సెమీస్‌లో సాయిప్రణీత్ | Canada Open: Ajay Jayaram, B Sai Pranetth make semi-finals, Ruthvika Gadde, Tanvi Lad lose | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సాయిప్రణీత్

Published Sun, Jul 3 2016 2:03 AM | Last Updated on Mon, Sep 4 2017 3:59 AM

Canada Open: Ajay Jayaram, B Sai Pranetth make semi-finals, Ruthvika Gadde, Tanvi Lad lose

కాల్గరీ(కెనడా): కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు అజయ్ జయరామ్, సాయి ప్రణీత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో టాప్ సీడ్ జయరామ్ 21-18, 19-21, 21-8తో హ ర్షిల్ డానీ (భారత్)పై గెలుపొందగా... నాలుగో సీడ్ ప్రణీత్ 21-14, 21-16తో రాల్ మస్త్ (ఈస్టోనియా)పై విజయం సాధించాడు.  మరోవైపు మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో భారత అమ్మాయిలు నిరాశ పరిచారు. రుత్విక 16-21, 12-21తో లిండా జెట్చిరి (బల్గేరియా) చేతిలో ఓటమి పాలవగా... తన్వి 16-21, 21-15, 10-21తో వాంగ్ (యూఎస్‌ఏ) చేతిలో పరాజయం చవిచూసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement