బార్సిలోనా : ఈ సీజన్‌లో తొలిసారి ‘పోల్ పొజిషన్’ సాధించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ అదే జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించాడు. ఆదివారం జరిగిన స్పెయిన్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచి తన ఖాతాలో తొలి విజయాన్ని జమ చేసుకున్నాడు. 66 ల్యాప్‌ల ఈ రేసును రోస్‌బర్గ్ గంటా 41 నిమిషాల 12.555 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన రోస్‌బర్గ్‌కు ఏదశలోనూ తన సమీప ప్రత్యర్థులతో పోటీ ఎదురుకాలేదు.
మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ గంటా 41 నిమిషాల 30.066 సెకన్లతో రెండో స్థానంతో సరిపెట్టుకోగా.. ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ మూడో స్థానాన్ని పొందాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లు సెర్గియో పెరెజ్ 13వ స్థానంలో, నికో హుల్కెన్‌బర్గ్ 15వ స్థానంలో నిలిచి ఒక్క పాయింట్ కూడా నెగ్గలేకపోయారు. స్పెయిన్ గ్రాండ్‌ప్రిలో వరుసగా తొమ్మిదో ఏడాది కొత్త విజేత అవతరించడం విశేషం.
అంతేకాకుండా 14వసారి మెర్సిడెస్ జట్టు డ్రైవర్లిద్దరూ తొలి రెండు స్థానాలను దక్కించుకున్నారు. ఈ సీజన్‌లోని తదుపరి రేసు మొనాకో గ్రాండ్‌ప్రి ఈనెల 24న జరుగుతుంది. ఐదు రేసుల తర్వాత ‘డ్రైవర్స్ చాంపియన్‌షిప్’ రేసులో హామిల్టన్ (111 పాయింట్లు), రోస్‌బర్గ్ (91), వెటెల్ (80) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
విజేత రోస్‌బర్గ్
Published Mon, May 11 2015 12:52 AM | Last Updated on Tue, Aug 21 2018 9:00 PM
Advertisement
Advertisement