
మెల్‌బోర్న్: గతేడాది కనబరిచిన జోరును ఈ సీజన్‌లోనూ కొనసాగించాలనే లక్ష్యంతో మెర్సిడెస్ జట్టు డ్రైవర్, ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్... అతనికి గట్టిపోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇతర ప్రత్యర్థులు... ఈ నేపథ్యంలో 2018 ఫార్ములావన్ సీజన్‌కు ఆదివారం తెరలేవనుంది. 21 రేసుల ఈ సీజన్‌లో భాగంగా తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి నేడు జరుగుతుంది. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్‌లో హామిల్టన్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 21.164 సెకన్లలో ముగించి ‘పోల్ పొజిషన్’ సంపాదించాడు.
ఆదివారం జరిగే ప్రధాన రేసును ఈ బ్రిటన్ డ్రైవర్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. హామిల్టన్ కెరీర్‌లో ఇది 73వ పోల్ పొజిషన్ కావడం విశేషం. ఫెరారీ జట్టుకు చెందిన కిమీ రైకోనెన్ రెండో స్థానం నుంచి... మాజీ ప్రపంచ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ మూడో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్, ఒకాన్ వరుసగా 13, 15వ స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment