Lakshya Sen Seals Canada Open Title Beating All England Champion Li Shi Feng - Sakshi
Sakshi News home page

Canada Open: కెనడా ఓపెన్ టైటిల్‌ విజేత లక్ష్య సేన్

Published Mon, Jul 10 2023 11:34 AM | Last Updated on Mon, Jul 10 2023 11:46 AM

Lakshya Sen Seals Canada Open Title Beating All England Champion Li Shi Feng - Sakshi

కెనడా ఓపెన్‌ టైటిల్‌ విజేతగా భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్య సేన్ నిలిచాడు. సోమవారం జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన లిషి ఫెంగ్‌పై 21-18, 22-20 తేడాతో వరుస గేమ్‌లలో లక్ష్య సేన్ విజయం సాధించాడు.  ఇది అతడికి రెండో బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ 500 టైటిల్‌ కావడం విశేషం. ఈ టోర్నీ ఆరంభం నుంచి అదరగొడుతున్న లక్ష్య సేన్ టైటిల్ పోరులో కూడా చెలరేగి పోయాడు.

వరల్డ్ రాంకింగ్స్ లో తన కంటే మెరుగైన స్థానంలో ఉన్న చైనా ప్లేయర్ పై పూర్తి ఆధిపత్యం కనబరిచాడు.  రెండో గేమ్ లో ప్రత్యర్ధి కాస్త పోటీ ఇచ్చిన కీలక సమయంలో ఆధిక్యం నిలుపుకుని టైటిల్ గెలుచుకున్నాడు. ఇక మరో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు సెమీస్‌లో ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే.
చదవండి: సంచలనం.. 17 ఏళ్ల కుర్రాడి చేతిలో విశ్వనాథన్‌ ఆనంద్‌ ఓటమి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement