
టొరంబో ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టెన్నిస్ టోర్నీ నుంచి సానియా మీర్జా (భారత్) –మాడిసన్ కీస్ (అమెరికా) జోడీ నిష్క్రమించింది. వరల్డ్ నంబర్ త్రీ కోకో గాఫ్–జెస్సికా పెగూలా (అమెరికా) జోడీతో జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా–మాడిసన్ కీస్ ద్వయం 5–7, 5–7తో ఓడిపోయింది. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా –కీస్ జోడీ మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసి, తమ సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. సెమీస్‌లో ఓడిన సానియా–కీస్ జోడీకి 39,680 డాలర్ల (రూ. 31 లక్షల 60 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment