సెమీస్‌లో జ్వాల జోడి | Jody Jwala in the mix | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో జ్వాల జోడి

Published Sun, Jun 28 2015 12:59 AM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM

సెమీస్‌లో జ్వాల జోడి

సెమీస్‌లో జ్వాల జోడి

కాల్గారి (కెనడా) : భారత బ్యాడ్మింటన్ డబుల్స్ జోడి జ్వాల-అశ్విని... కెనడా గ్రాండ్ ప్రి టోర్నీలో సెమీస్‌లోకి దూసుకెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లో  జ్వాల-అశ్విని 21-19, 21-13తో హాంకాంగ్ ద్వయం చాన్ కాకా-యున్ సిన్ యంగ్‌లపై నెగ్గారు. మరో మ్యాచ్‌లో ప్రద్నా గాద్రె-సిక్కి రెడ్డి 18-21, 25-23, 15-21తో పున్‌లాక్ యన్-సి యింగ్ సుయెట్ (హాంకాంగ్)ల చేతిలో ఓడారు. పురుషుల క్వార్టర్స్‌లో 10వ సీడ్ సాయి ప్రణీత్ 13-21, 21-18, 11-21తో లీ చోంగ్ వీ (మలేసియా) చేతిలో; అజయ్ జయరామ్ 16-21, 15-21తో మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ) చేతిలో ఓడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement