బుడాపెస్ట్: ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్ హామిల్టన్ దూసుకుపోతున్నాడు. ఆదివారం జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రిలో ఈ బ్రిటన్ డ్రైవర్ చాంపియన్‌గా నిలిచాడు. 70 ల్యాప్‌లపాటు జరిగిన ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన హామిల్టన్ ఆద్యంతం ఆధిపత్యం చలాయించి తన కెరీర్‌లో 86వ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. హామిల్టన్ అందరికంటే ముందుగా గంటా 36 నిమిషాల 12.473 సెకన్లలో రేసును ముగించి విజేత అయ్యాడు. హంగేరి గ్రాండ్‌ప్రి టైటిల్‌ను ఎనిమిదో సారి నెగ్గిన హామిల్టన్ (2007, 09, 2012, 13, 16, 18, 19, 2020)... ఈ క్రమంలో ఒకే వేదికపై అత్యధిక రేసులు నెగ్గిన జర్మనీ దిగ్గజ రేసర్ షుమాకర్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. గతంలో షుమాకర్ ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రిని ఎనిమిదిసార్లు గెలిచాడు. సీజన్‌లోని తదుపరి రేసు బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ఆగస్టు 2న జరుగుతుంది.
హంగేరి గ్రాండ్‌ప్రి ఫలితాలు (టాప్–10): 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్), 3. బొటాస్ (మెర్సిడెస్), 4. స్ట్రోల్ (రేసింగ్ పాయింట్), 5. ఆల్బోన్ (రెడ్‌బుల్), 6. వెటెల్ (ఫెరారీ), 7. పెరెజ్ (రేసింగ్ పాయింట్), 8. రికియార్డో (రెనౌ), 9. మాగ్నుసెన్ (హాస్), 10. కార్లోస్ సెయింజ్ (మెక్‌లారెన్).
Comments
Please login to add a commentAdd a comment