కాల్గరీ: కెనడా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో లక్ష్య సేన్... మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.
శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–15, 21–11తో వైగోర్ కొల్హో (బ్రెజిల్)పై నెగ్గగా... సింధుకు ఆమె ప్రత్యర్థి నత్సుకి నిదైరా (జపాన్) నుంచి వాకోవర్ లభించింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో విష్ణువర్ధన్–కృష్ణప్రసాద్ ద్వయం 9–21, 11–21తో రెండో సీడ్ అహసాన్–సెతియవాన్ (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడింది.
బ్రిజ్‌భూషణ్‌కు కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులో అరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిశీలించిన ఢిల్లీ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ హర్జీత్ సింగ్ జస్పాల్ ఈ కేసులో విచారించేందుకు తగిన సాక్ష్యాధారాలున్నాయని తెలిపారు. ఈ నెల 18న కోర్టు ముందు హాజరు కావాలని బ్రిజ్‌భూషణ్‌కు సమన్లు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment