ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జోడి | Rohan Bopanna-Aisam Qureshi advance to pre-quarterfinals in Monte Carlo Masters tournament | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జోడి

Published Wed, Apr 16 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 6:04 AM

Rohan Bopanna-Aisam Qureshi advance to pre-quarterfinals in Monte Carlo Masters tournament

మోంటెకార్లో: ఏటీపీ మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)-ఐజాముల్ హక్ ఖురేషీ (పాకిస్థాన్) జోడి శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో బోపన్న-ఖురేషీ ద్వయం 7-6 (7/2), 6-4తో జూలియన్ నోల్ (ఆస్ట్రియా)-వాసెక్ పోస్పిసిల్ (కెనడా) జంటను ఓడించింది.
 

 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌లో రెండు జోడీలు తమ సర్వీస్‌లను నిలబెట్టుకున్నాయి. దాంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో ఈ ఇండో-పాక్ జంట పైచేయి సాధించింది. రెండో సెట్‌లో బోపన్న జంట తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయినా... తమ ప్రత్యర్థి జంట సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. బోపన్న-ఖురేషీ తదుపరి రౌండ్‌లో ఏడో సీడ్ లుకాస్ కుబోట్ (పోలండ్)-రాబర్ట్ లిండ్‌స్టెట్ (స్వీడన్)లతో పోటీపడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement