పేస్ జోడిపై బోపన్న పైచేయి | Leander Paes, Rohan Bopanna to lock horns in Cincinnati quarters | Sakshi
Sakshi News home page

పేస్ జోడిపై బోపన్న పైచేయి

Published Sat, Aug 17 2013 1:21 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM

పేస్ జోడిపై బోపన్న  పైచేయి

పేస్ జోడిపై బోపన్న పైచేయి

న్యూఢిల్లీ: సిన్సినాటి మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)-రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జోడి సంచలనం సృష్టించింది. శుక్రవారం రాత్రి జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న-వాసెలిన్ జంట 6-3, 6-7 (3/7), 10-8తో నాలుగో సీడ్ లియాండర్ పేస్ (భారత్) -రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) ద్వయంపై గెలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించింది.
 
  85 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట మూడు ఏస్‌లు సంధించడంతోపాటు మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. అంతకుముందు జరిగిన రెండో రౌండ్‌లో బోపన్న-వాసెలిన్ 7-5, 6-3తో ఆండ్రియా సెప్పి (ఇటలీ)-మిఖాయిల్ యూజ్నీ (రష్యా)లపై; పేస్-స్టెపానెక్ 6-3, 6-4తో జెర్జీ జనోవిజ్-లూకాస్ కుబోట్ (పోలండ్) లపై విజయం సాధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement