Courtesy: redbullracing Twitter
మోంటెకార్లో: తన కారులో తలెత్తిన సాంకేతిక లోపంతో ‘పోల్ పొజిషన్’ సాధించిన చార్లెస్ లెక్‌లెర్క్ (ఫెరారీ) రేసు ఆరంభానికి ముందే తప్పుకోవడంతో... తొలి స్థానం నుంచి రేసును ఆరంభించిన మ్యాక్స్ వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్) మొనాకో గ్రాండ్‌ప్రిలో అదరగొట్టాడు. ఆదివారం జరిగిన 78 ల్యాప్‌ల ప్రధాన రేసులో ఎక్కడా తడబడకుండా డ్రైవ్ చేసిన వెర్‌స్టాపెన్... అందరికంటే ముందుగా గంటా 38 నిమిషాల 56.820 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు.
ఇక సీజన్‌లో వెర్‌స్టాపెన్‌కు ఇది రెండో విజయం. కార్లోస్ సెయింజ్ (ఫెరారీ) రెండో స్థానంలో నిలువగా... హామిల్టన్ (మెర్సిడెస్) ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. సీజన్‌లో తదుపరి గ్రాండ్‌ప్రి అజర్‌బైజాన్ వేదికగా జూన్ 6న జరగనుంది.
చదవండి: Asian Boxing Championship: భారత్‌కు 7 పతకాలు ఖాయం
This way to the 🔝 of the standings ➡️🏆 #MonacoGP 🇲🇨pic.twitter.com/CEiSv1bK4o
— Red Bull Racing Honda (@redbullracing) May 23, 2021
No floating energy station this year but still plenty of 𝒕𝒉𝒊𝒔 ENERGY!!! 🙌 #MonacoGP 🇲🇨 #GivesYouWings pic.twitter.com/Rh8a5WGmKP
— Red Bull Racing Honda (@redbullracing) May 23, 2021
Comments
Please login to add a commentAdd a comment