రోస్‌బర్గ్‌కే ‘పోల్ పొజిషన్’ | Nico Rosberg beat Lewis Hamilton to Abu Dhabi pole | Sakshi
Sakshi News home page

రోస్‌బర్గ్‌కే ‘పోల్ పొజిషన్’

Published Sun, Nov 29 2015 12:21 AM | Last Updated on Wed, Aug 1 2018 4:17 PM

రోస్‌బర్గ్‌కే ‘పోల్ పొజిషన్’ - Sakshi

రోస్‌బర్గ్‌కే ‘పోల్ పొజిషన్’

అబుదాబి: ఫార్ములావన్ సీజన్ చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ దుమ్ము రేపాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్‌లో ఈ జర్మన్ డ్రైవర్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 40.237 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. తద్వారా వరుసగా ఆరోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో రోస్‌బర్గ్‌కిది ఏడో ‘పోల్ పొజిషన్’ కావడం విశేషం. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్ నాలుగో స్థానం నుంచి, నికో హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. ఈ సీజన్‌లోని 19 రేసుల్లో 18 రేసుల్లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్లకే ‘పోల్ పొజిషన్’ దక్కడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement