![German Open Junior Badminton Tourney 2024: Tamiri Surya Charishma Won Bronze - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/12/Untitled-4.jpg.webp?itok=X6k-LUXD)
జర్మన్ ఓపెన్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి తామిరి సూర్య చరిష్మా కాంస్య పతకం గెలిచింది. బెర్లిన్‌లో జరిగిన ఈ టోర్నీలో అండర్–19 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో చరిష్మా 21–15, 20–22, 17–21తో కిమ్ మిన్ జీ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది.
అంతకుముందు చరిష్మా క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ సితి జులైఖా (మలేసియా)పై... రెండో రౌండ్ లో13వ సీడ్ పిచిత్‌ప్రిచాసెక్ (థాయ్‌లాండ్)పై సంచలన విజయాలు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment