ఎఫ్1 విశ్వవిజేత రోస్‌బర్గ్
అబుదాబి: ఆద్యంతం సంయమనంతో వ్యవహరించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ 2016 ఫార్ములావన్ (ఎఫ్1) విశ్వవిజేతగా అవతరించాడు. సీజన్ చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో రెండో స్థానం పొందిన రోస్‌బర్గ్ మొత్తం 385 పారుుంట్లతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన లూరుుస్ హామిల్టన్ అబుదాబి రేసులో చాంపియన్‌గా నిలిచినా... రోస్‌బర్గ్ టాప్-3లో నిలువడంతో ఈ బ్రిటన్ డ్రైవర్ ఓవరాల్‌గా 380 పారుుంట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్ 55 ల్యాప్‌లను గంటా 38 నిమిషాల 04.013 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని పొందాడు.
ఫోర్స్ ఇండియా డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్, సెర్గియో పెరెజ్ వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. ఓవరాల్ సీజన్‌లో పెరెజ్ (101 పారుుంట్లు) ఏడో స్థానంలో, హుల్కెన్‌బర్గ్ (72 పారుుంట్లు) తొమ్మిదో స్థానంలో నిలిచారు. కన్‌స్ట్రక్టర్స్ చాంపియన్ షిప్‌లో మెర్సిడెస్ జట్టుకు టైటిల్ దక్కగా... ఫోర్స్ ఇండియా నాలుగో స్థానాన్ని దక్కించుకొని తమ అత్యుత్తమ ఫలితాన్ని నమోదు చేసింది. ఈ సీజన్‌లోని 21 రేసులకుగాను రోస్‌బర్గ్ తొమ్మిది రేసుల్లో టైటిల్ సాధించాడు. ఈ విజయంతో ఎఫ్1 విశ్వవిజేతగా నిలిచిన రెండో తండ్రీ తనయుల జోడీగా రోస్‌బర్గ్ గుర్తింపు పొందాడు. రోస్‌బర్గ్ తండ్రి కెకె 1982లో ఎఫ్1 చాంపియన్‌గా నిలిచాడు.