నాదల్‌కు షాక్ | Rafael Nadal had a historic clay-court loss in Monte Carlo | Sakshi
Sakshi News home page

నాదల్‌కు షాక్

Published Sat, Apr 19 2014 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 6:12 AM

నాదల్‌కు షాక్

నాదల్‌కు షాక్

మోంటెకార్లో: క్లే కోర్టులపై తిరుగులేని ప్లేయర్‌గా గుర్తింపు పొందిన ప్రపంచ టెన్నిస్ నంబర్‌వన్ రాఫెల్ నాదల్‌కు మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీలో అనూహ్య ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో నాదల్ 6-7 (1/7), 4-6తో ఆరో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. 2003 తర్వాత ఈ టోర్నీలో నాదల్ క్వార్టర్ ఫైనల్ దశలోనే ఓడిపోవడం ఇదే తొలిసారి. 2004లో ఈ టోర్నీకి దూరంగా ఉన్న అతను 2005 నుంచి 2012 వరకు ఎనిమిదేళ్లు విజేతగా నిలిచి, గతేడాది ఫైనల్లో జొకోవిచ్ చేతిలో ఓడిపోయాడు.
 
 ఫెడరర్‌కు 950వ విజయం
 మరోవైపు ఫెడరర్ (స్విట్జర్లాండ్) కెరీర్‌లో 950వ విజయం నమోదు చేశాడు. క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ 2-6, 7-6 (8/6), 6-1తో సోంగా (ఫ్రాన్స్)ను ఓడించాడు. అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో జిమ్మీ కానర్స్ (1253), ఇవాన్ లెండిల్ (1071)ల తర్వాత ఫెడరర్ మూడో స్థానంలో ఉన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement