
టొరంటో: యూఎస్ ఓపెన్‌కు ముందు సన్నాహకంగా ఆడుతున్న కెనడియన్ ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోరు కొనసాగుతోంది. అమెరికన్ ప్లేయర్ మాడిసన్ కీస్‌తో జతకట్టిన హైదరాబాదీ స్టార్ మహిళల డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సానియా–కీస్ జంట 3–6, 6–4, 10–8తో టాప్ సీడ్ ఎలైజ్ మెర్టెన్స్ (బెల్జియం)– వెరొనిక కుడెర్మెటొవా (రష్యా) జోడీని కంగుతినిపించింది.
తొలి సెట్‌ను కోల్పోయిన భారత్–అమెరికా ద్వయం తర్వాత రెండు సెట్లలోనూ పట్టుదలతో ఆడింది. హోరాహోరీగా జరిగిన ఆఖరి మూడో సెట్లో సానియా జోడీ పైచేయి సాధించి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. ఆరో సీడ్ ఒస్టాపెంకో (లాత్వియా)–కిచెనొక్ (ఉక్రెయిన్), పుతిత్సెవా (కజకిస్తాన్)–కెనిన్ (అమెరికా) జోడీల మధ్య జరిగే ప్రిక్వార్టర్స్ విజేతతో సానియా జంట క్వార్టర్స్‌లో తలపడుతుంది.
చదవండి: Diamond League 2022: డైమండ్ లీగ్ అథ్లెటిక్స్.. శ్రీశంకర్‌కు ఆరో స్థానం
Comments
Please login to add a commentAdd a comment