796 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. కెరీర్లో తొలిసారి పోల్ పొజిషన్ సాధించిన రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ చివర్లో ఆధిక్యాన్ని కోల్పోయి రెండో స్థానంతో సరిపెట్టుకోగా... ఫెరారీ డ్రైవర్ వెటెల్ మూడో స్థానంలో నిలిచాడు. తదుపరి బెల్జియం గ్రాండ్‌ప్రి సెప్టెంబర్ 1న జరుగుతుంది. -
విజేత హామిల్టన్..వ్యూహంతో కొట్టారు
బుడాపెస్ట్ : ఆద్భుతమైన డ్రైవింగ్‌కు జట్టు (మెర్సిడెస్) వ్యూహం తోడవడంతో లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో ఎనిమిదో విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన 70 ల్యాప్‌ల ప్రధాన రేసును మూడో స్థానం నుంచి ప్రారంభించిన అతను అందరికంటే ముందుగా గంటా 35 నిమిషాల 3.796 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. కెరీర్లో తొలిసారి పోల్ సాధించిన రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ చివర్లో ఆధిక్యాన్ని కోల్పోయి రెండో స్థానంతో సరిపెట్టుకోగా... ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ మూడో స్థానంలో నిలిచాడు. నాలుగో స్థానంలో లెక్లెర్క్ (ఫెరారీ), ఐదో స్థానంలో కార్లో సెయింజ్ (మెక్లారెన్)లు రేస్‌ను ముగించారు. రేస్‌ను రెండో స్థానం నుంచి మొదలు పెట్టిన మరో మెర్సిడెస్ డ్రైవర్ వాల్తెరి బొటాస్ ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశ పరిచాడు. వ్యూహంతో దెబ్బకొట్టారు. వెర్స్టాపెన్ కళాత్మకమైన డ్రైవింగ్ డిఫెన్స్‌ను మెర్సిడెస్ తన వ్యూహంతో ఓడించింది. తొలి 35 ల్యాప్‌ల రేస్‌లో వెర్‌స్టాపెన్‌కు హామిల్టన్ నుంచి ఎటువంటి ప్రతిఘటన ఎదురవలేదు. అనంతరం దూకుడు పెంచిన హామిల్టన్ ల్యాప్ ల్యాప్‌కు వెర్స్టాపెన్తో ఉన్న అంతరాన్ని తగ్గిస్తూ వచ్చి అతనిపై ఒత్తిడిని పెంచాడు. అయితే ఈ కుర్ర డ్రైవర్ డిఫెన్స్ డ్రైవింగ్ ముందు 5 సార్లు ఫార్ములావన్ డ్రైవర్ చాంపియన్ అయిన హామిల్టన్ పప్పులు ఉడకలేదు. దీంతో వ్యూహం మార్చిన మెర్సిడెస్ జట్టు హామిల్టన్‌ను 49వ ల్యాప్‌లో రెండో సారి పిట్లోకి పిలిచి కొత్త టైర్లను వేసి పంపింది. సరిగ్గా ఆ వ్యూహం రేస్ 67వ ల్యాప్‌లో ఫలితం చూపింది. అప్పటిదాకా ఆధిక్యంలో ఉన్న వెర్స్టాపెన్ను ఒవర్టేక్ చేసిన హామిల్టన్ రేస్‌ను ముగించాడు. డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో హామిల్టన్ 250 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. తదుపరి బెల్జియం గ్రాండ్‌ప్రి సెప్టెంబర్ 1న జరుగుతుంది. -
వెటెల్దే విక్టరీ
హంగేరి గ్రాండ్‌ప్రిలో టైటిల్ కైవసం బుడాపెస్ట్ (హంగేరి): తొలి ల్యాప్ నుంచి చివరి ల్యాప్ వరకు సాధికారికంగా డ్రైవ్ చేసిన ఫెరారీ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ ఈ సీజన్లో నాలుగో విజయాన్ని సాధించాడు. ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రిలో ఈ జర్మనీ డ్రైవర్ విజేతగా నిలిచాడు. 70 ల్యాప్‌లను వెటెల్ గంటా 39 నిమిషాల 46.713 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన వెటెల్‌కు తన జట్టు సహచరుడు కిమీ రైకోనెన్‌తో గట్టిపోటీ ఎదురైనా... ఏ దశలోనూ ఒత్తిడికి లోనుకాకుండా గమ్యానికి చేరాడు. ఈ సీజన్లో ఇప్పటికే వెటెల్ ఆస్ట్రేలియన్, బహ్రెయిన్, మొనాకో గ్రాండ్‌ప్రి రేసుల్లో టైటిల్స్ సాధించాడు. రైకోనెన్‌కు రెండో స్థానం లభించగా... మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు బొటాస్, లూయిస్ హామిల్టన్ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టుకు ఈ రేసు కలిసొచ్చింది. సెర్గియో పెరెజ్ ఎనిమిదో స్థానంలో, ఎస్టెబన్ ఒకాన్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. మొత్తం 20 మంది డ్రైవర్లు రేసులో పాల్గొనగా... నికో హుల్కెన్‌బర్గ్ (రెనౌ), పాల్ డి రెస్టా (విలియమ్స్), గ్రోస్యెన్ (హాస్), రికియార్డో (రెడ్‌బుల్) మధ్యలోనే వైదొలిగారు. మొత్తం 20 రేసులున్న ఈ సీజన్లో ఇప్పటివరకు పదకొండు రేసులు పూర్తయ్యాయి. ప్రస్తుతం డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో వెటెల్ (202 పాయింట్లు), హామిల్టన్ (188 పాయింట్లు), బొటాస్ (169 పాయింట్లు) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఈ సీజన్‌లోని తదుపరి రేసు బెల్జియం గ్రాండ్‌ప్రి ఆగస్టు 27న జరుగుతుంది. -
వెటెల్ విజయం
హంగేరి గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం సీజన్లో రెండో గెలుపు హామిల్టన్, రోస్బర్గ్ల తడబాటు ‘ఫోర్స్ ఇండియా’కు నిరాశ బుడాపెస్ట్: అందరి అంచనాలను తారుమారు చేస్తూ ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) ఈ సీజన్లో రెండో టైటిల్‌ను నెగ్గాడు. ఆదివారం జరిగిన ఈ రేసులో ఈ జర్మన్ డ్రైవర్ అద్వితీయ విజయాన్ని నమోదు చేశాడు. 69 ల్యాప్‌ల ఈ రేసును వెటెల్ గంటా 46 నిమిషాల 09.985 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. క్వియాట్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో నిలువగా... రికియార్డో (రెడ్‌బుల్) మూడో స్థానాన్ని సంపాదించాడు. ఈ సీజన్లో జరిగిన గత తొమ్మిది రేసుల్లో ఎనిమిదింట విజయఢంకా మోగించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు లూయిస్ హామిల్టన్, నికో రోస్‌బర్గ్ జోరుకు ఈసారి బ్రేక్ పడింది. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ ఆఖరికి ఆరో స్థానంతో సరిపెట్టుకోగా... రోస్‌బర్గ్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు ఈ రేసు కలిసిరాలేదు. హుల్కెన్‌బర్గ్ 41వ ల్యాప్‌లో, పెరెజ్ 53వ ల్యాప్‌లో రేసు నుంచి వైదొలిగారు. సీజన్‌లోని తదుపరి రేసు బెల్జియం గ్రాండ్‌ప్రి ఆగస్టు 23న జరుగుతుంది. రేసు మొదలైన వెంటనే హామిల్టన్, రోస్‌బర్గ్ లను వెనక్కినెట్టి వెటెల్ ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ గమ్యానికి చేరుకున్నాడు. తన కెరీర్లో తొలిసారి హంగేరి గ్రాండ్‌ప్రి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆరంభంలోనే నాలుగో స్థానానికి పడిపోయిన హామిల్టన్ తేరుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. తన విజయాన్ని గతవారం మృతి చెందిన ఎఫ్1 డ్రైవర్ జులెస్ బియాంచికి అంకితం ఇస్తున్నట్లు వెటెల్ తెలిపాడు. బియాంచి మృతికి సంతాపంగా ఈ రేసు ప్రారంభానికి ముందు నిమిషంపాటు మౌనం పాటించారు. ఈ గెలుపుతో వెటెల్ అత్యధిక టైటిల్స్ సాధించిన వారి జాబితాలో అయర్టన్ సెనా (41)తో కలిసి సంయుక్తంగా మూడో స్థానానికి చేరుకున్నాడు. అలైన్ ప్రాస్ట్ (51 టైటిల్స్), మైకేల్ షుమాకర్ (91 టైటిల్స్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. డ్రైవర్స్ చాంపియన్‌షిప్ (టాప్-5) స్థానం డ్రైవర్ జట్టు పాయింట్లు 1 హామిల్టన్ మెర్సిడెస్ 202 2 రోస్‌బర్గ్ మెర్సిడెస్ 181 3 వెటెల్ ఫెరారీ 160 4 బొటాస్ విలియమ్స్ 77 5 రైకోనెన్ ఫెరారీ 76 కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ (టాప్-5) స్థానం జట్టు పాయింట్లు 1 మెర్సిడెస్ 383 2 ఫెరారీ 236 3 విలియమ్స్ 151 4 రెడ్‌బుల్ 96 5 ఫోర్స్ ఇండియా 39 -
హామిల్టన్‌కే మళ్లీ ‘పోల్’
నేడు హంగేరి గ్రాండ్‌ప్రి బుడాపెస్ట్: ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరోసారి తన సత్తా చాటుకున్నాడు. శనివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఈ ఇంగ్లండ్ డ్రైవర్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ హామిల్టన్ అందరి కంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 22.020 సెకన్లలో పూర్తి చేశాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని సంపాదించాడు. హామిల్టన్ కెరీర్లో ఇది 47వ ‘పోల్ పొజిషన్’ కాగా, ఈ సీజన్లో తొమ్మిదోది కావడం విశేషం. గతంలో నాలుగుసార్లు హంగేరి గ్రాండ్‌ప్రి టైటిల్‌ను దక్కించుకున్న హామిల్టన్, గత దశాబ్దకాలంలో ‘పోల్ పొజిషన్’తో రేసులో విజేతగా నిలిచిన ఏకైక డ్రైవర్. మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ రెండో స్థానం తో... మాజీ ప్రపంచ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ), రికియార్డో (రెడ్‌బుల్), రైకోనెన్ (ఫెరారీ) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ 11వ, సెర్గియో పెరెజ్ 13వ స్థానాల నుంచి రేసును ప్రారంభిస్తారు. గ్రిడ్ పొజిషన్స్: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. రోస్‌బర్గ్ (మెర్సిడెస్), 3. వెటెల్ (ఫెరారీ), 4. రికియార్డో (రెడ్‌బుల్), 5. రైకోనెన్ (ఫెరారీ), 6. బొటాస్ (విలియమ్స్), 7. క్వియాట్ (రెడ్‌బుల్), 8. మసా (విలియమ్స్), 9. వెర్స్టాపెన్ (ఎస్టీఆర్), 10. గ్రోస్యెన్ (లోటస్), 11. హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా), 12. సెయింజ్ (ఎస్టీఆర్), 13. పెరెజ్ (ఫోర్స్ ఇండియా), 14. మల్డొనాడో (లోటస్), 15. అలోన్సో (మెక్లారెన్), 16. బటన్ (మెక్లారెన్), 17. ఎరిక్సన్ (సాబెర్), 18. నాసర్ (సాబెర్), 19. మెర్హి (మనోర్), 20. స్టీవెన్స్ (మనోర్). సాయంత్రం గం. 5.25 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం