German Open
-
తామిరి సూర్య చరిష్మాకు కాంస్య పతకం
జర్మన్ ఓపెన్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి తామిరి సూర్య చరిష్మా కాంస్య పతకం గెలిచింది. బెర్లిన్‌లో జరిగిన ఈ టోర్నీలో అండర్–19 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో చరిష్మా 21–15, 20–22, 17–21తో కిమ్ మిన్ జీ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. అంతకుముందు చరిష్మా క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ సితి జులైఖా (మలేసియా)పై... రెండో రౌండ్ లో13వ సీడ్ పిచిత్ప్రిచాసెక్ (థాయ్‌లాండ్)పై సంచలన విజయాలు సాధించింది. -
German Open 2023: లక్ష్య సేన్‌కు షాక్
జర్మన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు, ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 41వ ర్యాంకర్ క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్) 21–19, 21–16తో ఆరో సీడ్ లక్ష్య సేన్‌ను బోల్తా కొట్టించి రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. పొపోవ్‌పై గతంలో నాలుగుసార్లు నెగ్గిన లక్ష్య సేన్ రెండోసారి ఓటమి చవిచూశాడు. -
German Open 2023: నేటినుంచి జర్మన్ ఓపెన్
ముల్హీమ్: భారత యువ షట్లర్, గత ఏడాది రన్నరప్ లక్ష్య సేన్ ఈ సారి జర్మన్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. నేటినుంచి జరిగే ఈ టోర్నీలో అతను ఆరో సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. తొలి రౌండ్లో లక్ష్య ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్టో పొపోవ్‌తో తలపడతాడు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యతో పాటు మిథున్ మంజునాథ్ బరిలో ఉన్నాడు. అయితే మరో భారత టాప్ ఆటగాడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిడాంబి శ్రీకాంత్ అనూహ్యంగా ఈ టోర్నీకి దూరమయ్యాడు. సరైన సమయంలో అతనికి వీసా లభించకపోవడంతో శ్రీకాంత్ తప్పుకోవాల్సి వచ్చింది. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, మాళవిక బన్సోద్, తస్నీమ్ మీర్ బరిలో నిలిచారు. పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్‌లలో భారత్‌నుంచి ఒక్క ఎంట్రీ కూడా లేకపోగా...మిక్స్డ్ డబుల్స్‌లో సుమీత్ రెడ్డి – అశ్విన్ పొన్నప్ప ద్వయం పోటీ పడుతోంది. -
ప్రణయ్‌పై గెలుపుతో సెమీఫైనల్లో లక్ష్య సేన్
జర్మన్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువస్టార్ లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–15, 21–16తో భారత్‌కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్‌పై గెలిచాడు. మరో క్వార్టర్ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ 10–21, 21–23తో టాప్ సీడ్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. అక్సెల్సన్ చేతిలో శ్రీకాంత్‌కిది వరుసగా ఆరో ఓటమి. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో విష్ణువర్ధన్ గౌడ్–కృష్ణప్రసాద్ జోడీ 11–21, 21–23తో హి జి టింగ్–హావో డాంగ్ జౌ (చైనా) జంట చేతిలో ఓడింది. -
German Open: సింధుకు ఊహించని షాక్.. సైనా కూడా అవుట్!
మ్యుహెమ్ అండరుహ్ (జర్మనీ): భారత స్టార్ షట్లర్లకు జర్మన్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ కంగుతినగా, పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో మాజీ ప్రపంచ నంబర్‌వన్, ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 21–16, 21–23, 21–18తో చైనాకు చెందిన లుగ్వాంగ్ జుపై గెలిచాడు. గంటా 7 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో చైనా ప్రత్యర్థి గట్టి పోటీ ఇచ్చాడు. హోరాహోరీగా జరిగిన రెండో గేమ్‌లో శ్రీకాంత్‌కు చివరకు నిరాశే ఎదురైంది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో జాగ్రత్తగా ఆడు తూ పైచేయి సాధించాడు. హెచ్.ఎస్.ప్రణయ్ 21–19, 24–22తో లీ చిక్ యూ (హాంకాంగ్)పై గెలిచాడు. శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌కు సిసలైన సవాలు ఎదురు కానుంది. ఒలింపిక్ చాంపియన్, టాప్‌సీడ్ విక్టర్ అక్సెసెన్ (డెన్మార్క్)తో భారత స్టార్ తలపడనున్నాడు. సింధు, సైనా అవుట్! మహిళల ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ సింధు 14–21, 21–15, 14–21తో జాంగ్ యిమన్ (చైనా) చేతిలో కంగుతింది. వచ్చే వారం ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ కోసం కఠోరంగా శ్రమిస్తోన్న సింధుకు ఇది ఊహించని షాక్. అన్‌సీడెడ్ ప్రత్యర్థిపై ఒక గేమ్ గెలిచినా, మిగతా రెండు గేముల్లోనూ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. సుదీర్ఘకాలంగా ఫిట్నెస్ సమస్యలెదుర్కొంటూ కెరీర్ కొనసాగిస్తున్న సైనా తన ఆటతీరుతో తీవ్రంగా నిరాశపరిచింది. థాయ్‌లాండ్ స్టార్, ఎనిమిదో సీడ్ రత్చనోక్ ఇంతనొన్ 21–10, 21–15తో సైనాపై అవలీలగా గెలిచింది. 31 నిమిషాల్లోనే సైనాతో మ్యాచ్‌ను ముగించింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గారగ కృష్ణప్రసాద్ జోడీ 23–21, 16–21, 21–14తో భారత్‌కే చెందిన ఇషాన్ భట్నాగర్–సాయిప్రతీక్ జంటపై గెలిచింది. చదవండి: Novak Djokovic: నంబర్ 1 ర్యాంకు కోల్పోయావు.. అయినా నువ్వు మారవా! -
పీవీ సింధుకు ఘోర పరాభవం..
జర్మన్ ఓపెన్ 2022లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఘోర పరాభావం ఎదురైంది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన సింధు సూపర్ 300 టోర్నీ రెండో రౌండ్లోనే నిష్క్రమించి అభిమానులను నిరాశపరిచింది. తనకంటే తక్కువ ర్యాంక్ క్రీడాకారిణి అయిన జాంగ్ ఈ మాన్ (చైనా) చేతిలో 14-21 21-15 14-21తో సింధు ఓటమిపాలైంది. ఈ గేమ్ తొలి సెట్ కోల్పోయిన సింధు రెండో సెట్లో పుంజుకుని విజయం సాధించినప్పటికీ.. నిర్ణయాత్మక మూడో సెట్లో ప్రత్యర్ధికి తలవంచింది. దీంతో వచ్చే వారం నుంచి ప్రారంభంకానున్న ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్స్కు ముందు ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధుకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఇదిలా ఉంటే, ఇదే టోర్నీలో భారత షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్, లక్ష్యసేన్‌లు తొలి రౌండ్లో ప్రత్యర్ధులపై సునాయాస విజయాలు సాధించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. శ్రీకాంత్.. ఫ్రాన్స్ షట్లర్ బ్రిస్ లెవర్డెజ్‌ను 21-10, 13-21, 21-7 తేడాతో ఓడించగా, మహిళల సింగిల్స్‌లో నెహ్వాల్.. క్లారా అజుర్మెండిపై 21-15, 17-21, 21-14తో, లక్ష్యసేన్.. వాంగ్ చారోయెన్‌పై 21-6, 22-20 తేడాతో విజయం సాధించారు. చదవండి: Gautam Gambhir: రోహిత్ శర్మ కారణంగా నిద్రలేని రాత్రులు గడిపాను.. ! -
జర్మన్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ల దూకుడు
జర్మన్ ఓపెన్ 2022లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ శుభారంభం చేశారు. తొలి రౌండ్లో వీరిరువురు ప్రత్యర్ధులపై సునాయాస విజయాలు సాధించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు.. థాయ్‌లాండ్ షట్లర్ బుసానన్ ఆగ్‌బమ్‌రుగ్ఫన్‌ను వరుస గేముల్లో ఓడించింది. కేవలం 32 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు 21-8, 21-7తో ప్రత్యర్ధిని చిత్తు చేసింది. 𝐀𝐚𝐫𝐚𝐦𝐛𝐡 🔥🏸⏰ 2:30 pm IST onwards (Tentative)#GermanOpen2022#Badminton pic.twitter.com/X1K1kP9owX— BAI Media (@BAI_Media) March 8, 2022 పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కిదాంబి శ్రీకాంత్.. ఫ్రాన్స్ షట్లర్ బ్రిస్ లెవర్డెజ్‌ను 21-10, 13-21, 21-7 తేడాతో ఓడించాడు. 48 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ అద్భుతమైన షాట్లతో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. ఇదే టోర్నీలో భారత షట్లర్లు సైనా నెహ్వాల్, హెచ్ఎస్ ప్రణయ్ తొలి రౌండ్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. స్పెయిన్ అమ్మాయి క్లారా అజుర్మెండితో సైనా.. హాంగ్‌కాంగ్ షట్లర్ ఆంగుస్ కా లాంగ్‌తో ప్రణయ్ పోటీపడాల్సి ఉంది. చదవండి: PAK Vs AUS: వార్నర్ ఏమాత్రం తగ్గట్లేదుగా.. ఈసారి భల్లే భల్లే డ్యాన్స్‌తో..! -
ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్
జర్మన్ ఓపెన్ బ్యాడ్మింటన్ ముల్హిమ్ ఎన్ డెర్ రుర్ (జర్మనీ): భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ జర్మన్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో 12వ సీడ్ శ్రీకాంత్ 21–17, 21–18తో యుసుకె ఒనొడెరా (జపాన్)పై విజయం సాధించాడు. శుక్రవారం జరిగే ప్రిక్వార్టర్స్‌లో అతను... రెండో సీడ్ చెన్ లాంగ్ (చైనా)తో తలపడతాడు. ఒక్క శ్రీకాంత్ మినహా మిగిలిన భారత ఆటగాళ్లంతా రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. -
జర్మన్ ఓపెన్‌కు సైనా దూరం
ముల్హింమ్ ఎన్ డెర్ రూర్:భారత్ స్టార్ షట్లర్, ప్రపంచ రెండో ర్యాంకు క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జర్మన్ గ్రాండ్ ప్రి గోల్డ్ ఓపెన్ నుంచి వైదొలిగింది. ఫిట్ నెన్ సమస్య కారణంగా మంగళవారం నుంచి ఆరంభకానున్న జర్మన్ ఓపెన్‌కు సైనా దూరమైంది. గతేడాది చీలమండ గాయానికి గురైన సైనా.. పూర్తి ఫిట్ నెస్‌ను సాధించే పనిలో పడింది. త్వరలో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ జరుగనున్న నేపథ్యంలో అప్పటికి గాయం నుంచి పూర్తిగా కోలుకోవాలని సైనా భావిస్తోంది. దీంతో మహిళల బ్యాడ్మింటన్ జట్టుకు పివి సింధు సారథ్యం వహించనుంది. మరోవైపు పురుషుల బ్యాడ్మింటన్‌కు భారత్ తరపున కిడాంబి శ్రీకాంత్ నాయకత్వం వహించనున్నాడు.