రోస్ బర్గ్కే మళ్లీ పోల్ | Today Singapore Grand Prix | Sakshi

రోస్ బర్గ్కే మళ్లీ పోల్

Sep 18 2016 2:05 AM | Updated on May 29 2019 3:19 PM

రోస్ బర్గ్కే మళ్లీ పోల్ - Sakshi

రోస్ బర్గ్కే మళ్లీ పోల్

డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో ఆధిక్యంలోకి వచ్చేందుకు మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్‌కు సదవకాశం లభించింది.

నేడు సింగపూర్ గ్రాండ్‌ప్రి

 సింగపూర్: డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో ఆధిక్యంలోకి వచ్చేందుకు మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్‌కు సదవకాశం లభించింది. ఫార్ములావన్ సీజన్‌లో భాగంగా శనివారం జరిగిన సింగపూర్ గ్రాం డ్‌ప్రి క్వాలిఫరుుంగ్ సెషన్‌లో ఈ జర్మన్ డ్రైవర్ పోల్ పొజిషన్ సాధించాడు. అందరికంటే వేగంగా ల్యాప్ ను ఒక నిమిషం 42.584 సెకన్లలో పూర్తి చేసిన రోస్‌బర్గ్ ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని సంపాదించాడు. ఈ సీజన్‌లో రోస్‌బర్గ్‌కిది ఏడో పోల్ పొజిషన్ కావడం విశేషం. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్, పెరెజ్ వరుసగా ఎనిమిది, పది స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. 

 గ్రిడ్ పొజిషన్‌‌స: 1. రోస్‌బర్గ్ (మెర్సిడెస్), 2. రికియార్డో, 3. హామిల్టన్ (మెర్సిడెస్), 4. వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్), 5. రైకోనెన్ (ఫెరారీ), 6. సెరుుంజ్ (ఎస్టీఆర్), 7. క్వియాట్ (ఎస్టీఆర్), 8. హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా), 9. అలోన్సో (మెక్‌లారెన్), 10. పెరెజ్ (ఫోర్స్ ఇండియా), 11. బొటాస్ (విలియమ్స్), 12. మసా (విలియమ్స్), 13. బటన్ (మెక్‌లారెన్), 14. గుటిరెజ్ (హాస్), 15. గ్రోస్యెన్ (హాస్), 16. ఎరిక్సన్ (సాబెర్), 17. మాగ్నుసెన్ (రెనౌ), 18. నాసర్ (సాబెర్), 19. పాల్మెర్ (రెనౌ), 20. వెర్లీన్ (మనోర్), 21. ఎస్తెబన్ ఒకాన్ (మనోర్), 22. వెటెల్ (ఫెరారీ).

నేటి ప్రధాన రేసు
సాయంత్రం గం. 5.25 నుంచి
స్టార్ స్పోర్‌‌ట్స సెలెక్ట్ హెచ్‌డీ-2లో  ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement