Canada Grand Prix tournament
-
Canadian Grand Prix 2024: వెర్స్టాపెన్ ‘హ్యాట్రిక్’
మాంట్రియల్: ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించకపోయినా... అందివచి్చన అవకాశాలను సది్వనియోగం చేసుకున్న రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఈ సీజన్లో తన ఖాతాలో ఆరో విజయం జమ చేసుకున్నాడు. కెనడా గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును రెండో స్థానం నుంచి ప్రారంభించిన వెర్స్టాపెన్ నిర్ణీత 70 ల్యాప్‌లను అందరికంటే వేగంగా ఒక గంటా 45 నిమిషాల 47.927 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. వరుసగా మూడో ఏడాది కెనడా గ్రాండ్‌ప్రిలో టైటిల్ నెగ్గి ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన వెర్స్టాపెన్ కెరీర్లో ఓవరాల్‌గా 60వ విజయం సాధించాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన జార్జి రసెల్ (మెర్సిడెస్) మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. లాండో నోరిస్ (మెక్లారెన్) రెండో స్థానంలో నిలువగా... లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఐదుగురు డ్రైవర్లు కార్లోస్ సెయింజ్ (ఫెరారీ), అలెగ్జాండర్ అల్బోన్ (విలియమ్స్), సెర్జియో పెరెజ్ (రెడ్‌బుల్), చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ), లొగాన్ సార్జెంట్ (విలియమ్స్) రేసును ముగించలేకపోయారు. 24 రేసుల ఈ సీజన్లో ఇప్పటికి తొమ్మిది రేసులు ముగిశాయి. ఆరు రేసుల్లో నెగ్గిన వెర్స్టాపెన్ 194 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సీజన్‌లోని పదో రేసు స్పెయిన్ గ్రాండ్‌ప్రి ఈనెల 23న బార్సిలోనాలో జరుగుతుంది. -
కెనడా ఎఫ్1 గ్రాండ్‌ప్రి కూడా వాయిదా
ఒట్టావా: కరోనా మహమ్మారి కారణంగా ఈసారి ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్ మొదలయ్యే అవకాశాలు కనిపించడంలేదు. మార్చి 15న ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రితో 22 రేసుల సీజన్ ఆరంభం కావాల్సినా... కరోనా వైరస్ దెబ్బ కొట్టింది. రద్దు లేదా వాయిదా పడిన తొమ్మిది రేసులలో తాజాగా కెనడా గ్రాండ్‌ప్రి కూడా చేరింది. జూన్ 14న జరగాల్సిన ఈ రేసును నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే కొనుగోలు చేసిన టికెట్లు కొత్త తేదీలో నిర్వహించే రేసుకూ వర్తిస్తాయని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఆస్ట్రేలియా (మార్చి 15), మొనాకో (మే 24) రేసులు రద్దు కాగా... అజర్బైజాన్, బహ్రెయిన్, చైనా, కెనడా, డచ్, స్పెయిన్, వియత్నాం రేసులు వాయిదా పడ్డాయి. కరోనా తగ్గుముఖం పడితే జూన్ 28న ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రితో సీజన్ మొదలయ్యే అవకాశముంది. -
కశ్యప్ శుభారంభం
కాలగ్రి (కెనడా): గాయం నుంచి కోలుకొని పునరాగమనం చేస్తున్న భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ కెనడా గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కశ్యప్ 21–11, 21–9తో డానియల్ లా టొర రీగల్ (పెరూ)పై గెలుపొందాడు. భారత్‌కే చెందిన రెండో సీడ్ హెచ్ఎస్ ప్రణయ్‌తోపాటు సారంగ్ లఖాని, కరణ్ రాజన్, అభిషేక్ యెలెగార్ కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించారు. -
సెమీస్‌లో జ్వాల జోడి
కాల్గారి (కెనడా) : భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడి జ్వాల-అశ్విని... కెనడా గ్రాండ్ ప్రి టోర్నీలో సెమీస్‌లోకి దూసుకెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ఫైనల్లో జ్వాల-అశ్విని 21-19, 21-13తో హాంకాంగ్ ద్వయం చాన్ కాకా-యున్ సిన్ యంగ్లపై నెగ్గారు. మరో మ్యాచ్‌లో ప్రద్నా గాద్రె-సిక్కి రెడ్డి 18-21, 25-23, 15-21తో పున్లాక్ యన్-సి యింగ్ సుయెట్ (హాంకాంగ్)ల చేతిలో ఓడారు. పురుషుల క్వార్టర్స్‌లో 10వ సీడ్ సాయి ప్రణీత్ 13-21, 21-18, 11-21తో లీ చోంగ్ వీ (మలేసియా) చేతిలో; అజయ్ జయరామ్ 16-21, 15-21తో మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ) చేతిలో ఓడారు.