ముల్హీమ్: భారత యువ షట్లర్, గత ఏడాది రన్నరప్ లక్ష్య సేన్ ఈ సారి జర్మన్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. నేటినుంచి జరిగే ఈ టోర్నీలో అతను ఆరో సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. తొలి రౌండ్‌లో లక్ష్య ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్టో పొపోవ్‌తో తలపడతాడు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యతో పాటు మిథున్ మంజునాథ్ బరిలో ఉన్నాడు.
అయితే మరో భారత టాప్ ఆటగాడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిడాంబి శ్రీకాంత్ అనూహ్యంగా ఈ టోర్నీకి దూరమయ్యాడు. సరైన సమయంలో అతనికి వీసా లభించకపోవడంతో శ్రీకాంత్ తప్పుకోవాల్సి వచ్చింది. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, మాళవిక బన్సోద్, తస్నీమ్ మీర్ బరిలో నిలిచారు. పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్‌లలో భారత్‌నుంచి ఒక్క ఎంట్రీ కూడా లేకపోగా...మిక్స్‌డ్ డబుల్స్‌లో సుమీత్ రెడ్డి – అశ్విన్ పొన్నప్ప ద్వయం పోటీ పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment