Canada open
-
సెమీఫైనల్లో ప్రియాన్షు పరాజయం
కెనడా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ప్లేయర్ ప్రియాన్షు రజావత్ పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 39వ ర్యాంకర్ ప్రియాన్షు 17–21, 10–21తో ప్రపంచ 37వ ర్యాంకర్ అలెక్స్ లేనియర్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. క్వార్టర్ ఫైనల్లో నాలుగో ర్యాంకర్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)పై సంచలన విజయం సాధించిన ప్రియాన్షు సెమీఫైనల్లో మాత్రం తడబడ్డాడు. ప్రియాన్షుకు 6,090 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షలు), 6,420 పాయింట్లు లభించాయి. -
క్వార్టర్ ఫైనల్లో గాయత్రి – ట్రెసా జోడి
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నీ కెనడా ఓపెన్‌లో పుల్లెల గాయత్రి గోపీచంద్ – ట్రెసా జాలీ జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మూడో సీడ్ గాయత్రి – ట్రెసా 17–21, 21–7, 21–8 స్కోరుతో నటాషా ఆంథోనిసెన్ (డెన్మార్క్) – అలీసా టిర్‌టొసెన్‌టొనొ (నెదర్లాండ్స్)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో ప్రియాన్షు రజావత్ కూడా క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టాడు. ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో ప్రపంచ 39వ ర్యాంకర్ ప్రియాన్షు 21–19, 21–11తో టకూమా ఒబయాషీ (జపాన్)పై గెలుపొందాడు. అయితే ఇతర భారత షట్లర్లకు రెండో రౌండ్లో నిరాశే ఎదురైంది. పురుషుల డబుల్స్‌లో గారగ కృష్ణప్రసాద్ – కె.సాయిప్రతీక్ 21–19, 18–21, 17–21తో బింగ్ వీ – చింగ్ హెంగ్ (చైనీస్ తైపీ) చేతిలో...మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్ – గద్దె రుత్విక శివాని 15–21, 21–19, 9–21తో చెంగ్ కువాన్ – యిన్ హుయి (చైనీస్ తైపీ)చేతిలో పరాజయంపాలయ్యారు. -
చరిత్ర సృష్టించిన లక్ష్య సేన్
కాల్గరీ: ఏడాదిన్నర తర్వాత భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ మరో అంతర్జాతీయ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. కెనడా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో లక్ష్య సేన్ చాంపియన్‌గా అవతరించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 19వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–18, 22–20తో ప్రపంచ పదో ర్యాంకర్, ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ షి ఫెంగ్ లీ (చైనా)పై గెలుపొందాడు. గత ఏడాది జనవరిలో ఇండియా ఓపెన్ టైటిల్ సాధించాక లక్ష్య సేన్ నెగ్గిన మరో అంతర్జాతీయ టైటిల్ ఇదే కావడం విశేషం. టైటిల్ నెగ్గిన లక్ష్య సేన్‌కు 31,500 డాలర్ల (రూ. 25 లక్షల 99 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 9200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గత ఏడాది ఆగస్టులో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో వ్యక్తిగత స్వర్ణ పతకం గెలిచిన లక్ష్య సేన్ ఈ సంవత్సరం తాను పాల్గొన్న 12వ టోర్నీలో తొలిసారి విజేతగా నిలిచాడు. షి ఫెంగ్ లీపై గతంలో నాలుగుసార్లు నెగ్గిన లక్ష్య సేన్‌కు ఈసారీ గట్టిపోటీనే ఎదురైంది. 50 నిమిషాలపాటు సాగిన ఈ పోరులో లక్ష్య సేన్ కీలకదశలో విజృంభించి పాయింట్లు గెలిచాడు. తొలి గేమ్‌లో స్కోరు 15–15తో సమంగా ఉన్నపుడు లక్ష్య సేన్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి 18–15తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో స్కోరు 5–6 వద్ద ఉన్నపుడు షి ఫెంగ్ లీ వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 11–6తో ముందంజ వేశాడు. అనంతరం ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ షి ఫెంగ్ లీ 20–16తో నాలుగు గేమ్ పాయింట్లు సంపాదించాడు. అయితే లక్ష్య సేన్ దూకుడుగా ఆడి ఊహించనిరీతిలో వరుసగా ఆరు పాయింట్లు గెలిచాడు. తద్వారా రెండో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ‘ఒలింపిక్ అర్హత సంవత్సరం కావడం, దానికి తోడు అన్నీ నాకు ప్రతికూల ఫలితాలు వస్తున్న సమయంలో ఈ విజయం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఈ టోర్నీ కొనసాగినకొద్దీ నా ఆటతీరు మెరుగైంది. ఫైనల్లో రెండో గేమ్‌లో వెనుకబడిన దశలో సంయమనం కోల్పోకుండా ఆడాలని నిర్ణయించుకున్నాను. ఇది ఫలితాన్నిచ్చింది’ అని ఉత్తరాఖండ్‌కు చెందిన 21 ఏళ్ల లక్ష్య సేన్ వ్యాఖ్యానించాడు. Congratulations to the talented @lakshya_sen on his outstanding victory at the Canada Open 2023! His triumph is a testament to his tenacity and determination. It also fills our nation with immense pride. My best wishes to him for his upcoming endeavours. pic.twitter.com/DqCDmNSbhk— Narendra Modi (@narendramodi) July 10, 2023 Sometimes, the hardest battles lead to the sweetest victories. The wait is over, and I am delighted to be crowned the Canada Open winner! Grateful beyond words 🎉🏆 #SenMode #BWFWorldTour#CanadaOpen2023 pic.twitter.com/u8b7YzPX01— Lakshya Sen (@lakshya_sen) July 10, 2023 -
కెనడా ఓపెన్ టైటిల్ విజేత లక్ష్య సేన్
కెనడా ఓపెన్ టైటిల్ విజేతగా భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ నిలిచాడు. సోమవారం జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన లిషి ఫెంగ్‌పై 21-18, 22-20 తేడాతో వరుస గేమ్‌లలో లక్ష్య సేన్ విజయం సాధించాడు. ఇది అతడికి రెండో బీడబ్ల్యూఎఫ్ సూపర్ 500 టైటిల్ కావడం విశేషం. ఈ టోర్నీ ఆరంభం నుంచి అదరగొడుతున్న లక్ష్య సేన్ టైటిల్ పోరులో కూడా చెలరేగి పోయాడు. వరల్డ్ రాంకింగ్స్ లో తన కంటే మెరుగైన స్థానంలో ఉన్న చైనా ప్లేయర్ పై పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. రెండో గేమ్ లో ప్రత్యర్ధి కాస్త పోటీ ఇచ్చిన కీలక సమయంలో ఆధిక్యం నిలుపుకుని టైటిల్ గెలుచుకున్నాడు. ఇక మరో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్‌లో ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. చదవండి: సంచలనం.. 17 ఏళ్ల కుర్రాడి చేతిలో విశ్వనాథన్ ఆనంద్ ఓటమి -
పీవీ సింధుకు ఘోర పరాభవం.. సెమీ ఫైనల్లో ఓటమి! ఫైనల్లో లక్ష్య సేన్
కెనడా ఓపెన్ సెమీ ఫైనల్లో భారత స్టార్ షెట్లర్ పీవీ సింధుకు చుక్కెదురైంది. ఆదివారం ఉదయం జరిగిన సెమీఫైనల్లో జపాన్‌కు చెందిన అకానే యమగుచి చేతిలో 14-21,15-21 తేడాతో సింధు ఓటమి పాలైంది. రెండు గేమ్స్‌లోనూ సింధుపై యమగుచి అధిపత్యం చెలాయించింది. కాగా యమగుచి చేతిలో సింధు ఓడిపోవడం వరుసగా ఇది రెండో సారి కావడం గమనార్హం. సింగపూర్ ఓపెన్-2023లో తొలిరౌండ్లోనే సింధును ఈ జపాన్ స్టార్ షెట్లర్ ఓడించింది. ఇక గాయం నుంచి కోలుకున్న తర్వాత సింధు మునుపటిలా ప్రదర్శన చేయలేకపోతోంది. తాజాగా బీడబ్ల్యూఎఫ్ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లోనూ మూడు స్ధానాలు దిగజారి 15వ ర్యాంక్‌లో సింధు నిలిచింది. ఫైనల్లో లక్ష్య సేన్ ఇక పీవీ సింధు నిరాశపరిచినప్పటికీ మరో భారత షెట్లర్ లక్ష్య సేన్ మాత్రం అదరగొట్టాడు. కెనడా ఓపెన్ ఫైనల్లోకి లక్ష్య సేన్ అడుగుపెట్టాడు. సెమీఫైనల్లో జపాన్‌కు చెందిన కెంటా నిషిత్మోటోను 21-17, 21-14 వరుస గేమ్‌లలో ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ విజయంతో లక్ష్య సేన్ దాదాపు ఏడాది తర్వాత బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. చదవండి: ఆసియా క్రీడలకు భారత టీటీ జట్టులో శ్రీజ.. జట్ల వివరాలివే -
అదరగొట్టిన పీవీ సింధు, లక్ష్య సేన్
కాల్గరీ: కెనడా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో లక్ష్య సేన్... మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–15, 21–11తో వైగోర్ కొల్హో (బ్రెజిల్)పై నెగ్గగా... సింధుకు ఆమె ప్రత్యర్థి నత్సుకి నిదైరా (జపాన్) నుంచి వాకోవర్ లభించింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో విష్ణువర్ధన్–కృష్ణప్రసాద్ ద్వయం 9–21, 11–21తో రెండో సీడ్ అహసాన్–సెతియవాన్ (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడింది. బ్రిజ్‌భూషణ్‌కు కోర్టు సమన్లు న్యూఢిల్లీ: రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులో అరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిశీలించిన ఢిల్లీ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ హర్జీత్ సింగ్ జస్పాల్ ఈ కేసులో విచారించేందుకు తగిన సాక్ష్యాధారాలున్నాయని తెలిపారు. ఈ నెల 18న కోర్టు ముందు హాజరు కావాలని బ్రిజ్‌భూషణ్‌కు సమన్లు జారీ చేశారు. -
హలెప్ హ్యాట్రిక్.. మూడోసారి కెనడా ఓపెన్ నెగ్గిన రొమేనియా స్టార్
రొమేనియా స్టార్ సిమోనా హలెప్ మూడోసారి టొరంటో ఓపెన్ డబ్ల్యూటీఏ మాస్టర్స్–1000 టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో హలెప్.. బ్రెజిల్‌కు చెందిన బీట్రిజ్ హదాద్ మయాస్పై 6-3, 2-6, 6-3 తేడాతో విజయం సాధించింది. సెమీస్‌లో జెస్సికా పెగూలా (అమెరికా)పై 2–6, 6–3, 6–4తో పోరాడి నెగ్గిన హలెప్.. ఫైనల్లోనూ అదే పోరాట పటిమ కనబర్చి టైటిల్‌ను కైవసం చేసుకుంది. తుది సమరంలో తొలి సెట్ సునయాసంగా గెలిచిన హలెప్.. రెండో సెట్లో ప్రత్యర్ధి నుంచి ఊహించని పోరాటం ఎదురుకావడంతో తడబడి 2-6తో చేజార్చుకుంది. అయితే కీలకమైన మూడో సెట్లో ప్రత్యర్ధికి పుంజుకునే అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. తద్వారా మూడో కెనాడిన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2016, 2018లో హలెప్ ఈ టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచింది. -
సెమీస్‌లో నిష్క్రమించిన సానియా జోడీ
టొరంబో ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టెన్నిస్ టోర్నీ నుంచి సానియా మీర్జా (భారత్) –మాడిసన్ కీస్ (అమెరికా) జోడీ నిష్క్రమించింది. వరల్డ్ నంబర్ త్రీ కోకో గాఫ్–జెస్సికా పెగూలా (అమెరికా) జోడీతో జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా–మాడిసన్ కీస్ ద్వయం 5–7, 5–7తో ఓడిపోయింది. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా –కీస్ జోడీ మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసి, తమ సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. సెమీస్‌లో ఓడిన సానియా–కీస్ జోడీకి 39,680 డాలర్ల (రూ. 31 లక్షల 60 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ప్రిక్వార్టర్స్‌లో సానియా జోడీ
టొరంటో: కెనడియన్ ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మహిళల డబుల్స్‌లో శుభారంభం చేసింది. అమెరికా ప్లేయర్ మాడిసన్ కీస్‌తో జతకట్టిన సానియా తొలి రౌండ్లో 6–4, 3–6, 10–6తో అలైజ్ కార్నెట్ (ఫ్రాన్స్)–జిల్ టెయిక్మన్ (స్విట్జర్లాండ్) జంటపై విజయం సాధించింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో సానియా జోడీ... టాప్‌సీడ్ వెరొనిక కుడెర్మెటోవా (రష్యా)– ఎలైజ్ మెర్టెన్స్ (బెల్జియం) జంటతో తలపడుతుంది. మరో వైపు మాంట్రియల్ ఓపెన్ ఏటీపీ టోర్నమెంట్లో భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న జోడీ కూడా ప్రిక్వార్టర్స్ చేరింది. తొలి రౌండ్లో బోపన్న–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) ద్వయం 7–6 (7/5), 4–6, 10–6తో డెనిస్ షపొవలోవ్ (కెనడా)– కరెన్ కచనొవ్ (రష్యా) జంటపై గెలిచింది. ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జోడీ పొలండ్‌కు చెందిన జెలిన్స్కీ–హుర్కాజ్ జంటతో తలపడుతుంది. -
ఎవరీ బియాంక..!
ఏడాది క్రితం వరకు టాప్–150లో కూడా లేని బియాంక నేడు గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరించింది. యూఎస్ ఓపెన్ చాంపియన్ కావాలని మూడేళ్ల క్రితమే బియాంక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2016లో ప్రతిష్టాత్మక జూనియర్ టోర్నీ ఆరెంజ్ బౌల్ టైటిల్ సాధించిన బియాంక... యూఎస్ ఓపెన్ చాంపియన్‌కు ఇచ్చే చెక్ ప్రతిని తయారు చేసుకొని దానిపై తన పేరును రాసుకుంది. మూడేళ్ల తర్వాత బియాంక ఏకంగా నిజమైన చెక్‌నే అందుకోవడం విశేషం. బియాంక తల్లిదండ్రులు మారియా, నికూ 1994లో రొమేనియా నుంచి కెనడాకు వలస వెళ్లి స్థిరపడ్డారు. 2000 జూన్ 16న టొరంటోలో బియాంక జన్మించింది. ఏడేళ్ల ప్రాయంలో రాకెట్ పట్టుకున్న బియాంక నాలుగేళ్ల తర్వాత కెనడా జాతీయ టెన్నిస్ ప్రోగ్రామ్‌లో భాగమైంది. కెరీర్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టింది. 2016లో రోజర్స్ కప్ టోర్నీ సందర్భంగా సిమోనా హలెప్ సూచనతో ప్రొఫెషనల్‌గా మారింది. తల్లి మారియా పర్యవేక్షణలో 12 ఏళ్ల ప్రాయం నుంచే ధ్యానం చేసే అలవాటు చేసుకున్న బియాంక 2017లో వింబుల్డన్ టోర్నీ మెయిన్ ‘డ్రా’లో అడుగుపెట్టి తొలి రౌండ్లో నిష్క్రమించింది. 2018లో నిలకడగా ఆడిన ఆమె ఈ ఏడాది మరింత రాటుదేలింది. ప్రీమియర్ ఈవెంట్ టోర్నీలైన ఇండియన్ వెల్స్ ఓపెన్, రోజర్స్ కప్ టోర్నీల్లో టైటిల్స్ గెలిచి యూఎస్ ఓపెన్‌లో అడుగు పెట్టింది. తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ ఏకంగా గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా నిలిచింది. గాయాల బారిన పడకుండా... తన ఆటను మరింత మెరుగుపర్చుకుంటే 2020లో బియాంక ఖాతాలో మరిన్ని టైటిల్స్ చేరే అవకాశముంది. -
భారత్ డబుల్ ధమాకా
కాల్గరీ(కెనడా): కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రిలో భారత షట్లర్లు సత్తా చాటారు. కాల్గరీలో జరిగిన బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్, డబుల్స్ టైటిల్స్‌ను భారత ఆటగాళ్లు కైవసం చేసుకుని డబుల్ ధమాకా సృష్టించారు. పురుషుల సింగిల్స్ తుది పోరులో సాయి ప్రణీత్ 21-12, 21-10 తేడాతో లీ హుయున్ (కొరియా)పై విజయం సాధించి టైటిల్ సాధించగా, పురుషుల డబుల్స్‌లో మను అత్రి-బి సుమీత్ రెడ్డి జోడి 21-8, 21-14 తేడాతో అడ్రియన్ లియూ-టోబీ నిగ్(కెనడా) ద్వయంపై గెలిచి టైటిల్‌ను దక్కించుకుంది. పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్ అద్వితీయ ప్రదర్శన కనబరిచాడు. తొలి గేమ్‌లో ఆది నుంచి ఆధిక్యంలో దూసుకెళ్లిన ప్రణీత్.. ఆ గేమ్‌ను దక్కించుకుని పైచేయి సాధించాడు. ఆపై రెండో గేమ్‌లో ప్రణీత్ మరింత దూకుడుగా ఆడాడు. ప్రత్యర్ధి లీ హూన్ ముప్పు తిప్పలు పెట్టి భారీ తేడాతో రెండో గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. తద్వారా కెనడా ఓపెన్ టైటిల్‌ను తొలిసారి తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సిరీస్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ తుది పోరులో రెండు సార్లు ఒలింపిక్ రజత పతక విజేత లీ చాంగ్ వుయ్(మలేషియా)ను ఓడించి టైటిల్‌ను దక్కించుకున్న సాయి ప్రణీత్.. కెనడా గ్రాండ్ ప్రిలో ఆద్యంతం ఆకట్టుకుని విజేతగా నిలిచాడు. మరోవైపు పురుషుల డబుల్స్ లో మను అత్రి-బి సుమీత్ రెడ్డిల జోడి ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. తొలి గేమ్‌ను అవలీలగా గెలుచుకున్న ఈ జోడి, రెండో గేమ్‌లో మాత్రం కాస్త ప్రతిఘటన ఎదురైనా చివరి వరకూ పోరాడి టైటిల్ సాధించింది. -
సెమీస్‌లో సాయిప్రణీత్
కాల్గరీ(కెనడా): కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లు అజయ్ జయరామ్, సాయి ప్రణీత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో టాప్ సీడ్ జయరామ్ 21-18, 19-21, 21-8తో హ ర్షిల్ డానీ (భారత్)పై గెలుపొందగా... నాలుగో సీడ్ ప్రణీత్ 21-14, 21-16తో రాల్ మస్త్ (ఈస్టోనియా)పై విజయం సాధించాడు. మరోవైపు మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో భారత అమ్మాయిలు నిరాశ పరిచారు. రుత్విక 16-21, 12-21తో లిండా జెట్చిరి (బల్గేరియా) చేతిలో ఓటమి పాలవగా... తన్వి 16-21, 21-15, 10-21తో వాంగ్ (యూఎస్ఏ) చేతిలో పరాజయం చవిచూసింది. -
సెమీస్‌లో సాయి ప్రణీత్, జయరామ్
కాల్గారి: కెనడా గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లు సాయి ప్రణీత్, అజయ్ జయరామ్‌లు సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ జయరామ్ 21-18 19-21-21-8 తేడాతో భారత్ కే చెందిన హర్షిల్ డానిపై గెలిచి సెమీస్ కు చేరాడు. కేవలం 47 నిమిషాలపాటు జరిగిన పోరులో జయరామ్ ఆద్యంతం ఆకట్టుకుని సెమీస్ లో కి ప్రవేశించాడు. మరో క్వార్టర్ పోరులో నాల్గో సీడ్ సాయి ప్రణీత్ 21-14, 21-16 తేడాతో ఎనిమిదో సీడ్ రౌల్ మస్త్(ఎస్టోనియా)పై గెలిచి సెమీస్‌లోకి దూసుకెళ్లాడు. తమ తదుపరి పోరులో లి హున్(కొరియా)తో జయరామ్ తలపడనుండగా, బ్రైస్ లివర్డెజ్(ఫ్రెంచ్)తో సాయి ప్రణీత్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఇదిలా ఉండగా, భారత ఆటగాడు, రెండో సీడ్ హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్స్ లో ఓటమి పాలయ్యాడు. ప్రణయ్ 22-20, 21-23, 18-21 తేడాతో లివర్డెజ్పై పరాజయం చెందాడు. -
రోజర్స్ కప్ లో సానియా జోడి ఓటమి
టొరంటో: రోజర్స్ కప్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మిర్జా జోడి పోరాటం ముగిసింది. ఇక్కడ జరిగిన మహిళల డబుల్స్ సెమీస్ లో సానియా మిర్జా-మార్టినా హింగిస్ జోడి 6-3, 6-2 తేడాతో కరోలైన్ గార్సియా-క్యాథరినా ద్వయం చేతిలో ఓటమి చవిచూసింది. భారత్-స్విస్ జంట మొదటి సెట్లో రెండు డబుల్ ఫాల్ట్స్ చేశారు. ఆ తర్వాత మూడు అవకాశాలు వచ్చినా వాటిని చేజార్చుకున్నారు. రెండు బ్రేక్ పాయింట్లను సాధించి కరోలైన్-క్యాథరినా ద్వయం తొలి సెట్ కైవసం చేసుకుంది. రెండో సెట్లోనూ సానియా జంట డబుల్ ఫాల్ట్స్, అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నారు. దీంతో కెనడా ఓపెన్ టోర్నమెంట్లో వీరి పోరు సెమీస్ లోనే ముగిసి ఇంటి దారి పట్టాల్సి వచ్చింది. మ్యాచ్ లో మొత్తం 54 పాయింట్లు సాధించి సెమీస్ గెలిచి కరోలైన్-క్యాథరినా ఫైనల్లోకి ప్రవేశించారు.