హమిల్టన్ X రోస్ జర్గ్
అబుదాబి: ఫార్ములావన్ సీజన్ అంతిమ దశకు చేరుకుంది. ఈ ఏడాది విజేత ఎవరో ఆదివారం జరిగే చివరిదైన అబుదాబి గ్రాండ్‌ప్రి రేసులో తేలుతుంది. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్‌లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 40.480 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో రోస్‌బర్గ్‌కిది 11వ పోల్ కావడం విశేషం.
మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ రేసును రెండో స్థానం నుంచి మొదలుపెడతాడు. ‘డ్రైవర్స్ చాంపియన్‌షిప్’ టైటిల్ రేసులో ఈ ఇద్దరు మాత్రమే ఉండటంతో చివరి రేసు వీరిద్దరికీ కీలకంగా మారింది. హామిల్టన్ 334 పాయింట్లతో, రోస్‌బర్గ్ 317 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
గత రేసులకు భిన్నంగా ఈ రేసులో విజేత నుంచి చివరి స్థానంలో నిలిచిన వారందరికీ రెట్టింపు పాయింట్లు లభిస్తాయి. సాధారణ రేసులో విజేతకు 25 పాయింట్లు లభిస్తే... ఈ రేసులో నెగ్గితే 50 పాయింట్లు దక్కుతాయి. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్లకు క్వాలిఫయింగ్ సెషన్ కలిసిరాలేదు. పెరెజ్ 13వ, హుల్కెన్‌బర్గ్ 14వ స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు.
గ్రిడ్ పొజిషన్స్
స్థానం డ్రైవర్ జట్టు
1 రోస్‌బర్గ్ మెర్సిడెస్
2 హామిల్టన్ మెర్సిడెస్
3 బొటాస్ విలియమ్స్
4 మసా విలియమ్స్
5 రికియార్డో రెడ్‌బుల్
6 వెటెల్ రెడ్‌బుల్
7 క్వియాట్ ఎస్టీఆర్
8 బటన్ మెక్‌లారెన్
9 రైకోనెన్ ఫెరారీ
10 అలోన్సో ఫెరారీ
11 మాగ్నుసన్ మెక్‌లారెన్
12 జీన్ వెర్జెన్ ఎస్టీఆర్
13 పెరెజ్ ఫోర్స్ ఇండియా
14 హుల్కెన్‌బర్గ్ ఫోర్స్ ఇండియా
15 సుటిల్ సాబెర్
16 గ్రోస్యెన్ లోటస్
17 గుటిరెజ్ సాబెర్
18 మల్డొనాడో లోటస్
19 కొబయాషి కాటర్‌హమ్
20 విల్ స్టీవెన్స్ కాటర్‌హమ్