Madison Keys
-
సెమీస్‌లో నిష్క్రమించిన సానియా జోడీ
టొరంబో ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టెన్నిస్ టోర్నీ నుంచి సానియా మీర్జా (భారత్) –మాడిసన్ కీస్ (అమెరికా) జోడీ నిష్క్రమించింది. వరల్డ్ నంబర్ త్రీ కోకో గాఫ్–జెస్సికా పెగూలా (అమెరికా) జోడీతో జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా–మాడిసన్ కీస్ ద్వయం 5–7, 5–7తో ఓడిపోయింది. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా –కీస్ జోడీ మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసి, తమ సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. సెమీస్‌లో ఓడిన సానియా–కీస్ జోడీకి 39,680 డాలర్ల (రూ. 31 లక్షల 60 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సెమీస్‌లో సానియా జంట
టొరంటో (కెనడా): నేషనల్ బ్యాంక్ ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–మాడిసన్ కీస్ (అమెరికా) జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా–కీస్ ద్వయం 7–5, 3–6, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’ లో సోఫియా కెనిన్ (అమెరికా)–యులియా పుతింత్సెవా (కజకిస్తాన్) జంటను ఓడించింది. 81 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా–మాడిసన్ కీస్ ద్వయం నాలుగు ఏస్‌లు సంధించి, పత్యర్థిజోడీ సర్వీస్‌ను నాలుగు సార్లు బ్రేక్ చేసింది. చదవండి: Chicago Open ATP Challenger Tennis: పోరాడి ఓడిన సాకేత్–యూకీ బాంబ్రీ జోడీ -
క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన సానియా జోడీ
టొరంటో: యూఎస్ ఓపెన్‌కు ముందు సన్నాహకంగా ఆడుతున్న కెనడియన్ ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోరు కొనసాగుతోంది. అమెరికన్ ప్లేయర్ మాడిసన్ కీస్‌తో జతకట్టిన హైదరాబాదీ స్టార్ మహిళల డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సానియా–కీస్ జంట 3–6, 6–4, 10–8తో టాప్ సీడ్ ఎలైజ్ మెర్టెన్స్ (బెల్జియం)– వెరొనిక కుడెర్మెటొవా (రష్యా) జోడీని కంగుతినిపించింది. తొలి సెట్‌ను కోల్పోయిన భారత్–అమెరికా ద్వయం తర్వాత రెండు సెట్లలోనూ పట్టుదలతో ఆడింది. హోరాహోరీగా జరిగిన ఆఖరి మూడో సెట్లో సానియా జోడీ పైచేయి సాధించి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. ఆరో సీడ్ ఒస్టాపెంకో (లాత్వియా)–కిచెనొక్ (ఉక్రెయిన్), పుతిత్సెవా (కజకిస్తాన్)–కెనిన్ (అమెరికా) జోడీల మధ్య జరిగే ప్రిక్వార్టర్స్ విజేతతో సానియా జంట క్వార్టర్స్‌లో తలపడుతుంది. చదవండి: Diamond League 2022: డైమండ్ లీగ్ అథ్లెటిక్స్.. శ్రీశంకర్‌కు ఆరో స్థానం -
ఆస్ట్రేలియా ఓపెన్‌లో బార్టీ సంచలనం... ఫైనల్లో తలపడబోయేది ఆమెతోనే..
స్వదేశీ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు ఆస్ట్రేలియన్ క్రీడాకారిణి యాష్లే బార్టీ తెరదించింది. 42 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్ చేరిన ఆసీస్ ప్లేయర్‌గా ఆమె గుర్తింపు పొందింది. 1980లో చివరిసారిగా వెండీ టర్న్‌బుల్ రూపంలో ఆసీస్ మహిళా క్రీడాకారిణి ఈ మెగా టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించిన ఆస్ట్రేలియన్ క్రీడాకారిణిగా ఘనత సాధించేందుకు బార్టీ మరో విజయం దూరంలో నిలిచింది. అమెరికా క్రీడాకారిణి డానియెల్ కొలిన్స్‌తో శనివారం జరిగే ఫైనల్లో బార్టీ గెలిస్తే 1978లో క్రిస్టీన్ ఒనీల్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల చాంపియన్‌గా నిలిచిన ఆసీస్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందుతుంది. మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియ ఓపెన్‌లో ఈ ఏడాది మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించనుంది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), 27వ సీడ్ డానియల్ కొలిన్స్ (అమెరికా) తొలిసారి ఈ మెగా టోర్నీలో ఫైనల్‌కు అర్హత సాధించారు. గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో యాష్లే బార్టీ 62 నిమిషాల్లో 6–1, 6–3తో అన్‌సీడెడ్ మాడిసన్ కీస్ (అమెరికా)పై... కొలిన్స్ 78 నిమిషాల్లో 6–4, 6–1తో ఏడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)పై విజయం సాధించారు. శనివారం జరిగే ఫైనల్లో బార్టీతో కొలిన్స్ తలపడనుంది. ముఖాముఖి రికార్డులో బార్టీ 3–1తో కొలిన్స్‌పై ఆధిక్యంలో ఉంది. బారీ్టకిది మూడో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కాగా... 28 ఏళ్ల కొలిన్స్ తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో టైటిల్ పోరుకు చేరింది. 25 ఏళ్ల బార్టీ 2019లో ఫ్రెంచ్ ఓపెన్‌లో, 2021లో వింబుల్డన్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. అదే జోరు... టైటిల్ ఫేవరెట్ హోదాకు తగ్గట్టు ఈ టోర్నీలో బార్టీ ఆడుతోంది. ఫైనల్ చేరే క్రమంలో ఆరు మ్యాచ్‌లు ఆడిన బార్టీ 6 గంటల 6 నిమిషాలు మాత్రమే టెన్నిస్ కోర్టులో గడిపింది. ఒక్క సెట్ కూడా తన ప్రత్యర్థులకు కోల్పోని బార్టీ కేవలం 21 గేమ్‌లు మాత్రమే సమర్పించుకుంది. 2017 యూఎస్ ఓపెన్ రన్నరప్ మాడిసన్ కీస్‌తో గురువారం జరిగిన సెమీఫైనల్లో బార్టీకి ఏదశలోనూ పోటీ ఎదురుకాలేదు. ఐదు ఏస్‌లు సంధించి ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయని బార్టీ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగు సార్లు బ్రేక్ చేసింది. 20 విన్నర్స్ కొట్టిన బార్టీ 13 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు 2015 తర్వాత ఆ్రస్టేలియన్ ఓపెన్ సెమీఫైనల్ ఆడిన కీస్ ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ సంపాదించలేదు. ‘బ్రేక్’తో మొదలు... 2020 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఇగా స్వియాటెక్‌తో జరిగిన సెమీఫైనల్లో కొలిన్స్ ఆరంభం నుంచే ఆధిపత్యం చలాయించింది. తొలి సెట్లో, రెండో సెట్లో ఆరంభంలోనే రెండుసార్లు చొప్పున స్వియాటెక్ సర్వీస్‌లను బ్రేక్ చేసిన కొలిన్స్ 4–0తో, 4–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి సెట్లో 0–4తో వెనుకబడ్డాక స్వియాటెక్ కోలుకొని రెండుసార్లు కొలిన్స్ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. అయితే 5–4తో స్కోరు వద్ద కొలిన్స్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్లోనూ 0–4తో వెనుకబడ్డ స్వియాటెక్ ఈసారి మాత్రం ఒక్క గేమ్ మాత్రమే గెలవగలిగింది. ఏడో గేమ్‌లో స్వియాటెక్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన కొలిన్స్ సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకొని ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఏడు ఏస్‌లు సంధించిన కొలిన్స్ 27 విన్నర్స్ కొట్టింది. స్వియాటెక్ నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 13 అనవసర తప్పిదాలు చేసింది. చదవండి: India Captain: భవిష్యత్తు కెప్టెనా... అసలు అతడిలో ఏ స్కిల్ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్ తివారి Made Down Under ™️ 🇦🇺 @ashbarty defeats Madison Keys 6-1 6-3 to become the first home representative to reach the #AusOpen women's singles final since 1980. 🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis #AO2022 pic.twitter.com/C7NtLJySmp — #AusOpen (@AustralianOpen) January 27, 2022 The finishing touch to the opening set 🎨 🇦🇺 @ashbarty draws first blood against Madison Keys, taking the first set 6-1. 🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis #AusOpen • #AO2022 pic.twitter.com/i37x16v6oP — #AusOpen (@AustralianOpen) January 27, 2022 Cool ✅ Calm ✅ Calculated ✅ Swiatek looking as sharp as ever with a beautiful finish 🙌#bondisands • @bondisands pic.twitter.com/2fnl0nLTMh — #AusOpen (@AustralianOpen) January 28, 2022 -
Australian Open: ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆష్లే బార్టీ.. సరికొత్త చరిత్ర
Ashleigh Barty dismantles Madison Keys: ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ ఆష్లే బార్టీ అద్భుత విజయం సాధించింది. అమెరికన్ ప్లేయర్ మేడిసన్ కీస్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది. 1980 తర్వాత మహిళల సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా నిలిచింది. ఇక వరల్డ్ నెంబర్ 1 ఆష్లే.. మేడిసన్ను 6-1, 6-3 తేడాతో మట్టికరిపించి టైటిల్ రేసులోకి దూసుకువెళ్లింది. ఫైనల్లో ఆమె.. ఏడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) లేదంటే... 27వ సీడ్ డానియల్ కొలిన్స్ (అమెరికా)తో తలపడే అవకాశం ఉంది. ఫైనల్లో గెలిస్తే ఆష్లే కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ చేరుతుంది. కాగా 1980లో వెండీ టర్న్‌బల్ తొలిసారిగా మహిళల సింగిల్స్ విభాగంలో ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌కు చేరి రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఆష్లే ఆ రికార్డును సవరించింది. చదవండి: India Captain: భవిష్యత్తు కెప్టెనా... అసలు అతడిలో ఏ స్కిల్ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్ తివారి Made Down Under ™️ 🇦🇺 @ashbarty defeats Madison Keys 6-1 6-3 to become the first home representative to reach the #AusOpen women's singles final since 1980. 🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis #AO2022 pic.twitter.com/C7NtLJySmp — #AusOpen (@AustralianOpen) January 27, 2022 The finishing touch to the opening set 🎨 🇦🇺 @ashbarty draws first blood against Madison Keys, taking the first set 6-1. 🎥: @wwos • @espn • @eurosport • @wowowtennis #AusOpen • #AO2022 pic.twitter.com/i37x16v6oP — #AusOpen (@AustralianOpen) January 27, 2022 -
చాంప్స్ మెద్వెదేవ్, కీస్
సిన్సినాటి (అమెరికా): ప్రతిష్టాత్మక సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ విభాగంలో తొమ్మిదో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా), మహిళల సింగిల్స్ విభాగంలో 16వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) విజేతలుగా నిలిచారు. ఫైనల్స్‌లో మెద్వెదేవ్ 7–6 (7/3), 6–4తో 16వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై విజయం సాధించగా... మాడిసన్ కీస్ 7–5, 7–6 (7/5)తో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా)ను ఓడించింది. మెద్వెదేవ్, కీస్ కెరీర్లో అత్యున్నత శ్రేణి టైటిల్స్ ఇవే కావడం విశేషం. చాంపియ్స్ మెద్వెదేవ్‌కు 11,14,225 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 7 కోట్ల 95 లక్షలు)... మాడిసన్ కీస్‌కు 5,44,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 కోట్ల 88 లక్షలు) లభించాయి. సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)ను ఓడించిన మెద్వెదేవ్ ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించాడు. పది ఏస్‌లను సంధించిన అతను రెండుసార్లు గాఫిన్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. గత రెండు వారాల్లో వాషింగ్టన్ ఓపెన్, మాంట్రియల్ మాస్టర్స్ టోర్నీల్లో ఫైనల్‌కు చేరి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న 23 ఏళ్ల మెద్వెదేవ్ మూడో ప్రయత్నంలో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గిన ఐదో రష్యా ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో రష్యా తరఫున సఫిన్, డెవిడెంకో, చెస్నోకోవ్, ఖచనోవ్ ఈ ఘనత సాధించారు. తాజా విజయంతో ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మెద్వెదేవ్ ఐదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. 2010లో డెవిడెంకో తర్వాత రష్యా ప్లేయర్ టాప్–5లోకి రావడం ఇదే ప్రథమం. కుజ్నెత్సోవాతో జరిగిన ఫైనల్లో కీస్ రెండు సెట్లలోనూ 3–5తో వెనుకబడి పుంజుకోవడం విశేషం. ఫైనల్ చేరే క్రమంలో ఇద్దరు ప్రపంచ మాజీ నంబర్వన్స్ హలెప్ (రొమేనియా), వీనస్ (అమెరికా)లను ఓడించిన కీస్ తుది పోరులోనూ పట్టుదలతో ఆడింది. గంటా 44 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో కీస్ 13 ఏస్‌లు సంధించింది. తాజా విజయంతో కీస్ ఏడాది తర్వాత టాప్–10ర్యాంకింగ్స్‌లోకి వచ్చింది. ఎనిమిది స్థానాలు ఎగబాకిన ఆమె ప్రస్తుతం పదో ర్యాంక్‌లో ఉంది. -
జొకోవిచ్ జోరు
వింబుల్డన్ టైటిల్ గెలిచి ఫామ్‌లోకి వచ్చిన మాజీ నంబర్‌వన్ జొకోవిచ్ తనకెంతో కలిసొచ్చిన యూఎస్ ఓపెన్‌లోనూ దూసుకుపోతున్నాడు. మరో విజయంతో వరుసగా 11వ ఏడాది ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. రెండుసార్లు టైటిల్ గెలిచి, ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచిన అతను ఎనిమిదోసారి ఫైనల్ బెర్త్ కోసం సెమీఫైనల్లో నిషికోరితో పోరుకు సిద్ధమయ్యాడు. న్యూయార్క్: ప్రిక్వార్టర్ ఫైనల్లో రోజర్ ఫెడరర్‌ను మట్టికరిపించిన జాన్ మిల్మన్ను ఏమాత్రం తేలిగ్గా తీసుకోకుండా ఆడిన సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ వరుస సెట్లలో తన ప్రత్యర్థి ఆట కట్టించాడు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో వరుసగా 11వసారి సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. రెండు గంటల 49 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ జొకోవిచ్ 6–3, 6–3, 6–4తో ప్రపంచ 55వ ర్యాంకర్ మిల్మన్ (ఆస్ట్రేలియా)పై గెలుపొందాడు. మ్యాచ్ వరుస సెట్లలో ముగిసినా విజయం కోసం జొకోవిచ్ శ్రమించాల్సి వచ్చింది. ఈ మాజీ చాంపియన్ 20 బ్రేక్ పాయింట్లలో నాలుగింటిని మాత్రమే అనుకూలంగా మల్చుకున్నాడు. నాలుగు డబుల్ ఫాల్ట్‌లతోపాటు 53 అనవసర తప్పిదాలు చేశాడు. అయితే జొకోవిచ్ తప్పిదాలను మిల్మన్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయితే చురు గ్గా కదులుతూ, బంతిని అందుకుంటూ సాధ్యమైన మేర ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టాడు. మిల్మన్ నాలుగు బ్రేక్ పాయింట్లను కాచుకోవడంతో తొలి సెట్ ఆరో గేమ్ 15 నిమిషాలపైగా సాగింది. రెండో సెట్లో ఆటగాళ్లిద్దరూ సుదీర్ఘ ర్యాలీలతో అలరించారు. కానీ ఫినిషింగ్‌లో జొకోవిచే పైచేయి సాధించాడు. మరో క్వార్టర్ ఫైనల్లో 2014 రన్నరప్ నిషికోరి 4 గంటల 8 నిమిషాల పోరులో 2–6, 6–4, 7–6 (7/5), 4–6, 6–4తో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై గెలుపొందాడు. తద్వారా 2014 ఫైనల్లో సిలిచ్ చేతిలో ఫైనల్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. తొలి సెట్‌ను త్వరగానే కోల్పోయి, రెండో సెట్లో 2–4తో వెనుకబడిన నిషికోరి ఒక్కసారిగా పుంజుకున్నాడు. వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి రెండో సెట్‌ను 6–4తో సొంతం చేసుకున్నాడు. మూడో సెట్‌నూ నెగ్గిన నిషికోరి నాలుగో సెట్లో తడబడ్డాడు. కానీ నిర్ణాయక ఐదో సెట్లో కోలుకొని విజయాన్ని దక్కించుకున్నాడు. సెమీఫైనల్స్‌లో జొకోవిచ్‌తో నిషికోరి; రాఫెల్ నాదల్‌తో డెల్‌పొట్రో తలపడతారు. సెమీస్‌లో కీస్... మహిళల సింగిల్స్ విభాగంలో గతేడాది రన్నరప్ మాడిసన్ కీస్ (అమెరికా) సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గంటా 23 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో కీస్ 6–4, 6–3తో కార్లా స్వారెజ్ నవారో (స్పెయిన్)పై విజయం సాధించింది. ఆరు ఏస్‌లు సంధించిన కీస్ రెండు సెట్లలో ఒక్కోసారి స్వారెజ్ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. సెమీఫైనల్స్‌లో జపాన్ అమ్మాయి నయోమి ఒసాకాతో కీస్; సెవస్తోవా (లాత్వియా)తో సెరెనా విలియమ్స్ తలపడతారు. మరో క్వార్టర్ ఫైనల్లో ఒసాకా 6–1, 6–1తో లెసియా సురెంకో (ఉక్రెయిన్)ను అలవోకగా ఓడించింది. ఈ విజయంతో ఒసాకా 22 ఏళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో జపాన్ తరఫున సెమీఫైనల్‌కు చేరిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. చివరిసారి 1996లో కిమికో డాటె జపాన్ తరఫున వింబుల్డన్ టోర్నీలో సెమీఫైనల్ చేరింది. నిషికోరి, ఒసాకా రూపంలో జపాన్ క్రీడాకారులిద్దరు ఒకే గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరడం కూడా ఇదే తొలిసారి. -
గట్టెక్కిన జ్వెరెవ్
పారిస్: మూడో రౌండ్లో మ్యాచ్ పాయింట్ కాపాడుకొని ఊపిరి పీల్చుకున్న జర్మనీ టెన్నిస్ యువతార అలెగ్జాండర్ జ్వెరెవ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనూ పోరాడి గట్టెక్కాడు. ఈ క్రమంలో తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించాడు. టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 4–6, 7–6 (7/4), 2–6, 6–3, 6–3తో కరెన్ ఖచనోవ్ (రష్యా)పై విజయం సాధించాడు. 3 గంటల 29 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్ ఏకంగా 17 ఏస్‌లు సంధించాడు. నాలుగు డబుల్ ఫాల్ట్‌లతోపాటు 51 అవనసర తప్పిదాలు కూడా చేశాడు. ఒకదశలో 1–2 సెట్లతో వెనుకబడిన 21 ఏళ్ల జ్వెరెవ్ చివరి రెండు సెట్లను వరుసగా గెల్చుకొన్ని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ‘నేనింకా యువకుడినే. ఇంకొంత సమయం కోర్టులో గడిపి మీ అందరికీ వినోదం అందిస్తాను’ అని మ్యాచ్ అనంతరం జ్వెరెవ్ సరదాగా వ్యాఖ్యానించాడు. ‘నేను, నా సోదరుడు మిషా జ్వెరెవ్ రోజుకు నాలుగైదు గంటలు జిమ్‌లో గడుపుతాం. ట్రెడ్‌మిల్‌పై సాధన చేస్తాం. ఆ శ్రమ ఈ రోజు ఫలితాన్నిచ్చింది’ అని జ్వెరెవ్ అన్నాడు. క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)తో జ్వెరెవ్ తలపడతాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో థీమ్ 6–2, 6–0, 5–7, 6–4తో 19వ సీడ్ నిషికోరి (జపాన్)పై గెలిచి వరుసగా ఈ టోర్నీలో మూడోసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 6–3, 6–4, 6–2తో ఫెర్నాండో వెర్డాస్కో (స్పెయిన్)పై గెలుపొందగా... అన్‌సీడెడ్ మార్కో సెచినాటో (ఇటలీ) 7–5, 4–6, 6–0, 6–3తో ఎనిమిదో సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం)ను బోల్తా కొట్టించి జొకోవిచ్‌తో క్వార్టర్ ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాడు. స్లోన్ స్టీఫెన్స్ జోరు... మహిళల సింగిల్స్ విభాగంలో అమెరికా యువ తారలు పదో సీడ్ స్లోన్ స్టీఫెన్స్, 13వ సీడ్ మాడిసన్ కీస్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో స్లోన్ స్టీఫెన్స్ 6–2, 6–0తో కొంటావీట్ (ఎస్తోనియా)పై... కీస్ 6–1, 6–4తో బుజర్‌నెస్కూ (రొమేనియా)పై గెలుపొందారు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో 26వ సీడ్ బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) 4–6, 3–6తో యూలియా పుతింత్సెవా (కజకిస్తాన్) చేతిలో పరాజయం పాలైంది. -
యూఎస్ ఓపెన్ టైటిల్ స్టీఫెన్స్దే..
-
యూఎస్ ఓపెన్:స్టీఫెన్స్ వర్సెస్ కీస్
-
కొత్త తారలు వచ్చారు
∙ తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో కీస్, స్టీఫెన్స్ ∙ సెమీస్‌లో ఓడిన వీనస్, వాండవె యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో కొత్త చాంపియన్ వచ్చేందుకు రంగం సిద్ధమైంది. సెమీస్‌లో సత్తా చాటిన అన్‌సీడెడ్ స్లోన్ స్టీఫెన్స్, 15వసీడ్ మాడిసన్ కీస్ తొలిసారి గ్రాండ్‌స్లామ్ తుదిపోరుకు అర్హత సాధించారు. అద్భుతమైన పోరాటపటిమతో స్టీఫెన్స్ తొమ్మిదో సీడ్ వీనస్‌ను కంగు తినిపించగా... వాండవెపై కీస్ అలవోక విజయం సాధించింది. 15 ఏళ్ల తర్వాత ఇద్దరు అమెరికన్ల మధ్య టైటిల్ పోరు జరగనుండటం విశేషం. న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో అమెరికాకు చెందిన మాడిసన్ కీస్, స్లోన్ స్టీఫెన్స్ టైటిల్ పోరుకు అర్హత సంపాదించారు. శుక్రవారం జరిగిన నలుగురు అమెరికన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ మ్యాచ్‌లలో ఏడు గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత, 9వ సీడ్ వీనస్ విలియమ్స్, మరో అమెరికన్ కోకో వాండవె ఓటమి పాలయ్యారు. స్టీఫెన్స్ 6–1, 0–6, 7–5తో వీనస్‌ను కంగుతినిపించగా... కీస్ 6–1, 6–2తో కోకో వాండవెపై అలవోక విజయం సాధించింది. 2002 తర్వాత ఇద్దరు అమెరికా క్రీడాకారిణిల మధ్య టైటిల్ పోరుకు రంగం సిద్ధమైంది. 15 ఏళ్ల క్రితం జరిగిన ఆ తుదిపోరులో సెరెనా విలియమ్స్... తన సోదరి వీనస్‌ను ఓడించి విజేతగా నిలిచింది. స్టీఫెన్స్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో వీనస్ 3 ఏస్‌లను సంధించి, 6 డబుల్ ఫాల్ట్‌లు చేసింది. అయితే ఏకంగా 51 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. మరోవైపు స్టీఫెన్ 2 ఏస్‌లు సంధించి 17 విన్నర్లు కొట్టింది. 27 అనవసర తప్పిదాలు చేసినా చివరకు టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. స్టీఫెన్స్ పోరాడిందిలా...: వీనస్ విలియమ్స్‌తో జరిగిన సెమీస్‌లో స్లోన్ విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డింది. తొలి గేమ్‌ను గెలుచుకొని శుభారంభం చేసింది. ఇదే జోరులో 24 నిమిషాల్లోనే తొలి సెట్‌ను 6–1తో ముగించింది. అయితే రెండో సెట్లో వీనస్ తన అనుభవాన్నంత రంగరించి ప్రత్యర్థిని మట్టికరిపించింది. గంటకు 100 మైళ్ల వేగంతో దూసుకొచ్చే సర్వ్‌లకు స్టీఫెన్స్ చేతులెత్తేసింది. దీంతో ఒక్కగేమైనా గెలవకుండానే 0–6తో సెట్‌ను చేజార్చుకుంది. 30 నిమిషాల్లో వీనస్ ఈ సెట్ గెలిచింది. ఇక నిర్ణాయక మూడో సెట్లో ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. గంట 13 నిమిషాల పాటు ఈ సెట్ సాగింది. తొలి గేమ్‌లో వీనస్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన స్టీఫెన్స్, తర్వాతి గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకుంది. దీంతో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం మూడో గేమ్ సర్వీస్‌కు దిగిన వీనస్ అనవసర తప్పిదాలతో పాయింట్లను కోల్పోయింది. అయితే తర్వాత మూడు గేమ్ పాయింట్లను సాధించి తొలిసారిగా పైచేయి సాధించింది వీనస్. ఫోర్ హ్యాండ్ షాట్లతో విరుచుకుపడిన వెటరన్ స్టార్ ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని చాటింది. అనంతరం తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో సెట్లో 3–2తో జోరు పెంచింది. వెంటనే తేరుకున్న 24 ఏళ్ల స్టీఫెన్స్ వరుసగా 6, 7 గేములను గెలుచుకుంది. దీటుగా బదులిచ్చిన వీనస్ 8, 9 గేమ్‌లను కైవసం చేసుకోవడంతో ఆధిక్యం చేతులు మారింది. కానీ తర్వాత వరుసగా మూడు గేముల్లో స్టీఫెన్స్ అద్భుతంగా పోరాడింది. రెండు సార్లు తన సర్వీస్‌ను కాపాడుకున్న ఆమె ఒక బ్రేక్ పాయింట్‌తో విజయాన్ని ఖాయం చేసుకుంది. అలవోకగా ముగించిన కీస్: మరో సెమీఫైనల్లో 15వ సీడ్ మాడిసన్ కీస్ ప్రత్యర్థికేమాత్రం అవకాశమివ్వకుండా ఏస్‌లతో చెలరేగింది. 6–1తో తొలి సెట్‌ను 23 నిమిషాల్లోనే ముగించింది. తర్వాత సెట్లో వాండవె కాస్త పోరాడే ప్రయత్నం చేసినా కీస్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. 43 నిమిషాల్లో 6–2తో రెండో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో కీస్ 5 ఏస్‌లను సంధించి, 25 విన్నర్స్ కొట్టింది. ఒకసారి మాత్రమే డబుల్ ఫాల్ట్ చేసింది. మరో వైపు 22 అనవసర తప్పిదాలు చేసిన వాండవె కేవలం తొమ్మిదే విన్నర్స్ కొట్టింది. సానియా కథ ముగిసింది మహిళల డబుల్స్ సెమీఫైనల్లో నాలుగో సీడ్ సానియా మీర్జా–షుయ్ పెంగ్ (చైనా) జోడి 4–6, 4–6తో రెండో సీడ్ మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)– యంగ్ జన్ చాన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో పరాజయం చవిచూసింది. -
యూఎస్ ఓపెన్:స్టీఫెన్స్ వర్సెస్ కీస్
న్యూయార్క్:యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. ఈసారి ఇద్దరు అమెరికా అమ్మాయిలు స్లోన్ స్టీఫెన్స్ -మాడిన్సన్ కీస్‌లు తుది పోరులో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలి సెమీ ఫైనల్లో స్లోన్ స్టీఫెన్స్ 6-1, 0-6, 7-5 తేడాతో అమెరికాకే చెందిన తొమ్మిదో సీడ్ వీనస్ విలియమ్స్ పై విజయం సాధించి ఫైనల్లోకి చేరగా, రెండో సెమీ ఫైనల్లో మాడిన్ సన్ కీస్ 6-1,6-2 తేడాతో తన సహచర క్రీడాకారిణి వాండవేగేపై విజయం సాధించి తుది బెర్తును ఖాయం చేసుకున్నారు. దాంతో స్టీఫెన్-కీస్ ల మధ్య ఆదివారం తుది పోరు జరగనుంది. ఈ ఇద్దరి ముఖాముఖి పోరులో స్టెఫెన్స్ 1-0 ఆధిక్యంలో ఉన్నారు. వీరిద్దరూ ఒక గ్రాండ్ స్లామ్ ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి. కాగా, ఇద్దరు అమెరికా టెన్నిస్ ప్లేయర్స్ యూఎస్ ఓపెన్ ఫైనల్లో తలపడటం దాదాపు 15 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి. చివరిసారి 2002లో సెరెనా విలియమ్స్-వీనస్ విలియమ్స్ లు ఫైనల్లో తలపడ్డారు. ఆ పోరులో సెరెనా టైటిల్ ను సొంతం చేసుకున్నారు.