masters series tournment
-
ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ చాంపియన్స్ అల్కరాజ్, స్వియాటెక్
ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోరీ్నలో పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) టైటిల్ నిలబెట్టుకోగా... మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) రెండోసారి విజేతగా నిలిచింది. కాలిఫోరి్నయాలో జరిగిన ఫైనల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్కరాజ్ 7–6 (7/5), 6–1తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)ను ఓడించగా... స్వియాటెక్ 6–4, 6–0తో మరియా సాకరి (గ్రీస్)పై గెలిచింది. 2016లో జొకోవిచ్ తర్వాత ఇండియన్ వెల్స్ టోర్నీని వరుసగా రెండేళ్లు సాధించిన ప్లేయర్‌గా అల్కరాజ్ నిలిచాడు. అల్కరాజ్ కెరీర్లో ఇది ఐదో మాస్టర్స్ సిరీస్ టైటిల్. విజేతలుగా నిలిచిన అల్కరాజ్కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు... స్వియాటెక్‌కు 11 లక్షల డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
పారిస్‌లో జైకోవిచ్
పారిస్: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నమెంట్లో చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ 6–3, 6–4తో అన్‌సీడెడ్ డెనిస్ షపోవలోవ్ (కెనడా)పై విజయం సాధించాడు. 65 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌కు ఏ దశలోనూ ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురుకాలేదు. రెండు సెట్లలో ఒక్కోసారి షపోవలోవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ తన సర్వీస్‌ను ఒక్కసారీ కోల్పోలేదు. విజేతగా నిలిచే క్రమంలో జొకోవిచ్ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా సమర్పించుకోలేదు. చాంపియన్ జొకోవిచ్‌కు 9,95,720 యూరోల (రూ. 7 కోట్ల 84 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ షపోవలోవ్‌కు 5,03,730 యూరోల (రూ. 3 కోట్ల 96 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 34 జొకోవిచ్ కెరీర్లో ఇది 34వ మాస్టర్స్ సిరీస్ టైటిల్. అత్యధిక మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ గెలిచిన క్రీడాకారుల జాబితాలో జొకోవిచ్ రెండో స్థానంలో ఉన్నాడు. 35 టైటిల్స్‌తో రాఫెల్ నాదల్ (స్పెయిన్) అగ్రస్థానంలో ఉన్నాడు. 5 కెరీర్లో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో జాన్ మెకన్రో (అమెరికా)తో కలిసి జొకోవిచ్ (77 టైటిల్స్) సంయుక్తంగా ఐదో స్థానానికి చేరాడు. ఈ జాబితాలో జిమ్మీ కానర్స్ (అమెరికా–109 టైటిల్స్), ఫెడరర్ (స్విట్జర్లాండ్–103), ఇవాన్ లెండిల్ (అమెరికా–94), రాఫెల్ నాదల్ (స్పెయిన్–84 టైటిల్స్) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు. -
నాదల్కు షాక్
మోంటెకార్లో: క్లే కోర్టులపై తిరుగులేని ప్లేయర్‌గా గుర్తింపు పొందిన ప్రపంచ టెన్నిస్ నంబర్‌వన్ రాఫెల్ నాదల్కు మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీలో అనూహ్య ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో నాదల్ 6-7 (1/7), 4-6తో ఆరో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. 2003 తర్వాత ఈ టోర్నీలో నాదల్ క్వార్టర్ ఫైనల్ దశలోనే ఓడిపోవడం ఇదే తొలిసారి. 2004లో ఈ టోర్నీకి దూరంగా ఉన్న అతను 2005 నుంచి 2012 వరకు ఎనిమిదేళ్లు విజేతగా నిలిచి, గతేడాది ఫైనల్లో జొకోవిచ్ చేతిలో ఓడిపోయాడు. ఫెడరర్‌కు 950వ విజయం మరోవైపు ఫెడరర్ (స్విట్జర్లాండ్) కెరీర్లో 950వ విజయం నమోదు చేశాడు. క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ 2-6, 7-6 (8/6), 6-1తో సోంగా (ఫ్రాన్స్)ను ఓడించాడు. అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో జిమ్మీ కానర్స్ (1253), ఇవాన్ లెండిల్ (1071)ల తర్వాత ఫెడరర్ మూడో స్థానంలో ఉన్నాడు.