రోస్‌బర్గ్‌దే హవా
► మెర్సిడెస్ డ్రైవర్‌కే పోల్ పొజిషన్
► నేడు రష్యా గ్రాండ్‌ప్రి
సోచి (రష్యా): ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ రెండోసారి పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన రష్యా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో రోస్‌బర్గ్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 35.417 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును రోస్‌బర్గ్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ఈ సీజన్‌లో జరిగిన తొలి మూడు రేసుల్లో విజేతగా నిలిచిన రోస్‌బర్గ్ నాలుగో టైటిల్‌పై కన్నేశాడు.
ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ కారు ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో హామిల్టన్ రెండో క్వాలిఫయింగ్‌ను దాట లేకపోయాడు. ప్రధాన రేసును అతను పదో స్థానం నుంచి మొదలు పెడతాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు పెరెజ్ ఆరో స్థానం నుంచి... హుల్కెన్‌బర్గ్ 13వ స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు.