మెర్సిడెస్ జట్టు డ్రైవర్ జార్జి రసెల్ తన ఫార్ములావన్ (ఎఫ్1) కెరీర్‌లో తొలిసారి పోల్ పొజిషన్ సాధించాడు. బుడాపెస్ట్‌లో శనివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో 24 ఏళ్ల రసెల్ అందరికంటే వేగంగా 1ని:17.377 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. తద్వారా నేడు జరిగే ప్రధాన రేసును రసెల్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు.
సెయింజ్ (ఫెరారీ) రెండో స్థానం నుంచి... లెక్‌లెర్క్ (ఫెరారీ) మూడో స్థానం నుంచి... నోరిస్ (మెక్‌లారెన్) నాలుగో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. కెరీర్ మొత్తంలో 72 రేసుల్లో పాల్గొన్న రసెల్ ఈ సీజన్‌లో నాలుగు రేసుల్లో మూడో స్థానంలో నిలిచాడు. సాయంత్రం గం. 6:30 నుంచి మొదలయ్యే నేటి ప్రధాన రేసును స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment