కెనడా ఎఫ్‌1 గ్రాండ్‌ప్రి కూడా వాయిదా | Coronavirus pandemic forces postponement of Canadian F1 | Sakshi
Sakshi News home page

కెనడా ఎఫ్‌1 గ్రాండ్‌ప్రి కూడా వాయిదా

Published Thu, Apr 9 2020 5:48 AM | Last Updated on Thu, Apr 9 2020 5:48 AM

Coronavirus pandemic forces postponement of Canadian F1 - Sakshi

ఒట్టావా: కరోనా మహమ్మారి కారణంగా ఈసారి ఫార్ములావన్‌ (ఎఫ్‌1) సీజన్‌ మొదలయ్యే అవకాశాలు కనిపించడంలేదు. మార్చి 15న ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రితో 22 రేసుల సీజన్‌ ఆరంభం కావాల్సినా... కరోనా వైరస్‌ దెబ్బ కొట్టింది. రద్దు లేదా వాయిదా పడిన తొమ్మిది రేసులలో తాజాగా కెనడా గ్రాండ్‌ప్రి కూడా చేరింది. జూన్‌ 14న జరగాల్సిన ఈ రేసును నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే కొనుగోలు చేసిన టికెట్లు కొత్త తేదీలో నిర్వహించే రేసుకూ వర్తిస్తాయని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఆస్ట్రేలియా (మార్చి 15), మొనాకో (మే 24) రేసులు రద్దు కాగా... అజర్‌బైజాన్, బహ్రెయిన్, చైనా, కెనడా, డచ్, స్పెయిన్, వియత్నాం రేసులు వాయిదా పడ్డాయి. కరోనా తగ్గుముఖం పడితే జూన్‌ 28న ఫ్రెంచ్‌ గ్రాండ్‌ప్రితో సీజన్‌ మొదలయ్యే అవకాశముంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement