Nico rosbarg
-
ఫార్ములావన్‌కు రోస్‌బర్గ్ గుడ్‌బై
వియన్నా: ఈ ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1) రేసింగ్ ప్రపంచ చాంపియన్ నికో రోస్‌బర్గ్ శుక్రవారం సంచలన నిర్ణయం ప్రకటించాడు. తన కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. గత ఆదివారమే తొలిసారి ఎఫ్1 ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన 31 ఏళ్ల రోస్‌బర్గ్ మెర్సిడెస్ జట్టు తరఫున బరిలోకి దిగాడు. జర్మనీకి చెందిన రోస్‌బర్గ్ పదేళ్లపాటు ఫార్ములావన్‌లో ఉన్నాడు. కెరీర్లో 206 రేసుల్లో పాల్గొన్న అతను 23 రేసుల్లో విజేతగా నిలిచాడు. 57 రేసుల్లో టాప్-3లో స్థానాన్ని పొందాడు. 2006లో ఎఫ్1లో బరిలోకి దిగిన రోస్బర్గ్కు తొలి విజయం మాత్రం 2012లో చైనా గ్రాండ్‌ప్రిలో లభించింది. -
ఎఫ్1 విశ్వవిజేత రోస్‌బర్గ్
అబుదాబి: ఆద్యంతం సంయమనంతో వ్యవహరించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ 2016 ఫార్ములావన్ (ఎఫ్1) విశ్వవిజేతగా అవతరించాడు. సీజన్ చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో రెండో స్థానం పొందిన రోస్‌బర్గ్ మొత్తం 385 పారుుంట్లతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన లూరుుస్ హామిల్టన్ అబుదాబి రేసులో చాంపియన్‌గా నిలిచినా... రోస్‌బర్గ్ టాప్-3లో నిలువడంతో ఈ బ్రిటన్ డ్రైవర్ ఓవరాల్‌గా 380 పారుుంట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్ 55 ల్యాప్‌లను గంటా 38 నిమిషాల 04.013 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని పొందాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్, సెర్గియో పెరెజ్ వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. ఓవరాల్ సీజన్లో పెరెజ్ (101 పారుుంట్లు) ఏడో స్థానంలో, హుల్కెన్‌బర్గ్ (72 పారుుంట్లు) తొమ్మిదో స్థానంలో నిలిచారు. కన్స్ట్రక్టర్స్ చాంపియన్ షిప్లో మెర్సిడెస్ జట్టుకు టైటిల్ దక్కగా... ఫోర్స్ ఇండియా నాలుగో స్థానాన్ని దక్కించుకొని తమ అత్యుత్తమ ఫలితాన్ని నమోదు చేసింది. ఈ సీజన్‌లోని 21 రేసులకుగాను రోస్‌బర్గ్ తొమ్మిది రేసుల్లో టైటిల్ సాధించాడు. ఈ విజయంతో ఎఫ్1 విశ్వవిజేతగా నిలిచిన రెండో తండ్రీ తనయుల జోడీగా రోస్‌బర్గ్ గుర్తింపు పొందాడు. రోస్‌బర్గ్ తండ్రి కెకె 1982లో ఎఫ్1 చాంపియన్‌గా నిలిచాడు. -
హామిల్టన్@ 50
యూఎస్ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం ఆస్టిన్ (అమెరికా): డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూరుుస్ హామిల్టన్ సత్తా చాటుకున్నాడు. యూఎస్ గ్రాండ్‌ప్రి రేసులో ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ రేసులో నిర్ణీత 56 ల్యాప్‌లను హామిల్టన్ గంటా 38 నిమిషాల 12.618 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ రెండో స్థానంలో నిలువగా... రికియార్డో (రెడ్‌బుల్) మూడో స్థానాన్ని పొందాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది ఏడో విజయం కాగా... కెరీర్లో 50వ టైటిల్. ఈ గెలుపుతో ఫార్ములావన్ చరిత్రలో అత్యధిక టైటిల్స్ నెగ్గిన డ్రైవర్స్ జాబితాలో హామిల్టన్ మూడో స్థానానికి చేరుకున్నాడు. షుమాకర్ (91), ప్రాస్ట్ (51) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. తాజా విజయంతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో హామిల్టన్ (305 పారుుంట్లు), నికో రోస్‌బర్గ్ (331 పారుుంట్లు) మధ్య తేడా 26 పారుుంట్లకు చేరుకుంది. ఈ సీజన్లో మరో మూడు రేసులు మిగిలి ఉన్నారుు. తదుపరి రేసు మెక్సికో గ్రాండ్‌ప్రి ఈనెల 30న జరుగుతుంది. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ చివరి ల్యాప్ వరకు ఆధిక్యంలోనే కొనసాగాడు. తొలి పిట్‌స్టాప్ వద్ద వెనుకబడినా ఆ వెంటనే మళ్లీ ఆధిక్యంలోకి వచ్చి చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు పెరెజ్, హుల్కెన్బర్గ్లకు ఈ రేసు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. పెరెజ్ ఎనిమిదో స్థానంలో నిలిచి నాలుగు పారుుంట్లు పొందగా... నికో హుల్కెన్‌బర్గ్ తొలి ల్యాప్‌లోనే వైదొలిగాడు. -
రోస్ బర్గ్కే మళ్లీ పోల్
నేడు సింగపూర్ గ్రాండ్‌ప్రి సింగపూర్: డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో ఆధిక్యంలోకి వచ్చేందుకు మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్బర్గ్కు సదవకాశం లభించింది. ఫార్ములావన్ సీజన్లో భాగంగా శనివారం జరిగిన సింగపూర్ గ్రాం డ్‌ప్రి క్వాలిఫరుుంగ్ సెషన్లో ఈ జర్మన్ డ్రైవర్ పోల్ పొజిషన్ సాధించాడు. అందరికంటే వేగంగా ల్యాప్ ను ఒక నిమిషం 42.584 సెకన్లలో పూర్తి చేసిన రోస్‌బర్గ్ ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని సంపాదించాడు. ఈ సీజన్లో రోస్‌బర్గ్‌కిది ఏడో పోల్ పొజిషన్ కావడం విశేషం. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్, పెరెజ్ వరుసగా ఎనిమిది, పది స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. గ్రిడ్ పొజిషన్‌స: 1. రోస్‌బర్గ్ (మెర్సిడెస్), 2. రికియార్డో, 3. హామిల్టన్ (మెర్సిడెస్), 4. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 5. రైకోనెన్ (ఫెరారీ), 6. సెరుుంజ్ (ఎస్టీఆర్), 7. క్వియాట్ (ఎస్టీఆర్), 8. హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా), 9. అలోన్సో (మెక్లారెన్), 10. పెరెజ్ (ఫోర్స్ ఇండియా), 11. బొటాస్ (విలియమ్స్), 12. మసా (విలియమ్స్), 13. బటన్ (మెక్లారెన్), 14. గుటిరెజ్ (హాస్), 15. గ్రోస్యెన్ (హాస్), 16. ఎరిక్సన్ (సాబెర్), 17. మాగ్నుసెన్ (రెనౌ), 18. నాసర్ (సాబెర్), 19. పాల్మెర్ (రెనౌ), 20. వెర్లీన్ (మనోర్), 21. ఎస్తెబన్ ఒకాన్ (మనోర్), 22. వెటెల్ (ఫెరారీ). నేటి ప్రధాన రేసు సాయంత్రం గం. 5.25 నుంచి స్టార్ స్పోర్ట్స సెలెక్ట్ హెచ్డీ-2లో ప్రత్యక్ష ప్రసారం -
రోస్బర్గ్కు ‘పోల్ పొజిషన్’
యూరోపియన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ క్వాలిఫయింగ్ సెషన్లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. అజర్‌బైజాన్‌లోని బాకు నగరంలో శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌లో రోస్‌బర్గ్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 42.758 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును అతను తొలి స్థానం నుంచి మొదలుపెడతాడు. ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఏడో స్థానం నుంచి... హుల్కెన్‌బర్గ్ 12వ స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు -
రికియార్డోకు తొలి పోల్
► నేటి ప్రధాన రేసు ► సాయంత్రం గం. 5.25 నుంచి ► స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం ► నేడు మొనాకో గ్రాండ్‌ప్రి మోంటెకార్లో: నికో రోస్‌బర్గ్, లూయిస్ హామిల్టన్ కాకుండా ప్రస్తుత ఫార్ములావన్ సీజన్లో తొలిసారి మరో జట్టు డ్రైవర్‌కు పోల్ పొజిషన్ లభించింది. శనివారం జరిగిన మొనాకో గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో రెడ్‌బుల్ జట్టుకు చెందిన డానియల్ రికియార్డో తన కెరీర్లో తొలిసారి పోల్ పొజిషన్ సాధించాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఈ డ్రైవర్ క్వాలిఫయింగ్‌లో అందరికంటే వేగంగా ఒక నిమిషం 13.622 సెకన్లలో ల్యాప్‌ను ముగించి అగ్రస్థానాన్ని పొందాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి మొదలుపెట్టే అవకాశాన్ని సంపాదించాడు. మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు రోస్‌బర్గ్, హామిల్టన్ వరుసగా రెండు, మూడు స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు నికో హుల్కెన్‌బర్గ్ ఐదో స్థానం నుంచి... సెర్గియో పెరెజ్ ఎనిమిదో స్థానం నుంచి రేసును ప్రారంభిస్తారు. ఈ సీజన్లో ఐదు రేసులు ముగిశాక రోస్‌బర్గ్ 100 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. గ్రిడ్ పొజిషన్స్: 1. రికియార్డో (రెడ్‌బుల్), 2. రోస్‌బర్గ్ (మెర్సిడెస్), 3. హామిల్టన్ (మెర్సిడెస్), 4. వెటెల్ (ఫెరారీ), 5. హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా), 6. రైకోనెన్ (ఫెరారీ), 7. కార్లోస్ సెయింజ్ (ఎస్టీఆర్), 8. పెరెజ్ (ఫోర్స్ ఇండియా), 9. క్వియాట్ (ఎస్టీఆర్), 10. అలోన్సో (మెక్లారెన్), 11. బొటాస్ (విలియమ్స్), 12. గుటిరెజ్ (హాస్), 13. బటన్ (మెక్లారెన్), 14. మసా (విలియమ్స్), 15. గ్రోస్యెన్ (హాస్), 16. మాగ్నుసెన్ (రెనౌ), 17. ఎరిక్సన్ (సాబెర్), 18. పాల్మెర్ (రెనౌ), 19. హర్యాంతో (మనోర్), 20. వెర్లీన్ (మనోర్), 21. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 22. నాసర్ (సాబెర్). -
హామిల్టన్‌కు ‘పోల్’
నేడు స్పెయిన్ గ్రాండ్‌ప్రి బార్సిలోనా: గత రెండు రేసుల్లో విఫలమైన ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. శనివారం జరిగిన స్పెయిన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ పోల్ పొజిషన్ సాధించాడు. క్వాలిఫయింగ్‌లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 22 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును ఈ బ్రిటన్ డ్రైవర్ తొలి స్థానం నుంచి మొదలుపెడతాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది మూడో ‘పోల్’ కాగా... కెరీర్లో 52వది. సీజన్‌లోని తొలి నాలుగు రేసుల్లో విజేతగా నిలిచిన మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ స్పెయిన్ గ్రాండ్‌ప్రిలో రెండో స్థానం నుంచి రేసును ప్రారంభిస్తాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్, హుల్కెన్‌బర్గ్ వరుసగా తొమ్మిది, 11వ స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. -
రైట్ రైట్... రోస్‌బర్గ్
► రష్యా గ్రాండ్‌ప్రిలోనూ మెర్సిడెస్ డ్రైవర్ హవా ► సీజన్లో వరుసగా నాలుగో టైటిల్ సొంతం సోచి (రష్యా): వేదిక మారినా... రేసు మారినా... ఫలితం మారలేదు. మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఈ ఏడాది తన అద్వితీయమైన ఫామ్‌ను కొనసాగిస్తూ వరుసగా నాలుగో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన రష్యా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించిన రోస్‌బర్గ్ నిర్ణీత 53 ల్యాప్‌లను గంటా 32 నిమిషాల 41.997 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇంతకుముందు ఆస్ట్రేలియా, బహ్రెయిన్, చైనా గ్రాండ్‌ప్రి రేసుల్లోనూ రోస్‌బర్గ్ టైటిల్ నెగ్గిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా రోస్‌బర్గ్‌కిది వరుసగా ఏడో విజయం కావడం విశేషం. గతేడాది చివరి మూడు రేసుల్లోనూ నెగ్గిన ఈ జర్మన్ డ్రైవర్ ఈ సీజన్లో జరిగిన తొలి నాలుగు రేసుల్లోనూ చాంపియన్‌గా నిలిచాడు. తద్వారా వరుసగా ఏడు అంతకంటే ఎక్కువ రేసుల్లో గెలిచిన నాలుగో డ్రైవర్‌గా గుర్తింపు పొం దాడు. గతంలో వెటెల్ (జర్మనీ) 2013లో వరుసగా తొమ్మిది రేసుల్లో గెలుపొందగా... షుమాకర్ , అస్కారి వరుసగా ఏడేసి రేసుల్లో నెగ్గారు. ఈ ముగ్గురి సరసన రోస్‌బర్గ్ చేరాడు. ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) ఈ రేసులో ఆకట్టుకున్నాడు. పదో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన అతను రెండో స్థానాన్ని సంపాదించాడు. రైకోనెన్ (ఫెరారీ) మూడో స్థానంతో సంతృప్తి పడ్డాడు. రైకోనెన్ ఫలితంతో ఎఫ్1 చరిత్రలో 700సార్లు టాప్-3లో నిలిచిన జట్టుగా ఫెరారీ గుర్తింపు పొందింది. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టుకు మిశ్రమ ఫలితాలు లభించాయి. పెరెజ్ తొమ్మిదో స్థానాన్ని పొందగా... హుల్కెన్‌బర్గ్ తొలి ల్యాప్‌లోనే వైదొలిగాడు. సీజన్‌లోని తదుపరి రేసు స్పెయిన్ గ్రాండ్‌ప్రి ఈనెల 15న జరుగుతుంది. -
రోస్‌బర్గ్‌దే హవా
► మెర్సిడెస్ డ్రైవర్‌కే పోల్ పొజిషన్ ► నేడు రష్యా గ్రాండ్‌ప్రి సోచి (రష్యా): ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ రెండోసారి పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన రష్యా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో రోస్‌బర్గ్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 35.417 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును రోస్‌బర్గ్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ఈ సీజన్లో జరిగిన తొలి మూడు రేసుల్లో విజేతగా నిలిచిన రోస్‌బర్గ్ నాలుగో టైటిల్‌పై కన్నేశాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ కారు ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో హామిల్టన్ రెండో క్వాలిఫయింగ్‌ను దాట లేకపోయాడు. ప్రధాన రేసును అతను పదో స్థానం నుంచి మొదలు పెడతాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు పెరెజ్ ఆరో స్థానం నుంచి... హుల్కెన్‌బర్గ్ 13వ స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. -
అబుదాబి విజేత రోస్ బర్గ్
అబుదాబి: ఫార్ములావన్ సీజన్ లో చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్ రేసును పోల్ పొజిషన్ నుంచి ప్రారంభించిన రోస్ బర్గ్ విజేతగా నిలిచాడు. 55 ల్యాప్ ల రేసును రోస్ బర్గ్ ఒక గంటా 38 నిమిషాల 30. 175 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. రోస్ బర్గ్ కంటే ఎనిమిది నిమిషాల 217 సెకన్లు వెనుకబడ్డ అతని సహచర రేసర్ హమిల్టన్ రెండో స్థానం దక్కించుకున్నాడు. ఫెరారీ జట్టు డ్రైవర్ రైకోనెన్ మూడో స్థానాన్ని సాధించాడు. కాగా, ఫోర్స్ ఇండియాకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్, నికో హుల్కెన్‌బర్గ్ వరుసగా ఐదు, ఏడు స్థానాలతో సంతృప్తి పడ్డారు. అంతకుముందు మెక్సికన్ గ్రాండ్ ప్రి , బ్రెజిల్ గ్రాండ్ ప్రిలో విజేతగా నిలిచిన రోస్ బర్గ్ అదే ఊపును అబుదాబి గ్రాండ్ ప్రిలో కూడా కొనసాగించాడు. దీంతో ఈ సీజన్ లో ఆరో టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్న రోస్ బర్గ్... ఓవరాల్ గా 14వ టైటిల్ ను సాధించాడు. -
రోస్బర్గ్కే ‘పోల్ పొజిషన్’
అబుదాబి: ఫార్ములావన్ సీజన్ చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ దుమ్ము రేపాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో ఈ జర్మన్ డ్రైవర్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 40.237 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. తద్వారా వరుసగా ఆరోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా ఈ సీజన్లో రోస్‌బర్గ్‌కిది ఏడో ‘పోల్ పొజిషన్’ కావడం విశేషం. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్ నాలుగో స్థానం నుంచి, నికో హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. ఈ సీజన్‌లోని 19 రేసుల్లో 18 రేసుల్లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్లకే ‘పోల్ పొజిషన్’ దక్కడం విశేషం. -
విజేత రోస్‌బర్గ్
బార్సిలోనా : ఈ సీజన్లో తొలిసారి ‘పోల్ పొజిషన్’ సాధించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ అదే జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించాడు. ఆదివారం జరిగిన స్పెయిన్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచి తన ఖాతాలో తొలి విజయాన్ని జమ చేసుకున్నాడు. 66 ల్యాప్‌ల ఈ రేసును రోస్‌బర్గ్ గంటా 41 నిమిషాల 12.555 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన రోస్బర్గ్కు ఏదశలోనూ తన సమీప ప్రత్యర్థులతో పోటీ ఎదురుకాలేదు. మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ గంటా 41 నిమిషాల 30.066 సెకన్లతో రెండో స్థానంతో సరిపెట్టుకోగా.. ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ మూడో స్థానాన్ని పొందాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లు సెర్గియో పెరెజ్ 13వ స్థానంలో, నికో హుల్కెన్‌బర్గ్ 15వ స్థానంలో నిలిచి ఒక్క పాయింట్ కూడా నెగ్గలేకపోయారు. స్పెయిన్ గ్రాండ్‌ప్రిలో వరుసగా తొమ్మిదో ఏడాది కొత్త విజేత అవతరించడం విశేషం. అంతేకాకుండా 14వసారి మెర్సిడెస్ జట్టు డ్రైవర్లిద్దరూ తొలి రెండు స్థానాలను దక్కించుకున్నారు. ఈ సీజన్‌లోని తదుపరి రేసు మొనాకో గ్రాండ్‌ప్రి ఈనెల 24న జరుగుతుంది. ఐదు రేసుల తర్వాత ‘డ్రైవర్స్ చాంపియన్‌షిప్’ రేసులో హామిల్టన్ (111 పాయింట్లు), రోస్‌బర్గ్ (91), వెటెల్ (80) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. -
రోస్బర్గ్కు తొలి పోల్
నేడు స్పెయిన్ గ్రాండ్‌ప్రి బార్సిలోనా : ఈ సీజన్‌లోని తొలి నాలుగు రేసుల్లో ‘పోల్ పొజిషన్’ సంపాదించి దూకుడు మీదున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌కు సహచరుడు నికో రోస్‌బర్గ్ చెక్ పెట్టాడు. శనివారం జరిగిన స్పెయిన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో మెర్సిడెస్ జట్టుకే చెందిన రోస్‌బర్గ్ ఈ సీజన్లో తొలిసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. మూడు క్వాలిఫయింగ్ సెషన్లలో కలిపి రోస్‌బర్గ్ మొత్తం 18 ల్యాప్‌లు డ్రైవ్ చేశాడు. ఈ క్రమంలో అతను ఒక నిమిషం 24.681 సెకన్లలో అందరికంటే వేగవంతమైన ల్యాప్‌ను నమోదు చేసి పోల్ పొజిషన్ దక్కించుకున్నాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును రోస్‌బర్గ్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. హామిల్టన్ ఒక నిమిషం 24.948 సెకన్లతో రెండో స్థానంలో నిలిచాడు. మాజీ చాంపియన్ వెటెల్ (ఫెరారీ) మూడో స్థానంలో, బొటాస్ (విలియమ్స్) నాలుగో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ 17వ, సెర్గియో పెరెజ్ 18వ స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. -
హమిల్టన్ X రోస్ జర్గ్
అబుదాబి: ఫార్ములావన్ సీజన్ అంతిమ దశకు చేరుకుంది. ఈ ఏడాది విజేత ఎవరో ఆదివారం జరిగే చివరిదైన అబుదాబి గ్రాండ్‌ప్రి రేసులో తేలుతుంది. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 40.480 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో రోస్‌బర్గ్‌కిది 11వ పోల్ కావడం విశేషం. మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ రేసును రెండో స్థానం నుంచి మొదలుపెడతాడు. ‘డ్రైవర్స్ చాంపియన్‌షిప్’ టైటిల్ రేసులో ఈ ఇద్దరు మాత్రమే ఉండటంతో చివరి రేసు వీరిద్దరికీ కీలకంగా మారింది. హామిల్టన్ 334 పాయింట్లతో, రోస్‌బర్గ్ 317 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. గత రేసులకు భిన్నంగా ఈ రేసులో విజేత నుంచి చివరి స్థానంలో నిలిచిన వారందరికీ రెట్టింపు పాయింట్లు లభిస్తాయి. సాధారణ రేసులో విజేతకు 25 పాయింట్లు లభిస్తే... ఈ రేసులో నెగ్గితే 50 పాయింట్లు దక్కుతాయి. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్లకు క్వాలిఫయింగ్ సెషన్ కలిసిరాలేదు. పెరెజ్ 13వ, హుల్కెన్‌బర్గ్ 14వ స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. గ్రిడ్ పొజిషన్స్ స్థానం డ్రైవర్ జట్టు 1 రోస్‌బర్గ్ మెర్సిడెస్ 2 హామిల్టన్ మెర్సిడెస్ 3 బొటాస్ విలియమ్స్ 4 మసా విలియమ్స్ 5 రికియార్డో రెడ్‌బుల్ 6 వెటెల్ రెడ్‌బుల్ 7 క్వియాట్ ఎస్టీఆర్ 8 బటన్ మెక్లారెన్ 9 రైకోనెన్ ఫెరారీ 10 అలోన్సో ఫెరారీ 11 మాగ్నుసన్ మెక్లారెన్ 12 జీన్ వెర్జెన్ ఎస్టీఆర్ 13 పెరెజ్ ఫోర్స్ ఇండియా 14 హుల్కెన్‌బర్గ్ ఫోర్స్ ఇండియా 15 సుటిల్ సాబెర్ 16 గ్రోస్యెన్ లోటస్ 17 గుటిరెజ్ సాబెర్ 18 మల్డొనాడో లోటస్ 19 కొబయాషి కాటర్‌హమ్ 20 విల్ స్టీవెన్స్ కాటర్‌హమ్ -
రోస్బర్గ్కు ఎనిమిదో ‘పోల్'
నేడు జపాన్ గ్రాండ్‌ప్రి సుజుకా (జపాన్): గత రెండు రేసుల్లో ఆశాజనక ఫలితాలు సాధించలేకపోయిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. శనివారం జరిగిన జపాన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఈ జర్మన్ డ్రైవర్ ‘పోల్ పొజిషన్’ సంపాదించాడు. క్వాలిఫయింగ్ సెషన్లో రోస్‌బర్గ్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 32.506 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఈ సీజన్లో ఎనిమిదోసారి ‘పోల్ పొజిషన్’ సంపాదించిన రోస్‌బర్గ్ నాలుగుసార్లు విజేతగా నిలిచాడు. క్వాలిఫయింగ్ సెషన్లో ఇతర డ్రైవర్లు హామిల్టన్, బొటాస్, మసా, అలోన్సో, రికియారో, మాగ్నుసెన్, బటన్, వెటెల్, రైకోనెన్, పెరెజ్, క్వియాట్, హుల్కెన్‌బర్గ్, సుటిల్, గుటిరెజ్, గ్రోస్యెన్, ఎరిక్సన్, బియాంచి, కొబయాషి, జీన్ వెర్జెన్, చిల్టన్, మల్డొనాడో వరుసగా 2 నుంచి 22వ స్థానాల్లో నిలిచారు.