MONTE CARLO
-
బోపన్న జోడీ అవుట్
మోంటెకార్లో (మొనాకో): పురుషుల టెన్నిస్ డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీకి నిరాశ ఎదురైంది. మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోరీ్నలో టాప్ సీడ్ బోపన్న–ఎబ్దెన్ ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టింది. తొలి రౌండ్ ‘బై’ పొందిన బోపన్న–ఎబ్డెన్ జంట బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో 3–6, 6–7 (6/8)తో మాట్ పావిచ్ (క్రొయేషియా)–మార్సెలో అరెవాలో (ఎల్ సాల్వడార్) జోడీ చేతిలో ఓడిపోయింది. బోపన్న–ఎబ్డెన్‌లకు 25,510 యూరోల (రూ. 22 లక్షల 82 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
Monaco Grand Prix: విజేత వెర్స్టాపెన్
మోంటెకార్లో: తన కారులో తలెత్తిన సాంకేతిక లోపంతో ‘పోల్ పొజిషన్’ సాధించిన చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ) రేసు ఆరంభానికి ముందే తప్పుకోవడంతో... తొలి స్థానం నుంచి రేసును ఆరంభించిన మ్యాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) మొనాకో గ్రాండ్‌ప్రిలో అదరగొట్టాడు. ఆదివారం జరిగిన 78 ల్యాప్‌ల ప్రధాన రేసులో ఎక్కడా తడబడకుండా డ్రైవ్ చేసిన వెర్స్టాపెన్... అందరికంటే ముందుగా గంటా 38 నిమిషాల 56.820 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. ఇక సీజన్లో వెర్‌స్టాపెన్‌కు ఇది రెండో విజయం. కార్లోస్ సెయింజ్ (ఫెరారీ) రెండో స్థానంలో నిలువగా... హామిల్టన్ (మెర్సిడెస్) ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. సీజన్లో తదుపరి గ్రాండ్‌ప్రి అజర్బైజాన్ వేదికగా జూన్ 6న జరగనుంది. చదవండి: Asian Boxing Championship: భారత్‌కు 7 పతకాలు ఖాయం This way to the 🔝 of the standings ➡️🏆 #MonacoGP 🇲🇨pic.twitter.com/CEiSv1bK4o — Red Bull Racing Honda (@redbullracing) May 23, 2021 No floating energy station this year but still plenty of 𝒕𝒉𝒊𝒔 ENERGY!!! 🙌 #MonacoGP 🇲🇨 #GivesYouWings pic.twitter.com/Rh8a5WGmKP — Red Bull Racing Honda (@redbullracing) May 23, 2021 -
కార్పొరేట్ కలెక్షన్‌ను ఆవిష్కరించిన మోంటే కార్లో
హైదరాబాద్: ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ ‘మోంటే కార్లో’ తాజాగా ‘కార్పొరేట్ కలెక్షన్’ను ఆవిష్కరించింది. ఇందులో వివిధ శ్రేణులకు చెందిన స్మార్ట్ ఆఫీస్వేర్ను అందుబాటులో ఉంచామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. స్త్రీ, పురుషులకు అనువైన రీతిలో, వారి ఫ్యాషన్లకు అనుగుణంగా ఈ నూతన వస్త్ర శ్రేణిని రూపొందించామని పేర్కొంది. పురుషుల కోసం షర్టులు, ట్రౌజర్లు.. మహిళలకు టాప్స్, టునిక్స్ వంటి వాటిని అందుబాటులో ఉంచామని తెలి పింది. తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన వస్త్ర శ్రేణి వినియోగదారులను మరింత ఆకట్టుకుంటుందని మోంటే కార్లో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సందీప్ జైన్ విశ్వాసం వ్యక్తంచేశారు. -
రయ్... రయ్... రోస్‌బర్గ్
మొనాకో గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం సీజన్లో రెండో విజయం మెర్సిడెస్వే తొలి రెండు స్థానాలు ఏకంగా 8 మంది డ్రైవర్లు అవుట్ మోంటెకార్లో: గత పదేళ్లలో తొమ్మిదిసార్లు మొనాకో గ్రాండ్‌ప్రిలో ‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించిన డ్రైవర్‌కే టైటిల్ లభించింది. ఈ ఏడాదీ ఆ సెంటిమెంట్ పనిచేసింది. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఆద్యంతం ఆధిపత్యం కనబరిచాడు. సహచర డ్రైవర్ లూయిస్ హామిల్టన్ నుంచి గట్టిపోటీ లభించినా... ఎక్కడా నియంత్రణ కోల్పోకుండా డ్రైవ్ చేసిన రోస్‌బర్గ్ వరుసగా రెండో ఏడాది మొనాకో గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచాడు. మోంటెకార్లో నగర వీధుల్లో జరిగిన ఈ 78 ల్యాప్‌ల రేసును రోస్‌బర్గ్ గంటా 49 నిమిషాల 27.661 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేశాడు. గత నాలుగు రేసుల్లో విజేతగా నిలిచిన హామిల్టన్ ఈసారి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. రేసు ఆరంభ క్షణాల్లోనే ఆధిక్యంలోకి వెళ్లిన రోస్‌బర్గ్ చివరివరకూ తన జోరును కొనసాగించాడు. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన ఆరు రేసుల్లోనూ మెర్సిడెస్ డ్రైవర్లకే టైటిల్ లభించడం విశేషం. అంతేకాకుండా ఫార్ములావన్ చరిత్రలో ఒక సీజన్లో ఆరంభ ఆరు రేసుల్లో టైటిల్ నెగ్గిన రెండో జట్టుగా మెర్సిడెస్ గుర్తింపు పొందింది. 1988లో మెక్లారెన్ జట్టు సీజన్లో వరుసగా 11 రేసుల్లో గెలిచింది. డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్‌కు ఈ రేసు నిరాశను మిగిల్చింది. కారులో సాంకేతిక సమస్య ఏర్పడటంతో వెటెల్ ఎనిమిదో ల్యాప్‌లోనే రేసు నుంచి తప్పుకున్నాడు. వెటెల్తోపాటు మరో ఏడుగురు డ్రైవర్లు (మల్డొనాడో, సుటిల్, క్వియాట్, వెర్జెన్, బొటాస్, పెరెజ్, గుటిరెజ్) రేసును పూర్తి చేయకపోవడం గమనార్హం. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’కు ఈ రేసు మిశ్రమ ఫలితాలు ఇచ్చింది. హుల్కెన్‌బర్గ్ ఐదో స్థానంలో నిలిచి 10 పాయింట్లు సంపాదించగా... సెర్గియో పెరెజ్ రేసు తొలి ల్యాప్‌లోనే వెనుదిరిగాడు. తదుపరి రేసు కెనడా గ్రాండ్‌ప్రి జూన్ 8న జరుగుతుంది. -
నాదల్కు షాక్
మోంటెకార్లో: క్లే కోర్టులపై తిరుగులేని ప్లేయర్‌గా గుర్తింపు పొందిన ప్రపంచ టెన్నిస్ నంబర్‌వన్ రాఫెల్ నాదల్కు మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీలో అనూహ్య ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో నాదల్ 6-7 (1/7), 4-6తో ఆరో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. 2003 తర్వాత ఈ టోర్నీలో నాదల్ క్వార్టర్ ఫైనల్ దశలోనే ఓడిపోవడం ఇదే తొలిసారి. 2004లో ఈ టోర్నీకి దూరంగా ఉన్న అతను 2005 నుంచి 2012 వరకు ఎనిమిదేళ్లు విజేతగా నిలిచి, గతేడాది ఫైనల్లో జొకోవిచ్ చేతిలో ఓడిపోయాడు. ఫెడరర్‌కు 950వ విజయం మరోవైపు ఫెడరర్ (స్విట్జర్లాండ్) కెరీర్లో 950వ విజయం నమోదు చేశాడు. క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ 2-6, 7-6 (8/6), 6-1తో సోంగా (ఫ్రాన్స్)ను ఓడించాడు. అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో జిమ్మీ కానర్స్ (1253), ఇవాన్ లెండిల్ (1071)ల తర్వాత ఫెడరర్ మూడో స్థానంలో ఉన్నాడు. -
ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జోడి
మోంటెకార్లో: ఏటీపీ మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)-ఐజాముల్ హక్ ఖురేషీ (పాకిస్థాన్) జోడి శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న-ఖురేషీ ద్వయం 7-6 (7/2), 6-4తో జూలియన్ నోల్ (ఆస్ట్రియా)-వాసెక్ పోస్పిసిల్ (కెనడా) జంటను ఓడించింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్లో రెండు జోడీలు తమ సర్వీస్‌లను నిలబెట్టుకున్నాయి. దాంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో ఈ ఇండో-పాక్ జంట పైచేయి సాధించింది. రెండో సెట్లో బోపన్న జంట తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయినా... తమ ప్రత్యర్థి జంట సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. బోపన్న-ఖురేషీ తదుపరి రౌండ్లో ఏడో సీడ్ లుకాస్ కుబోట్ (పోలండ్)-రాబర్ట్ లిండ్‌స్టెట్ (స్వీడన్)లతో పోటీపడతారు.