క్వార్టర్‌ ఫైనల్లో గాయత్రి – ట్రెసా జోడి | Gayathri and Tresa pair in quarter final | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో గాయత్రి – ట్రెసా జోడి

Jul 6 2024 4:12 AM | Updated on Jul 6 2024 4:12 AM

Gayathri and Tresa pair in quarter final

బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ 500 టోర్నీ కెనడా ఓపెన్‌లో పుల్లెల గాయత్రి గోపీచంద్‌ – ట్రెసా జాలీ జోడి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో మూడో సీడ్‌ గాయత్రి – ట్రెసా 17–21, 21–7, 21–8 స్కోరుతో నటాషా ఆంథోనిసెన్‌ (డెన్మార్క్‌) – అలీసా టిర్‌టొసెన్‌టొనొ (నెదర్లాండ్స్‌)పై విజయం సాధించింది. 

పురుషుల సింగిల్స్‌లో ప్రియాన్షు రజావత్‌ కూడా క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టాడు. ప్రిక్వార్టర్‌ మ్యాచ్‌లో ప్రపంచ 39వ ర్యాంకర్‌ ప్రియాన్షు 21–19, 21–11తో టకూమా ఒబయాషీ (జపాన్‌)పై గెలుపొందాడు. అయితే ఇతర భారత షట్లర్లకు రెండో రౌండ్‌లో నిరాశే ఎదురైంది. 

పురుషుల డబుల్స్‌లో గారగ కృష్ణప్రసాద్‌ – కె.సాయిప్రతీక్‌ 21–19, 18–21, 17–21తో బింగ్‌ వీ – చింగ్‌ హెంగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో...మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రోహన్‌ కపూర్‌ – గద్దె రుత్విక శివాని 15–21, 21–19, 9–21తో చెంగ్‌ కువాన్‌ – యిన్‌ హుయి (చైనీస్‌ తైపీ)చేతిలో పరాజయంపాలయ్యారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement