Australia grand prix
-
Formula 1: ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి విజేత లెక్లెర్క్
Australian GP: ఫార్ములావన్ తాజా సీజన్లో ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ రెండో టైటిల్ సాధించాడు. మెల్బోర్న్లో ఆదివారం జరిగిన సీజన్ మూడో రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో లెక్లెర్క్ (మొనాకో) విజేతగా నిలిచాడు. 58 ల్యాప్‌ల రేసును ‘పోల్ పొజిషన్’ తో ప్రారంభించిన లెక్లెర్క్ గంటా 27 నిమిషాల 46.548 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచాడు. పెరెజ్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో, రసెల్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు. చదవండి: IPL 2022: చెలరేగిన పృథ్వీ షా, వార్నర్.. ఢిల్లీ ధనాధన్! It’s a win ❤️ Soooo happy! Perfect weekend. Forza Ferrari @ScuderiaFerrari pic.twitter.com/Hzhab92JwQ — Charles Leclerc (@Charles_Leclerc) April 10, 2022 -
హామిల్టన్‌దే విజయం
స్పీల్బర్గ్ (ఆస్ట్రియా): క్వాలిఫయింగ్ సెషన్లో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా అద్భుతంగా రాణించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ప్రధాన రేసులోనూ అదే జోరు కొనసాగించాడు. ఆదివారం జరిగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ (ఎఫ్1) రేసులో ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ నిర్ణీత 71 ల్యాప్‌లను అందరికంటే ముందుగా గంటా 22 నిమిషాల 50.683 సెకన్లలో పూర్తి చేసి టైటిల్ గెలిచాడు. హామిల్టన్ కెరీర్లో ఇది 85వ టైటిల్ కావడం విశేషం. జర్మనీ దిగ్గజం మైకేల్ షుమాకర్ (91) పేరిట ఉన్న అత్యధిక ఎఫ్1 టైటిల్స్ రికార్డు సమం చేసేందుకు హామిల్టన్ మరో ఆరు విజయాల దూరంలో ఉన్నాడు. మెర్సిడెస్‌కే చెందిన వాల్తెరి బొటాస్ రెండో స్థానాన్ని పొందగా... వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) మూడో స్థానంలో నిలిచాడు. ఫెరారీ డ్రైవర్లు వెటెల్, లెక్లెర్క్ తొలి ల్యాప్‌లోనే పరస్పరం ఢీకొట్టుకొని రేసు నుంచి నిష్క్రమించారు. సీజన్‌లోని మూడో రేసు హంగేరి గ్రాండ్‌ప్రి ఈనెల 17న జరుగుతుంది. ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి ఫలితాలు (టాప్–10) 1. లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్), 2. వాల్తెరి బొటాస్ (మెర్సిడెస్), 3. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 4. ఆల్బోన్ (రెడ్‌బుల్), 5. నోరిస్ (మెక్లారెన్), 6. సెర్గియో పెరెజ్ (రేసింగ్ పాయింట్), 7. స్ట్రోల్ (రేసింగ్ పాయింట్), 8. రికియార్డో (రెనౌ), 9. కార్లోస్ సెయింజ్ (మెక్లారెన్), 10. డానియల్ క్వియాట్ (అల్ఫాటౌరి). -
హామిల్టన్ హవా
స్పీల్బర్గ్ (ఆస్ట్రియా): ప్రతికూల పరిస్థితుల్లోనూ అద్భుత ప్రతిభతో అదరగొట్టడంలో తనకు ఎదురులేదని ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ నిరూపించాడు. శనివారం జరిగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును పోల్ పొజిషన్‌తో ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. హామిల్టన్ కెరీర్లో ఇది 89వ పోల్ పొజిషన్ కావడం విశేషం. క్వాలిఫయింగ్ చివరి సెషన్లో ల్యాప్‌ను ఒక నిమిషం 19.273 సెకన్లలో పూర్తి చేసిన హామిల్టన్ అగ్రస్థానాన్ని సంపాదించాడు. క్వాలిఫయింగ్ సెషన్ జరుగుతున్నంతసేపూ భారీ వర్షం కురిసింది. దాంతో డ్రైవర్లకు ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ ఇలాంటి స్థితిలోనూ హామిల్టన్ ఒత్తిడికి లోనుకాకుండా నియంత్రణతో డ్రైవింగ్ చేసి తన ప్రత్యర్థులను వెనక్కి నెట్టాడు. గ్రిడ్ పొజిషన్స్: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 3. కార్లోస్ సెయింజ్ (మెక్లారెన్), 4. బొటాస్ (మెర్సిడెస్), 5. ఒకాన్ (రెనౌ), 6. నోరిస్ (మెక్లారెన్), 7. ఆల్బోన్ (రెడ్‌బుల్), 8. పియరీ గాస్లీ (అల్ఫా టౌరి), 9. రికియార్డో (రెనౌ), 10. వెటెల్ (ఫెరారీ), 11. లెక్లెర్క్ (ఫెరారీ), 12. రసెల్ (విలియమ్స్), 13. స్ట్రోల్ (రేసింగ్ పాయింట్), 14. క్వియాట్ (అల్ఫా టౌరి), 15. మాగ్నుసెన్ (హాస్), 16. రైకోనెన్ (అల్ఫా రోమియో), 17. పెరెజ్ (రేసింగ్ పాయింట్), 18. నికోలస్ లతీఫి (విలియమ్స్), 19. గియోవినాజి (అల్ఫా రోమియో), 20. గ్రోస్యెన్ (హాస్). -
కెనడా ఎఫ్1 గ్రాండ్‌ప్రి కూడా వాయిదా
ఒట్టావా: కరోనా మహమ్మారి కారణంగా ఈసారి ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్ మొదలయ్యే అవకాశాలు కనిపించడంలేదు. మార్చి 15న ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రితో 22 రేసుల సీజన్ ఆరంభం కావాల్సినా... కరోనా వైరస్ దెబ్బ కొట్టింది. రద్దు లేదా వాయిదా పడిన తొమ్మిది రేసులలో తాజాగా కెనడా గ్రాండ్‌ప్రి కూడా చేరింది. జూన్ 14న జరగాల్సిన ఈ రేసును నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే కొనుగోలు చేసిన టికెట్లు కొత్త తేదీలో నిర్వహించే రేసుకూ వర్తిస్తాయని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఆస్ట్రేలియా (మార్చి 15), మొనాకో (మే 24) రేసులు రద్దు కాగా... అజర్బైజాన్, బహ్రెయిన్, చైనా, కెనడా, డచ్, స్పెయిన్, వియత్నాం రేసులు వాయిదా పడ్డాయి. కరోనా తగ్గుముఖం పడితే జూన్ 28న ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రితో సీజన్ మొదలయ్యే అవకాశముంది. -
హామిల్టన్‌కు ‘పోల్’
మెల్బోర్న్: గతేడాది కనబరిచిన జోరును ఈ సీజన్లోనూ కొనసాగించాలనే లక్ష్యంతో మెర్సిడెస్ జట్టు డ్రైవర్, ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్... అతనికి గట్టిపోటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇతర ప్రత్యర్థులు... ఈ నేపథ్యంలో 2018 ఫార్ములావన్ సీజన్‌కు ఆదివారం తెరలేవనుంది. 21 రేసుల ఈ సీజన్లో భాగంగా తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి నేడు జరుగుతుంది. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 21.164 సెకన్లలో ముగించి ‘పోల్ పొజిషన్’ సంపాదించాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును ఈ బ్రిటన్ డ్రైవర్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. హామిల్టన్ కెరీర్లో ఇది 73వ పోల్ పొజిషన్ కావడం విశేషం. ఫెరారీ జట్టుకు చెందిన కిమీ రైకోనెన్ రెండో స్థానం నుంచి... మాజీ ప్రపంచ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ మూడో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్, ఒకాన్ వరుసగా 13, 15వ స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. -
హామిల్టన్ తొలిసారి...
కౌలాలంపూర్: ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ... పది రేసుల తర్వాత మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన మలేసియా గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ విజేతగా నిలిచాడు. 56 ల్యాప్‌ల ఈ రేసును ఈ బ్రిటన్ డ్రైవర్ గంటా 40 నిమిషాల 25.974 సెకన్లలో పూర్తి చేశాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. నిరుటి విజేత వెటెల్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈనెల 16న సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో ‘పోల్ పొజిషన్’తో బరిలోకి దిగిన హామిల్టన్ రెండు ల్యాప్‌ల తర్వాత వైదొలిగాడు. అయితే మలేసియాలో మాత్రం ఎలాంటి తప్పిదం చేయకుండా ఆరంభం నుంచి చివరి ల్యాప్ వరకు తన దూకుడు కొనసాగించాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ తొలి మలుపు వద్ద ఆధిక్యంలోకి వెళ్లి చివరిదాకా ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నాడు. తన ఎనిమిదేళ్ల ఫార్ములావన్ కెరీర్లో హామిల్టన్‌కిది 23వ టైటిల్ కాగా మలేసియా గ్రాండ్‌ప్రిలో తొలిసారి చాంపియన్‌గా నిలిచాడు. గతేడాదిలో జులై 28న హంగేరి గ్రాండ్‌ప్రి రేసును నెగ్గిన తర్వాత హామిల్టన్‌కు వరుసగా పది రేసుల్లో విజయం దక్కలేదు. ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి మాదిరిగానే ఈ రేసులోనూ అనూహ్యంగా ఏడుగురు డ్రైవర్లు రేసును పూర్తి చేయలేకపోయారు. పెరెజ్ (ఫోర్స్ ఇండియా), రికియార్డో (రెడ్‌బుల్), గుటిరెజ్ (సాబెర్), సుటిల్ (సాబెర్), జీన్ వెర్జెన్ (ఎస్టీఆర్), బియాంచి (మారుసియా), మల్డొనాడో (లోటస్) ఈ జాబితాలో ఉన్నారు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు మిశ్రమ ఫలితాలు లభించాయి. నికో హుల్కెన్‌బర్గ్ ఐదో స్థానంలో నిలువగా... మరో డ్రైవర్ సెర్గియో పెరెజ్ కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో బరిలోకి దిగలేదు. సీజన్లో తదుపరి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 6న జరుగుతుంది. -
మళ్లీ హామిల్టన్‌కే...
మెర్సిడెస్ డ్రైవర్‌కు వరుసగా రెండో ‘పోల్ పొజిషన్’ నేడు మలేసియా గ్రాండ్‌ప్రి రేసు కౌలాలంపూర్: సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో ఎదురైన చేదు ఫలితాన్ని మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ వెనక్కినెట్టాడు. రెండో రేసు మలేసియా గ్రాండ్‌ప్రిలో కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో దుమ్మురేపాడు. మూడు క్వాలిఫయింగ్ సెషన్స్‌లోనూ తన ఆధిపత్యాన్ని చాటుకున్న ఈ ప్రపంచ మాజీ చాంపియన్ సీజన్లో వరుసగా రెండోసారి ‘పోల్ పొజిషన్’ను సొంతం చేసుకున్నాడు. చివరిదైన మూడో క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 59.431 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలోనూ ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్ తన కారు ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా రెండో ల్యాప్‌లోనే వైదొలిగాడు. రెండో రేసులో హామిల్టన్ అదృష్టం ఎలా ఉంటుందో వేచి చూడాలి. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ రెండో స్థానం నుంచి రేసును ఆరంభిస్తాడు. హామిల్టన్ మాదిరిగానే తొలి రేసులో వెటెల్‌కు నిరాశ ఎదురైంది. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానం నుంచి... పెరెజ్ 14వ స్థానం నుంచి రేసును మొదలుపెడతారు.